
హోటళ్లలో అధికారుల తనిఖీలు
చేవెళ్ల: మండల కేంద్రంలో ఉన్న పలు హోటళ్లలో మున్సిపల్ అధికారులు బుధవారం ఉదయం తనిఖీలు చేపట్టారు. కుళ్లిన ఆహార పదార్థాలు గుర్తించి యాజమాన్యానికి జరిమానా విధించారు. మున్సిపాలిటీ అధికారులు రమేశ్, రాఘవేందర్, అమర్, తదితరులు పట్టణ కేంద్రంలోని ఎంజీ ఫుడ్ కోర్టులో(హోటల్) ఆకస్మికంగా సోదాలు చేశారు. అక్కడ కుళ్లిన ఆహార పదార్థాలు(చికెన్, గుడ్లు) కనిపించాయి. ఫ్రీజ్‌లో నిల్వ ఉంచిన వాటిని గుర్తించి పారబోయించారు. అపరిశుభ్రంగా ఉండటంతో హోటల్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతోపాటు రూ.5వేల జరిమానా విధించారు. నాణ్యతా ప్రమాణాలు పాటించకపోతే చర్యలు తప్పవని, హోటళ్లను సీజ్ చేస్తామని హెచ్చరించారు. నిత్యం ఆకస్మికంగా హోటళ్లను తనిఖీలు చేస్తుంటామని పేర్కొన్నారు.
కుళ్లిన ఆహార పదార్థాల వినియోగంపై ఆగ్రహం