హైదరాబాద్: కాల్ మనీ వ్యవహారం సభ్య సమాజం సిగ్గుపడేలా ఉందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ముఖ్య అధికార ప్రతినిధి గంగా భవాని అన్నారు. బుధవారం హైదరాబాద్లో గంగాభవాని విలేకర్లతో మాట్లాడుతూ... మహిళలను ఆదుకుంటానని ఎన్నికల్లో హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు... సీఎం అయ్యాక వారిని వ్యభిచార కూపంలో నెట్టుతున్న కాల్మనీ దోషులపై చర్యలు తీసుకోకపోవడం దారుణమని ఆరోపించారు.
డ్వాక్రా రుణాలు మాఫీ కాకపోవడం వల్లే కాల్మనీ ఆగడాలు పెరిగాయన్నారు. చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ అండతోనే టీడీపీ నేతలు కాల్మనీ అరచకాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. నిజాయితీగా వ్యవహరిస్తున్న పోలీస్ అధికారి గౌతమ్ సవాంగ్పై ఈ ప్రభుత్వం ఒత్తిడికి గురి చేస్తుందన్నారు. కాల్మనీపై ఇంత వివాదం జరగుతున్న ముఖ్యమంత్రి, మంత్రులు ఖండించకపోవడం బాధ్యతరాహిత్యం అని గంగాభవాని పేర్కొన్నారు.