హర్రర్ నేపథ్యంలో యారో ఒరువన్ | Background horror in Yaro Oruvan movie | Sakshi
Sakshi News home page

హర్రర్ నేపథ్యంలో యారో ఒరువన్

Published Sat, Nov 1 2014 3:42 AM | Last Updated on Sat, Sep 2 2017 3:39 PM

హర్రర్ నేపథ్యంలో యారో ఒరువన్

హర్రర్ నేపథ్యంలో యారో ఒరువన్

 హర్రర్ చిత్రాల ట్రెండ్ జోరుగా సాగుతోంది. హారర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న మరో చిత్రం యారో ఒరువన్. నవగ్రహ సినీ ఆర్ట్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రానికి కె ఎన్ ప్రైజూ కథ, కథనం, మాటలు, ఛాయాగ్రహణం, ఎడిటింగ్, సంగీతం, దర్శకత్వం అంటూ పలు బాధ్యతలను తన భుజాలపైనే వేసుకుని తెరకెక్కిస్తున్నారు. ఈయన జాతీయ అవార్డు గ్రహీత మలయాళ దర్శకుడు పద్మరాజు వద్ద సహాయ దర్శకుడిగా పనిచేశారు. పలు బుల్లితెర సీరియళ్లకు దర్శకత్వం వహించిన కేఎన్ ప్రైజు తనకు సినిమారంగంలోని అన్ని శాఖల్లోనూ ప్రావీణ్యం ఉండడం వలనే ఈ చిత్రానికి ఇన్ని బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
 
 నవజంట రామ్ ఆధిర హీరో హీరోయిన్లుగా పరిచయం అవుతున్న ఈ యారో ఒరువన్ చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ అదృశ్యం అయిన తన భార్యను కనుగొనే ప్రయత్నంలో హీరో ప్రముఖ డిటెక్టివ్‌తో పాటు ఆయన బృందం ఎదుర్కొనే అమానుష సంఘటనల ఇతివృత్తమే యారో ఒరువన్ చిత్రం అన్నారు. ఇంటిలో అడవుల్లో వారు ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నారన్న అంశాలు ఆద్యంతం ఉత్కంఠ భరితంగా ఉంటాయన్నారు. తెన్మలై అచ్చన్ కోయిల్, కట్లపారై తదితర ప్రాంతాల్లోని దట్టమైన అడవుల్లో చిత్ర షూటింగ్ నిర్వహించినట్లు తెలిపారు. హర్రర్ కథాంశంతో రూపొందిస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తుందని దర్శకుడు కె ఎన్ ప్రైజు పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement