కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో శుక్రవారం మధ్యాహ్నం విషాదం చోటుచేసుకుంది. బెజ్జంకి మండలం బేగంపేటలో గంగాభవాని అనే ఆశావర్కర్ ఆత్మహత్యకు పాల్పడింది.
వేతనాల పెంపు కోసం గంగాభవాని సమ్మెలో పాల్గొంటున్న విషయమై శుక్రవారం భార్య, భర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెందిన గంగాభవాని పురుగుల మందు తాగింది. దీంతో ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గత కొంతకాలంగా వేతనాల పెంపు కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆశావర్కర్లు ఆందోళనలు చేపడుతున్న విషయం తెలిసిందే.