Ganga bhavani
-
మహిళలను రాబందుల్లా పీక్కుతింటున్నారు
-
'చంద్రబాబు, లోకేష్ అండతోనే అరాచకాలు'
హైదరాబాద్: కాల్ మనీ వ్యవహారం సభ్య సమాజం సిగ్గుపడేలా ఉందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ముఖ్య అధికార ప్రతినిధి గంగా భవాని అన్నారు. బుధవారం హైదరాబాద్‌లో గంగాభవాని విలేకర్లతో మాట్లాడుతూ... మహిళలను ఆదుకుంటానని ఎన్నికల్లో హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు... సీఎం అయ్యాక వారిని వ్యభిచార కూపంలో నెట్టుతున్న కాల్‌మనీ దోషులపై చర్యలు తీసుకోకపోవడం దారుణమని ఆరోపించారు. డ్వాక్రా రుణాలు మాఫీ కాకపోవడం వల్లే కాల్‌మనీ ఆగడాలు పెరిగాయన్నారు. చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ అండతోనే టీడీపీ నేతలు కాల్‌మనీ అరచకాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. నిజాయితీగా వ్యవహరిస్తున్న పోలీస్ అధికారి గౌతమ్ సవాంగ్‌పై ఈ ప్రభుత్వం ఒత్తిడికి గురి చేస్తుందన్నారు. కాల్‌మనీపై ఇంత వివాదం జరగుతున్న ముఖ్యమంత్రి, మంత్రులు ఖండించకపోవడం బాధ్యతరాహిత్యం అని గంగాభవాని పేర్కొన్నారు. -
కరీంనగర్లో ఆశావర్కర్ ఆత్మహత్య
కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో శుక్రవారం మధ్యాహ్నం విషాదం చోటుచేసుకుంది. బెజ్జంకి మండలం బేగంపేటలో గంగాభవాని అనే ఆశావర్కర్ ఆత్మహత్యకు పాల్పడింది. వేతనాల పెంపు కోసం గంగాభవాని సమ్మెలో పాల్గొంటున్న విషయమై శుక్రవారం భార్య, భర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెందిన గంగాభవాని పురుగుల మందు తాగింది. దీంతో ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గత కొంతకాలంగా వేతనాల పెంపు కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆశావర్కర్లు ఆందోళనలు చేపడుతున్న విషయం తెలిసిందే. -
'విభజనతో సీమాంధ్రకు మేలే జరిగింది'
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆ పార్టీని ఎలాగైనా కాపాడుకోవాలనే ఆందోళనలో ఉన్నారని కాంగ్రెస్ పార్టీ నేతలు పద్మరాజు,గంగాభవాని విమర్శించారు.అందుకే కాంగ్రెస్ నేతలను ఇష్టానుసారం ఆయన పార్టీలో చేర్చుకుంటున్నారని ఆరోపించారు. చంద్రబాబు చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ త్వరలో వికటిస్తుందని వారు జోస్యం చెప్పారు. బుధవారం హైదరాబాద్‌లో వారిరువురు మాట్లాడుతూ... అవకాశవాదం,స్వార్థంతోనే నేతలు కాంగ్రెస్ వీడుతున్నారని వారు విమర్శించరు. అయితే కేడర్ మాత్రం పార్టీ వీడటం లేదన్న సంగతిని వారు ఈ సందర్బంగా గుర్తుచేశారు. తాను అధికారంలోకి వస్తే సీమాంధ్రను సింగపూర్‌లా అభివృద్ధి చేస్తామని చంద్రబాబు అంటున్నారని, కానీ రానున్న తమ ప్రభుత్వ పాలనలో సీమాంధ్ర ప్రాంతం సింగపూర్ తలదన్నేలా అభివృద్ధి చెందుతుందని పద్మరాజు, గంగాభవానిలు తెలిపారు. వచ్చే ఐదేళ్లలో అత్యధిక తీర ప్రాంతం గల సీమాంధ్ర అభివృద్ధిని చూసి ఇతర రాష్ట్రాలు ఈర్ష్య పడతాయన్నారు. విభజనతో సీమాంధ్రకు మేలే జరిగిందని వారు స్పష్టం చేశారు.