'విభజనతో సీమాంధ్రకు మేలే జరిగింది' | Seemandhra region benefited due to state bifurcation, says Padmaraju, Ganga bhavani | Sakshi
Sakshi News home page

'విభజనతో సీమాంధ్రకు మేలే జరిగింది'

Published Wed, Mar 26 2014 2:52 PM | Last Updated on Sat, Sep 2 2017 5:12 AM

Seemandhra region benefited due to state bifurcation, says Padmaraju, Ganga bhavani

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆ పార్టీని ఎలాగైనా కాపాడుకోవాలనే ఆందోళనలో ఉన్నారని కాంగ్రెస్ పార్టీ నేతలు పద్మరాజు,గంగాభవాని విమర్శించారు.అందుకే  కాంగ్రెస్ నేతలను ఇష్టానుసారం ఆయన పార్టీలో చేర్చుకుంటున్నారని ఆరోపించారు. చంద్రబాబు చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ త్వరలో వికటిస్తుందని వారు జోస్యం చెప్పారు. బుధవారం హైదరాబాద్లో వారిరువురు మాట్లాడుతూ... అవకాశవాదం,స్వార్థంతోనే నేతలు కాంగ్రెస్ వీడుతున్నారని వారు విమర్శించరు.

అయితే కేడర్ మాత్రం పార్టీ వీడటం లేదన్న సంగతిని వారు ఈ సందర్బంగా గుర్తుచేశారు. తాను అధికారంలోకి వస్తే సీమాంధ్రను సింగపూర్లా అభివృద్ధి చేస్తామని చంద్రబాబు అంటున్నారని, కానీ రానున్న తమ ప్రభుత్వ పాలనలో సీమాంధ్ర ప్రాంతం సింగపూర్ తలదన్నేలా అభివృద్ధి చెందుతుందని పద్మరాజు, గంగాభవానిలు తెలిపారు. వచ్చే ఐదేళ్లలో అత్యధిక తీర ప్రాంతం గల సీమాంధ్ర అభివృద్ధిని చూసి ఇతర రాష్ట్రాలు ఈర్ష్య పడతాయన్నారు. విభజనతో సీమాంధ్రకు మేలే జరిగిందని వారు స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement