వేసవికాలం.. అప్రమత్తతే ముఖ్యం
షాద్‌నగర్: వేసవికాలం నిత్యం ఏదో ఓ చోట అగ్ని ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. సరైన అవగాహన లేకపోవడం, నిబంధనలు పాటించకపోవడం ప్రమాదాలకు కారణం అవుతున్నాయి. దీంతో విలువైన ఆస్తులు అగ్నికి ఆహుతవుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు ఏటా ఏప్రిల్ 14 నుంచి 20వ తేదీ వరకు అగ్నిమాపక జాతీయ వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. ప్రమాదం జరిగితే తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నారు. ఇళ్లు, అపార్ట్‌మెంట్, వ్యాపార సముదాయాలు, పరిశ్రమల్లో ఎండాకాలంలో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. ప్రమాదాల నివారణ కోసం అగ్నిమాపక శాఖ అధికారులు తగిన సూచనలు, సలహాలు అందిస్తున్నారు.
అప్రమత్తంగా ఉండాలి
వేసవిలో అగ్ని ప్రమాదా లు జరిగే అవకాశం ఎక్కు వ. ప్రమాదాలపై నిరంత రం అప్రమత్తంగా ఉండాలి. ప్రజలను అప్రమత్తం చేసేందుకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం
– జగన్, స్టేషన్ ఫైర్ ఆఫీసర్, షాద్‌నగర్
అవగాహనతోనే
అగ్ని ప్రమాదాల నివారణ
కొనసాగుతున్న జాతీయ వారోత్సవాలు
వేసవికాలం.. అప్రమత్తతే ముఖ్యం
వేసవికాలం.. అప్రమత్తతే ముఖ్యం


