జాతీయ అవార్డు రద్దుకావడంతో బెయిల్‌ఉపసంహరించుకున్న జానీ మాస్టర్
రంగారెడ్డి కోర్టులు: లైంగికదాడి ఆరోపణల నేపథ్యంలో నృత్య దర్శకుడు జానీ మాస్టర్ చంచల్‌గూడ కేంద్ర కారాగారంలో విచారణ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. తనకు ఉత్తమ నృత్య దర్శకుడి అవార్డు వచ్చిందని, అవార్డు అందుకునేందుకు ఢిల్లీ వెళ్లాల్సి ఉన్నందున ఈ నెల 6నుంచి 10 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ గత సోమవారం రంగారెడ్డి జిల్లా ప్రధాన పోక్సో కోర్టు కమ్ 9వ అదనపు జిల్లా కోర్టులో సోమవారం పిటిషన్ దాఖలు చేశాడు.
ఈ పిటిషన్‌పై వాదనలు విన్న కోర్టు గత గురువారం జానీ మాస్టర్‌కు ఈ నెల 6నుండి 9వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది. కాగా జానీ మాస్టర్ అందుకోబోయే పురస్కారాన్ని రద్దు చేసినట్లు తెలియడంతో ఆయన తనకు మంజూరైన మధ్యంతర బెయిల్‌ను వినియోగించుకోబోనని కోర్టులో మెమో దాఖలు చేశాడు. ఇదిలా ఉండగా జానీ మాస్టర్ సాధారణ బెయిల్ పిటిషన్ బుధవారానికి వాయిదా పడింది.
Comments
Please login to add a commentAdd a comment