padmaraju
-
‘ఎలక్షన్ కింగ్’ పద్మరాజన్.. 238 సార్లు ఓడినా మళ్లీ బరిలోకి..!
ఓటమి.. గెలుపునకు తొలిమెట్టు.. గెలుపునకు నాంది.. ఇట్లా ఏవేవో చెబుతుంటారు. కానీ, ఓటమిని అంగీకరించాలంటే పెద్దమనసే ఉండాలి. అలా.. ఆయన ఓటమిని ఆస్వాదిస్తూ ముందుకు పోతున్నారు. ఒక్కసారిగా కాదు.. 238 సార్లు!! దేశంలో ఎన్నికలు ఏవైనా ఆయన పోటీ చేస్తారు. ఎన్నిసార్లు ఒడినా లెక్కచేయకుండా ఎన్నికల్లో పోటీ చేస్తునే ఉంటారు. ఇప్పటివరకు రాష్ట్రపతి ఎన్నికల నుంచి లోకల్ ఎన్నికల వరకు బరిలో దిగుతూ వచ్చారు. పలు ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన 238 సార్లు ఓటమి పాలయ్యారు. అవన్నీ లెక్క చేయని.. 65 ఏళ్ల ఆ వ్యక్తి 2024 లోక్‌సభ ఎన్నికల్లో కూడా పోటీ చేస్తూ వార్తల్లో నిలిచారు. తమిళనాడుకు చెందిన టైర్లు రిపేర్ చేసే షాప్ ఓనర్ కే. పద్మరాజన్. ఆయన దక్షిణ తమినాడులోని మెట్టూరు పట్టణానికి చెందినవారు. అయితే ప్రతి ఎన్నికలో తాను పోటీ చేస్తున్నందుకు అందరూ నవ్వేవారని తెలిపారు. కానీ, ఓ సామాన్యుడు ఎన్నికల్లో భాగంకావటంపైనే తన దృష్టి ఉంటుందని అంటున్నారు. అయితే ఎన్నికల్లో పోటీచేసే అందరూ విజయాన్ని కాంక్షిస్తారు. కానీ, నేను అలా కాదు. నేను పోటీలో పాల్గొనటమే నా విజయంగా భావిస్తాను. నేను ఓడిపోతున్నాని తెలిసిన మరుక్షణం.. ఆ ఓటమి ఆనందంగా స్వాగతిస్తానని తెలిపారు. స్థానికంగా ‘ఎలక్షన్ కింగ్’అని పిలువబడే పద్మరాజన్.. రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా పోటీ చేయటం గమనార్హం. 1988 నుంచి పలు ఎన్నికల్లో పోటీ చేస్తున్న పద్మరాజు.. అటల్ బిహారీ వాజపేయి, మన్మోహన్ సింగ్, నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీలపై పోటీ చేశారు. ఎన్నికల్లో విజయం ప్రాధాన్యం కాదని, ప్రత్యర్థి ఎవరు? అనేది తాను అస్సలు పట్టించుకోని తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేస్తూ ఎన్నిసార్ల ఓడిపోవటానికైనా సిద్ధమని తెలిపారు. ఇలా ఎన్నికల్లో పోటీ చేయటం అంత సులభం కాదన్నారు. తాను ఇప్పటివరకు ఎన్నికల్లో పోటీ చేయడానికి వేల రూపాయాలు పొగొట్టుకున్నానని తెలిపారు. ముఖ్యంగా సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేయాలంటే సెక్యూరిటీ డిపాజిట్ రూ. 25వేలు. ఎన్నికల్లో పోల్ అయ్యే ఓట్లలో 16 శాతం ఓట్లు పడకపోతే పెట్టిన సెక్యూరిటీ డిపాజిట్ గల్లంతు అవుందని అన్నారు అయితే తాను ఒక్కసారి గెలిచాని..కానీ అది ఎన్నికల్లో కాదన్నారు. దేశంలోనే పలు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోవటంలో లింకా బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాధించటంలో విజయం సాధించానని తెలిపారు. అయితే తాను 2011లో కొంతలో కొంత మెరుగైన ప్రదర్శన కనబరిచినట్లు తెలిపారు. అప్పుడు మెట్టూరు అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీచేసి 6,273 ఓట్లు దక్కించుకున్నానని అన్నారు. విజేతకు 75 వేల ఓట్లు వచ్చాయని తెలిపారు. ఆ ఎన్నికలో కనీసం ఒక్క ఓటు కూడా వస్తుందని అనుకోలేదన్నారు. పద్మరాజు టైర్ రిపేర్ షాప్ నడపటంతో పాటు హోమియోపతి ఔషదాలు తయారీ, లోకల్ మీడియా ఎడిటర్‌గా కూడా పని చేస్తున్నారు. అయితే ఎన్ని ఉద్యోగాలు, పనులు చేసినా... ఎన్నికల బరితో దిగటమే తనకు చాలా ముఖ్యమని స్పష్టం చేశారు. అయితే చాలా మంది ఎన్నికల్లో పోటీ చేయటానికి వెనకడుగు వేస్తారని.. అలాంటి వారికి ప్రేరణ ఇస్తూ, అవగాహన కల్పించటమే తన విధి అని చెప్పుకొచ్చారు. తన చివరి శ్వాస వరకు ఎన్నికల్లో పోటీ చేస్తునే ఉంటానని తెలిపారు. తాను పోటీచేసే ఎన్నికల్లో విజయం సాధిస్తే షాక్ అవుతానని తెలిపారు. ఏడు దశల్లో జరిగే 2024 సార్వత్రిక ఎన్నికల్లో తాను తమిళనాడులోని ధర్మపురి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తున్నానని తెలిపారు. ఆయన నామినేన్ కూడా వేశారు. అయితే తమిళనాడు ఉన్న మొత్తం 39 పార్లమెంట్ స్థానాలకు ఈసారి ఒకే విడతలో లోక్‌సభ పోలింగ్ జరగనుంది. -
ఏపీపీఎస్సీ సభ్యుడిగా పద్మరాజు
బాలాజీచెరువు (కాకినాడ) : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీ పీఎస్సీ)∙సభ్యుడిగా జేఎన్టీయూకే డైరెక్టర్ ఆఫ్ అకడమిక్ ప్లానింగ్ ‡ డాక్టర్ కొప్పిరెడ్డి పద్మరాజు ఎంపికయ్యారు. సామర్లకోట మండలం ఉండూరు చెందిన పద్దయ్యమ్మ, అమ్మిరాజు దంపతుల కుమారుడు పద్మరాజు. ఈయన 1989లో బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో ఈసీఈ, 1992లో వరంగల్ రీజనల్ ఇంజనీరింగ్ కళాశాలలో ఎంటెక్ ఇన్‌స్ర్టుమెంటేషన్ ఇంజనీరింగ్, 2005లో పీహెచ్డీ చేశారు.1992లో జేఎన్టీయూ కాకినాడ కళాశాలలో అసిస్టెంట్ప్రొఫెసర్గా, 2002లో అనంతరపురం కళాశాలలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. 2009లో జేఎన్టీయూకే ఇండస్ట్రీ ఇన్స్టిట్యూట్ ఇంటరాకషన్ ప్లేస్మెంట్ ఆఫీసర్‌గా 2012 నుండి 15 వరకూ జేఎన్టీయూ కాకినాడ కళాశాల ప్రిన్సిపాల్‌గా సేవలందించారు. ప్రస్తుతం ఆయన డైరక్టర్ ఆఫ్ అకడమిక్ ప్లానింగ్ ఆఫీసర్‌గా వి««దlులు నిర్వహిస్తున్నారు. పలు జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్‌లో ఈయన రచనలు ప్రచురితమయ్యాయి. 30 అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొన్నారు. 2004, 2014లో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారు. జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలల తనిఖీ కమిటీ సభ్యులుగా, ఏపీ ఫైబర్ గ్రిడ్ టెండర్ కమిటీ సభ్యుడిగా ఉన్నారు. పద్మరాజును జేఎన్టీయూకే వీసీ వీఎస్ఎస్æకుమార్, రిజిస్ట్రార్ సాయిబాబు, ప్రిన్సిపాల్ ప్రసాద్‌రాజు తదితరులు అభినందించారు. -
హర్రర్ నేపథ్యంలో యారో ఒరువన్
హర్రర్ చిత్రాల ట్రెండ్ జోరుగా సాగుతోంది. హారర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న మరో చిత్రం యారో ఒరువన్. నవగ్రహ సినీ ఆర్ట్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రానికి కె ఎన్ ప్రైజూ కథ, కథనం, మాటలు, ఛాయాగ్రహణం, ఎడిటింగ్, సంగీతం, దర్శకత్వం అంటూ పలు బాధ్యతలను తన భుజాలపైనే వేసుకుని తెరకెక్కిస్తున్నారు. ఈయన జాతీయ అవార్డు గ్రహీత మలయాళ దర్శకుడు పద్మరాజు వద్ద సహాయ దర్శకుడిగా పనిచేశారు. పలు బుల్లితెర సీరియళ్లకు దర్శకత్వం వహించిన కేఎన్ ప్రైజు తనకు సినిమారంగంలోని అన్ని శాఖల్లోనూ ప్రావీణ్యం ఉండడం వలనే ఈ చిత్రానికి ఇన్ని బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. నవజంట రామ్ ఆధిర హీరో హీరోయిన్లుగా పరిచయం అవుతున్న ఈ యారో ఒరువన్ చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ అదృశ్యం అయిన తన భార్యను కనుగొనే ప్రయత్నంలో హీరో ప్రముఖ డిటెక్టివ్‌తో పాటు ఆయన బృందం ఎదుర్కొనే అమానుష సంఘటనల ఇతివృత్తమే యారో ఒరువన్ చిత్రం అన్నారు. ఇంటిలో అడవుల్లో వారు ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నారన్న అంశాలు ఆద్యంతం ఉత్కంఠ భరితంగా ఉంటాయన్నారు. తెన్మలై అచ్చన్ కోయిల్, కట్లపారై తదితర ప్రాంతాల్లోని దట్టమైన అడవుల్లో చిత్ర షూటింగ్ నిర్వహించినట్లు తెలిపారు. హర్రర్ కథాంశంతో రూపొందిస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తుందని దర్శకుడు కె ఎన్ ప్రైజు పేర్కొన్నారు. -
'విభజనతో సీమాంధ్రకు మేలే జరిగింది'
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆ పార్టీని ఎలాగైనా కాపాడుకోవాలనే ఆందోళనలో ఉన్నారని కాంగ్రెస్ పార్టీ నేతలు పద్మరాజు,గంగాభవాని విమర్శించారు.అందుకే కాంగ్రెస్ నేతలను ఇష్టానుసారం ఆయన పార్టీలో చేర్చుకుంటున్నారని ఆరోపించారు. చంద్రబాబు చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ త్వరలో వికటిస్తుందని వారు జోస్యం చెప్పారు. బుధవారం హైదరాబాద్‌లో వారిరువురు మాట్లాడుతూ... అవకాశవాదం,స్వార్థంతోనే నేతలు కాంగ్రెస్ వీడుతున్నారని వారు విమర్శించరు. అయితే కేడర్ మాత్రం పార్టీ వీడటం లేదన్న సంగతిని వారు ఈ సందర్బంగా గుర్తుచేశారు. తాను అధికారంలోకి వస్తే సీమాంధ్రను సింగపూర్‌లా అభివృద్ధి చేస్తామని చంద్రబాబు అంటున్నారని, కానీ రానున్న తమ ప్రభుత్వ పాలనలో సీమాంధ్ర ప్రాంతం సింగపూర్ తలదన్నేలా అభివృద్ధి చెందుతుందని పద్మరాజు, గంగాభవానిలు తెలిపారు. వచ్చే ఐదేళ్లలో అత్యధిక తీర ప్రాంతం గల సీమాంధ్ర అభివృద్ధిని చూసి ఇతర రాష్ట్రాలు ఈర్ష్య పడతాయన్నారు. విభజనతో సీమాంధ్రకు మేలే జరిగిందని వారు స్పష్టం చేశారు. -
టీడీపీ కాదు.. తెలుగు కాంగ్రెస్ పార్టీ
తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో దివంగత ఎన్టీ రామారావు స్థాపించిన టీడీపీ ఇప్పుడు లేదని ఎమ్మెల్సీ రుద్రరాజు పద్మరాజు వ్యాఖ్యానించారు. అనేకమంది కాంగ్రెస్ నాయకులను టీడీపీలో చేర్చుకోవడంతో టీడీపీ కాస్తా ఇప్పుడు తెలుగు కాంగ్రెస్ పార్టీగా మారిపోయిందని ఆయన అన్నారు. వలస నాయకులను ఆహ్వానిస్తున్న చంద్రబాబు నాయుడికి నష్టం తప్పదని చెప్పారు. ఇక టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ అయితే కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఉద్యోగుల మధ్య భావోద్వేగాలు రెచ్చగొడుతున్నారని పద్మరాజు మండిపడ్డారు. ఆంధ్రా ప్రాంత ఉద్యోగులు అక్కడ, తెలంగాణ వాళ్లు ఇక్కడ మాత్రమే ఉద్యోగాలు చేసుకోవాలని, అంతేతప్ప ఆప్షన్లు ఉండబోవని కేసీఆర్ బుధవారం నాడు వ్యాఖ్యానించిన నేపథ్యంలో రుద్రరాజు దానిపై స్పందించారు. -
బిజెపితో పొత్తుకుదుర్చుకోవడానికే బాబు ఢిల్లీ టూర్: పద్మరాజు