asha worker
-
బేగం బజార్ సీఐపై చేయిచేసుకున్న ఆశా వర్కర్స్
-
పని ఒత్తిడి, ఆపై జ్వరం.. ఆశ వర్కర్ మృతి
ఎ.కొండూరు (తిరువూరు): తీవ్ర జ్వరంతో బాధపడుతూ ఆశ వర్కర్ మృతి చెందిన ఘటన ఎన్టీఆర్ జిల్లా ఎ.కొండూరులో గురువారం చోటుచేసుకుంది. ఎ.కొండూరు గ్రామానికి చెందిన తోట రాధ (42) సుమారు 18 ఏళ్లుగా ఆశ వర్కర్‌గా విధులు నిర్వర్తిస్తుంది. వారం క్రితం జ్వరం బారిన పడ్డారు. రాధ జ్వరంతో బాధపడుతూనే ఫీవర్ సర్వే నిర్వహించారు. పని ఒత్తిడి పెరగడం, తీవ్ర జ్వరంతో బాధపడుతూ స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యం చేయించుకున్నప్పటికీ నయంకాలేదు. దీంతో తిరువూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం చినఅవుటపల్లి ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాధ మృతి చెందారు. మృతురాలికి భర్త, ఇద్దరు సంతానం ఉన్నారు. న్యాయం చేయాలని ధర్నా తోట రాధ కుటుంబానికి న్యాయం చేయాలంటూ సీఐటీయూ, ఆశ వర్కర్లు, కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఎ.కొండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు గురువారం ధర్నా చేశారు. ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఎ.కమల, సీఐటీయూ మండల కార్యదర్శి జెట్టి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. వైద్యాధికారులు నిర్లక్ష్యం వల్ల మృతి చెందిన రాధ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు. మృతురాలి కుమార్తెకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, రాధకు సెలవు ఇవ్వని అధికారులపై చర్యలు తీసుకోవాలని, రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తహసీల్దార్ రియాజ్ హుస్సేన్, వైద్యాధికారులు మృతురాలి కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కాగా జ్వరంతో సర్వేలు చేయొద్దు.. రెండు రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించామని ఎ.కొండూరు పీహెచ్సీ ఇన్చార్జి వైద్యాధికారి కె.శ్రీనివాసరావు చెప్పారు. డీఎంహెచ్ఓ డాక్టర్ ఎం.సుహాసిని ఆదేశాల మేరకు మట్టి ఖర్చుల నిమిత్తం రూ.15 వేలు అందజేశామని వివరించారు. -
ఆశావర్కర్ సహకారంతో.. బిడ్డను విక్రయం..! అంతలోనే..
కామారెడ్డి: అప్పుడే పుట్టిన బిడ్డను అమ్మకానికి పెట్టిన ఘటనలో నలుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ కిరణ్‌కుమార్ తెలిపారు. ఏసీపీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నగరంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన గోసంగి దేవీ ఈ నెల 3న మగబిడ్డకు జన్మనిచ్చింది. పోషించేస్థాయి లేనందున ఆశావర్కర్ జయ సహకారంతో బిడ్డను విక్రయించేందుకు సిద్ధమైంది. అదే ప్రాంతానికి చెందిన హుమేరా బేగం, షబానా బేగంలు మగబిడ్డ పుడితే రూ. లక్ష, ఆడబిడ్డ పుడితే రూ. 1.50లక్షలు ఇస్తామని దేవీతో ఒప్పందం చేసుకున్నారు. ముందుగా ఒకరికి తెలియకుండా మరొకరు రూ. ఐదు వేలు చొప్పున దేవీకి ఇచ్చారు. ఈ నెల 3న నగరంలోని ఓ ప్రైవేట్ దవాఖానలో మగబిడ్డకు జన్మనిచ్చింది. డెలివరీ సమయంలో షబానా బేగం రూ. 20 వేలు చెల్లించింది. దీంతో పుట్టిన బిడ్డ తనకే కావాలంటూ షబానా బేగం, హుమేరా బేగం నగరంలోని రాధాకృష్ణ థియేటర్వద్ద ఆశావర్కర్ జయతో గొడవపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వారిని పీఎస్‌కు తరలించారు. బిడ్డను విక్రయించేందుకు సిద్ధమైన తల్లి దేవీని, విక్రయానికి సహకరించిన ఆశా వర్కర్ జయను, కొనుగోలు యత్నించిన హుమేరాబేగం, షబానాబేగంను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. సమావేశంలో నగర సీఐ నరహరి, ఎస్సై ప్రవీణ్‌కుమార్, ఏఎస్సై లీలాకృష్ణ, కానిస్టేబుళ్లు అప్సర్, చాందిమి, సుమలత ఉన్నారు. -
పింఛన్ ఇస్తామని తీసుకెళ్లి.. ఆపరేషన్ చేశారు
మల్కన్‌గిరి(భువనేశ్వర్): పింఛన్ ఇస్తామని ఓ యువకుడిని తీసుకెళ్లిన ఆశ వర్కర్.. కుటుంబ సంక్షేమ శస్త్రచికిత్స చేసిన వైనం మల్కన్‌గిరి జిల్లా మత్తిలి సమితిలో వెలుగుచూసింది. బాధిత కుటుంబం తెలిపిన వివరాల మేరకు.. మత్తిలి సమితి మొహిపోధర్ పంచాయతీ అంబగూడకు చెందిన గాంగదురువ(26) పుట్టుకతో మూగ. ఇంకా వివాహం కాలేదు. ఈ నెల 3న గ్రామానికి చెందిన ఆశా వర్కర్ గాంగదరువ ఇంటికి వచ్చింది. పెన్షన్ ఇప్పిస్తానని చెప్పి మత్తిలి సమితి ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లింది. పిల్లలు పుట్టకుండా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించింది. ఇంటికి మందులతో తిరిగి వచ్చిన కుమారుడిని తల్లి చూసి.. ఎందుకు మందులు వేసుకుంటున్నావని ప్రశ్నించింది. జరిగిన విషయం చెప్పడంతో ఆమె గ్రామస్తులతో కలిసి ఆస్పత్రికి వెళ్లి వైద్యులను నిలదీసింది. తన బిడ్డకు పిల్లలు పుట్టకుండా చేసిన ఆశ వర్కర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ విషయమై మల్కన్‌గిరి జిల్లా వైద్యాధికారి ప్రపుల్ల కుమార్ నాందో వద్ద ప్రస్తావించగా.. విచారణ నిమిత్తం జిల్లా ప్రభుత్వాస్పత్రి నుంచి బృందాన్ని మత్తిలి పంపించామన్నారు. ఆశ వర్కర్ తప్పు చేసినట్లు రుజువైతే చర్యలు తీసుకుంటామని చెప్పారు. చదవండి: హెచ్ఎం వేధింపులు.. జాబ్ కావాలంటే , నేను చెప్పినట్లు వినాల్సిందే! -
‘వైద్య, ఆరోగ్యం’లో మూడో స్థానంలో తెలంగాణ
మాదాపూర్ (హైదరాబాద్): తెలంగాణ ప్రాంతం గతంలో వైద్య, ఆరోగ్య రంగంలో 14వ స్థానంలో ఉండగా, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత 3వ స్థానంలోకి చేరుకుందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. శుక్రవారం మాదాపూర్‌లోని శిల్పకళావేదికలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో నియమితులైన ఆశా కార్యకర్తలకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. కొత్తగా నియమితులైన 1,560 మంది ఆశా కార్యకర్తలకు నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేయాలని కోరారు. ఒక్కో ఆశా వర్కర్‌పై రూ.50 వేలు ఖర్చుపెట్టి శిక్షణ ఇచ్చి.. ఆరోగ్య కార్యకర్తలుగా తీర్చిదిద్దుతున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో పనిచేస్తున్న 27 వేల మంది ఆశా వర్కర్లకు ఈనెల నుంచి సెల్‌ఫోన్ బిల్లులు కూడా ప్రభుత్వ మే చెల్లిస్తుందని చెప్పారు. కొత్తగా వచ్చిన వారికి కూడా స్మార్ట్ఫోన్లను అందజేసి వారి బిల్లులను చెల్లిస్తామని తెలిపారు. దే శంలో ఆశా వర్కర్లకు అత్యధిక వేతనం తెలంగాణలోనే ఇస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం వారికి రూ.9,900 చెల్లిస్తున్నామని, గతంలో వేతనం పెంచమని అడిగితే.. గుర్రాలతో తొక్కించి, అరెస్ట్‌లు చేసి పోలీస్స్టేషన్లలో ఉంచిన చరిత్ర కాంగ్రెస్‌దని అన్నారు. అలాగే సెకండ్ ఏఎన్ఎంలకు రాష్ట్రంలో రూ.27 వేలకు పైగా వేతనం అందిస్తున్నట్టు తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇంత వేతనం ఇవ్వడం లేదన్నా రు. బస్తీ దవాఖానాల ఏర్పాటువల్ల ఉస్మానియాలో 60 శాతం ఓపీ భారం తగ్గిందన్నారు. అలాగే గాంధీ ఆస్పత్రిలో 56 శాతం, ఫీవర్ ఆస్పత్రిలో 72 శాతం ఓపీ భారం తగ్గిందన్నారు. గర్భిణుల కోసం 3 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి తెలిపారు. కోర్టు కేసు తేలగానే ఉస్మానియా ఆస్పత్రికి అధునాతన భవనం నిర్మించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్, మల్లారెడ్డి, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ తదితరులు పాల్గొన్నారు. -
ఆశాదీపాలు
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆశావర్కర్స్కు ‘గ్లోబల్ హెల్త్లీడర్స్’ పురస్కారం ప్రకటించింది. ఈ సందర్భంగా వారి గురించి... కోవిడ్ సంక్షోభంలో ప్రపంచం తుఫానులో చిగురుటాకులా వణికిపోతున్న సమయంలో వారు ధైర్యంగా ముందడుగు వేశారు. కదం తొక్కుతూ, పదం పాడుతూ కదిలారు. బాటలు నడిచీ, పేటలు కడచీ, నదీనదాలు, అడవులు, కొండలు, ఎడారులా మనకు అడ్డంకి అంటూ ఏటికి ఎదురీదారు. మృత్యుభయకంపిత ముఖాల్లో బతుకు ఆశ కలిగించారు... గుజరాత్‌లోని వాజీపూర్ వెయ్యికి పైగా గడపల ఊరు. ఈ ఊరికి నలభై రెండు సంవత్సరాల లక్ష్మీ వాఘేలా అక్రిడేటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్ (ఆశ). ఆమె ఊరంతటికీ అమ్మలాంటిది. మహిళలు తమ ఆరోగ్య సమస్యలను నిస్సంకోచంగా లక్ష్షి్మ దగ్గర చెప్పుకుంటారు. ఇద్దరు బిడ్డలకు తల్లి అయిన లక్ష్మి కోవిడ్ సమయంలో ఉదయం అయిదింటికి లేచి ఉద్యోగ విధులు నిర్వర్తించడానికి బయలుదేరేది. ‘బయట పరిస్థితి ఏమీ బాగలేదు. ఉద్యోగం కంటే బతికి ఉండడం ముఖ్యం కదా. ఉద్యోగం వదిలెయ్’ అని చుట్టాలుపక్కాలు చాలామంది చెప్పారు. అయితే వారి మాట పట్టించుకోలేదు. ఆమె దృష్టిలో తాను చేస్తున్నది ఉద్యోగం కాదు. సమాజసేవలో భాగం కావడం. వ్యాక్సినేషన్ సమాచారానికి సంబంధించి డోర్–టు–డోర్ సర్వేలు, కాంటాక్ట్ ట్రేసింగ్, పరీక్షలు చేయించుకోవడానికి భయపడేవారిని ఒప్పించడం, కోవిడ్ బాధితులకు నిరంతరం ధైర్యం చెప్పడం, అత్యవసర మందులను సరఫరా చేయడం... ఒకటారెండా ఊపిరి సలపనంత పని ఉండేది. అయితే ఎప్పుడూ చిరాకు పడింది లేదు. వెనక్కి తగ్గింది లేదు. ‘డ్యూటీ ముగించుకొని ఇంటికి వచ్చే క్రమంలో అందరూ నన్ను అనుమానంగా చూసేవారు. ఎప్పుడూ ఆత్మీయంగా పలకరించేవాళ్లు కూడా భయపడి దూరం దూరంగా వెళ్లిపోయేవారు. ఇది చూసి నాలో నేను నవ్వుకునేదాన్ని’ అంటూ గతాన్ని గుర్తు చేసుకుంది లక్ష్మీ వాఘేలా. ఉత్తర్‌ప్రదేశ్‌లోని చాలా గ్రామాల్లో ఆశా కార్యకర్తలపై దాడులు జరిగాయి. మంచిపని కోసం వెళితే చెడు ఎదురయ్యేది. అయినా సరే భయపడుతూనో, బాధ పడుతూనో వెనక్కి వెళ్లలేదు. భయంతో వెనక దాక్కున్న వారిని ముందుకు తీసుకువచ్చారు. వారికి పరీక్షలు చేయించారు. ‘కోవిడ్ సమయంలో ఆశా వర్కర్స్ కనిపించగానే ముఖం మీదే తలుపు వేసేవారు. అలాంటి అవమానాలను మనసులోకి తీసుకోకుండా చాలా ఓపికగా బాధ్యతలు నిర్వర్తించారు. తమ ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా ప్రజలకు సేవలు చేస్తూ చనిపోయిన కార్యకర్తలు కూడా ఉన్నారు’ అంటుంది నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఆశా వర్కర్స్ జనరల్ సెక్రటరీ బీవీ విజయలక్ష్మి. కేరళలోని కరింగరి గిరిజన ప్రాంతాలలోని పల్లెలపై వైద్య అధికారులు దృష్టి సారించే వారు కాదు. అయితే విచిత్ర వచ్చిన తరువాత పరిస్థితిలో మార్పు వచ్చింది. 23 సంవత్సరాల విచిత్ర ఓ ఆశా వర్కర్. ప్రతి ఇంటికీ వెళ్లేది. వారి క్షేమ సమాచారాలు కనుక్కునేది. కోవిడ్ సమయంలో తాను ఆరునెలల గర్భిణి, ఇల్లు దాటి వెళ్లవద్దని ప్రతి ఒక్కరూ చెప్పారు. కొందరైతే... ‘నీకు వచ్చే కొద్దిపాటి నెల జీతం కోసం ఆశ పడితే...జరగరానిది జరిగితే పరిస్థితి ఏమిటీ’ అని విసుక్కునేవారు. ‘అన్నీ తెలిసిన వాళ్లు, బాగా చదువుకున్నవాళ్లే కోవిడ్ బారిన పడుతున్నారు. పాపం ఆ అడవి బిడ్డలలో చాలామందికి ఏమీ తెలియదు. వారిని జాగ్రత్త పరచడం, సహాయంగా ఉండడం అవసరం’ అంటూ బ్యాగ్ సర్దుకొని డ్యూటీకి బయలుదేరేది విచిత్ర. ఎన్నో గిరిజన గ్రామాలకు విచిత్ర బయటి నుంచి వచ్చిన ఉద్యోగి కాదు. తమ ఇంటిబిడ్డ. ఏ ఒక్కరోజైనా ఆమె రాకపోతే ఆందోళనగా తన గురించి ఆరా తీసేవారు. గుజరాత్‌లోని లక్ష్మీ వాఘేలా నుంచి కేరళలోని విచిత్ర వరకు ఎందరెందరో ఆశా ఉద్యమకారులు తమ వృత్తి నిబద్ధత చాటుకుంటూ జేజేలు అందుకున్నారు. తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆశావర్కర్స్కు ప్రతిష్ఠాత్మకమైన ‘గ్లోబల్ హెల్త్ లీడర్స్’ పురస్కారాన్ని ప్రకటించింది. -
భర్త సంతకు తీసుకువెళ్లలేదని ఎంత పనిచేశావమ్మా..
మారేడుమిల్లి(తూర్పుగోదావరి): భర్త సంతకు తీసుకువెళ్లలేదని అతడితో గొడవపడి ఆశా వర్కర్ ఆత్మహత్య చేసుకుంది. మండలంలోని పాములేరు పంచాయతీ పరిధిలోని కొండవాడ గ్రామంలో శనివారం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. బంధువులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఆ గ్రామంలో ఆశా వర్కర్‌గా పనిచేస్తున్న పల్లాల సీతామహాలక్ష్మి (24) శనివారం నాటి మారేడుమిల్లి సంతకు తనను తీసుకువెళ్లమని భర్త అబ్బాయిరెడ్డిని అడిగింది. చదవండి: చిన్నారిని లాక్కొని గొంతు నులుముతూ.. గొలుసివ్వకపోతే.. చంపేస్తాం! అందుకు అతడు నిరాకరించడంతో అతడితో గొడవపడింది. మనస్థాపానికి గురైన ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయంలో అధిక మోతాదులో పారాసెట్మాల్ మాత్రలు మింగింది. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను భర్త, కుటుంబ సభ్యులు గమనించి మారేడుమిల్లి పీహెచ్‌సీకి తీసుకువచ్చారు. అప్పటికే సీతామహాలక్ష్మి మృతి చెందినట్టు ఇక్కడి వైద్యాధికారులు నిర్థారించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతురాలికి నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. -
Matilda Kullu: ‘ఫోర్బ్స్’ లిస్ట్‌లో ఆశా వర్కర్.. ఎందుకంటే..?
Who Is Matilda Kullu: శక్తిమంతమైన మహిళ అంటే కార్పొరేట్ సి.ఇ.ఓ... పెద్ద రాజకీయ నాయకురాలు.. గొప్ప కళాకారిణి... లేదా ఏ ఒలింపిక్స్ క్రీడాకారిణో అయి ఉండవచ్చు. కాని ఫోర్బ్స్ పత్రిక తాజా భారతీయ శక్తిమంతమైన మహిళల్లో ఒక ఆశా వర్కర్ చేరింది. అదీ వెనుకబడిన ఒడిస్సా రాష్ట్రం నుంచి. ఆమె పేరు మెటిల్డా కుల్లు. హేమాహేమీల మధ్య ఇలా ఆశావర్కర్కు చోటు దొరకడం ఇదే ప్రథమం. ఏమిటి ఆమె ఘనత? కోవిడ్ వాక్సినేషన్ కోసం ఆమె ఏమి చేసింది? సూదిమందుకు కులం ఉంటుందా? ఉంటుంది... కొన్నిచోట్ల... ఆ సూది వేసే చేతులు బహుశా షెడ్యూల్డ్ తెగవి అయితే. అందునా చిన్న ఉద్యోగంలో ఉంటే. ఆశా వర్కర్ అంటే నెలకు 4,500 రూపాయల జీతం. గడప గడపకు తిరిగే ఉద్యోగం. అంత చిన్న ఉద్యోగి, స్త్రీ, పైగా షెడ్యూల్డ్ తెగ... తరతరాలుగా వెనుగబడిన ఆలోచనలు ఉన్న ఊళ్లలో, అంటరానితనం పాటించడం వదులుకోని ఇళ్లల్లో ఎంత కష్టం. పైగా ఆ ఊళ్లో చాలామంది మూఢ విశ్వాసాలతో, జబ్బు చేస్తే బాణామతిని నమ్ముకునే అంధకారంలో ఉంటే వారిని ఆస్పత్రి వరకూ నడిపించడం ఎంత కష్టం. ఈ కష్టం అంతా పడింది మెటిల్డా కుల్లు. అందుకే ఫోర్బ్స్ పత్రిక ‘ఫోర్బ్స్ ఇండియా విమెన్ పవర్ 2021’ పట్టికలోని మొత్తం 20 మంది భారతీయ మహిళలలో కుల్లుకు 3వ స్థానం ఇచ్చింది. ఆమెకు ముందు బ్యాంకర్ అరుంధతి భట్టాచార్య ఉంది. ఆమె తర్వాత క్రీడాకారిణి అవని లేఖరా, నటి సాన్యా మల్హోత్రా, కాస్మోటిక్స్ దిగ్గజం వినీతా సింగ్ తదితరులు ఉన్నారు. వీరందరి మధ్య ఒక చిరు ఉద్యోగి చేరడం సామాన్య ఘనత కాదు. ఇలా ఒక ఆశా వర్కర్ కనిపించడం ఇదే ప్రథమం. ఆ మేరకు భారతదేశంలో ఉన్న ఆశా వర్కర్లందరికీ గౌరవం దక్కిందని భావించాలి. ఎవరు మెటిల్డా కుల్లు? 45 ఏళ్ల మెటిల్డా కుల్లు ఒడిసాలోని సుందర్ఘర్ జిల్లాలో గార్దభహల్ అనే పల్లెకు ఏకైక ఆశా వర్కర్. గార్దభహల్లోని 964 మంది గ్రామీణులకు ఆమె ఆరోగ్య కార్యకర్త. 15 ఏళ్ల క్రితం ఆమె ఈ ఉద్యోగంలో చేరింది. అయితే ఒడిసా పల్లెల్లో ఆశా వర్కర్‌గా పని చేయడం సులభం కాదు. ‘జ్వరం వస్తే ఆస్పత్రికి వెళ్లాలి అని నేను చెప్తే నన్ను చూసి గ్రామీణులు నవ్వే వారు. ఏదైనా గట్టి రోగం వస్తే బాణామతికి ఆశ్రయించడం వారికి అలవాటు. కాన్పులు ఇళ్లల్లోనే జరిగిపోవాలని కోరుకుంటారు. పైగా నేను షెడ్యూల్డ్ తెగకు చెందిన మహిళను కావడం వల్ల ఇళ్లల్లోకి రాకపోకలకు కొందరు అంగీకరించే వారు కాదు. నన్ను ఏమన్నా ఎంత అవమానించినా వారి ఆరోగ్యం నాకు ముఖ్యం. నేను వారికి చెప్పీ చెప్పీ మార్పు తేవడానికి ప్రయత్నించేదాన్ని’ అంటుంది మెటిల్డా కుల్లు. ఉదయం 5 గంటల నుంచి మెటిల్డా దినచర్య రోజూ ఉదయం ఐదు గంటల నుంచి మొదలవుతుంది. ఇల్లు చిమ్ముకుని, పశువులకు గడ్డి వేసి, భర్త.. ఇద్దరు పిల్లలకు వంట చేసి సైకిల్ మీద ఊళ్లోకి బయలుదేరుతుందామె. గర్భిణులను, బాలింతలను, పసికందుల ఆరోగ్యాన్ని ఆమె ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ వారికి సూచనలు, సలహాలు మందులు ఇవ్వాల్సి ఉంటుంది. ఈడేరిన అమ్మాయిలు ఎటువంటి శుభ్రత పాటించాలో చెప్పడం మరో ముఖ్యమైన పని. ఇక ఆ పల్లెల్లో చాలామందికి గర్భకుహర ఇన్ఫెక్షన్లు సహజం. దానికి తోడు లైంగిక వ్యాధుల బెడద కూడా. వీటన్నింటినీ ఆమె ఓపికగా చూస్తూ గ్రామీణులను ఆస్పత్రులకు చేర్చి వారికి నయమయ్యేలా చూసేది. కోవిడ్ టైమ్‌లో వారియర్ కోవిడ్ మొదటి వేవ్ కంటే రెండో వేవ్‌లో దేశంలో అన్ని చోట్లకు మల్లే ఒడిసాలో కూడా విజృంభించాయి. ఆ రాష్ట్రంలో ఉన్న దాదాపు 47 వేల మంది ఆశా వర్కర్ల మీద ఒత్తిడి పడ్డట్టే మెటిల్డా మీద కూడా పడింది. ‘కోవిడ్ సమయంలో నా దినచర్య ఇంకా కష్టమైంది. రోజుకు 40, 50 ఇళ్లు తిరుగుతూ కోవిడ్ సింప్టమ్స్ ఎవరికైనా ఉన్నాయా లేవా అని చూడటం నా పని. ఊళ్లో కోవిడ్ వ్యాపించకుండా నేను ఎంత కష్టపడాలో అంత కష్టపడ్డాను. ఆశా వర్కర్లకు పిపిఇ కిట్లు అందింది లేదు. అయినా సరే ఇళ్లల్లోకి వెళ్లి సింప్టమ్స్ ఉన్నవారికి బిళ్లలు ఇచ్చేదాన్ని. గ్రామీణులతో సమస్య ఏమిటంటే వారు టెస్ట్‌లకు రారు. హాస్పిటల్‌కు వెళ్లరు. కాని ఇన్నేళ్లుగా నేను సంపాదించుకున్న నమ్మకం వల్ల వారు తొందరగా స్పందించారు. వాక్సినేషన్‌కు అంగీకరించారు. అందరికీ దాదాపుగా వాక్సిన్ నేనే వేశాను. ఆ విధంగా ఊళ్లో కోవిడ్‌ను అదుపు చేయగలిగాం’ అంటుంది మెటిల్డా కుల్లు. అయితే ఇంత ప్రాణాలకు తెగించి పని చేసినా ఒక్కసారి ప్రభుత్వం అదనంగా వేసిన 2000 రూపాయల ఇంటెన్సివ్ తప్ప వేరే మేలు ఏమీ జరగలేదు. ఇప్పటికీ ఆమె పాత జీతానికే పని చేస్తోంది. ఆ కొద్దిపాటి డబ్బు కోసం అంత పని చేయడానికి ఎంత శక్తి కావాలి, ధైర్యం కావాలి, అంకితభావం కావాలి. అందుకే ఫోర్బ్స్ ఆమె శక్తివంతమైన మహిళ అంది. సమాజం కోసం పని చేసే శక్తిని అందరూ ప్రదర్శించరు. ప్రదర్శించిన వారు ఇలా ప్రశంసను పొందుతారు. ప్రశంసకు యోగ్యమైన జీవితం కదా అందరూ కొద్దో గొప్పో గడపాలి. -
మా సప్న కనిపించడం లేదు..
మల్కన్‌గిరి: పోడియ సమితిలో ఆశావర్కర్‌గా పనిచేస్తున్న సప్నభయ్య అనే మహిళ అదృశ్యమైందని, ఆమె భర్త జగదీష్ భయ్య సోమవారం పోడియ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నెల 3వ తేదీ నుంచి సప్న కనిపించడం లేదని, కొత్తగుఢ గ్రామంలో మహిళకు ప్రసవం ఉందని చెప్పి వెళ్లిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. సాయంత్రమైనా రాకపోవడం, సెల్‌ఫోన్ స్విచాఫ్ ఉండడంతో ఆమె తల్లిదండ్రులకు సమాచారమిచ్చాడు. ఆపై భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కిడ్నాప్ కోణంలో విచారణ చేపట్టారు. -
జాబ్ నిలవాలంటే టెన్త్ పాసవ్వాలన్నారు, ఎట్టకేలకు 57 ఏళ్ల వయసులో
భువనేశ్వర్: ఒడిశాలో ఆశావర్కర్‌గా పనిచేస్తున్న స్వర్ణలత పాటి చిన్ననాటి నుంచి కష్టాలను చాలా దగ్గర్నుంచి చూశారు. తల్లిదండ్రులు దినసరి కూలీలు కావడంతో ఆమెను పెద్దగా చదివించలేదు. ఏడో తరగతి వరకు చదువుకున్న స్వర్ణలతకు చిన్నతనంలోనే పెళ్లి చేశారు. ఆమెకు 27 ఏళ్ల వయసులో భర్తను కోల్పోవడంతో కష్టాలు మరింత రెట్టింపయ్యాయి. తన ఇద్దరు పిల్లలనే ఆమె తన జీవితంగా భావించి వారికోసం కష్టపడుతూ వచ్చింది. ఏదైనా జాబ్ చేయాలని అనుకున్నా ఆమెకు సరైన విద్యార్హత లేకపోవడంతో ఉపాధి దొరకడం కష్టంగా మారింది. చివరికి తన ఊర్లోని స్కూల్లో వంద రూపాయలకు కుక్‌గా చేరి తన పిల్లలిద్దరిని పోషించుకుంది. కాగా 2005లో ఆమె జీవితం మరో మలుపు తీసుకుంది. ఆమె తాను పని చేస్తున్న గ్రామంలోనే ఆశావర్కర్‌గా ప్రభుత్వం నియమించింది. ఆశావర్కర్‌గా ఆమె చూపిన పనితనానికి, ప్రతిభకు ఎన్నో అవార్డులు, రివార్డులు వచ్చాయి. తనకు వచ్చిన డబ్బుతో ఇద్దరి పిల్లలను ప్రస్తుతం పోస్టు గ్రాడ్యుయేషన్ చదివిస్తోంది. అయితే 2019లో ఒడిశా ప్రభుత్వం ఆశావర్కర్లుగా పనిచేస్తున్న మహిళలకు టెన్త్ తప్పనిసరిగా ఉండాలని మెలిక పెట్టింది. టెన్త్ పాస్ అయితేనే అన్ని సౌకర్యాలు ఉంటాయని ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో స్వర్ణలతా తన ఉద్యోగాన్ని కాపాడుకోవడానికి పది పరీక్షలు రాయడానికి సిద్ధమైంది. 2019 డిసెంబర్లో మెట్రిక్ పరీక్షలు రాసేందుకు ఓపెన్ స్కూల్లో అప్లికేషన్ పెట్టుకుంది. కరోనా కారణంగా 2020 మార్చిలో జరగాల్సిన పరీక్షలు సెప్టెంబర్‌కు వాయిదా పడ్డాయి. కష్టపడి చదివిన స్వర్ణలత సెప్టెంబర్‌లో రాసిన పరీక్షల్లో ఒక్క ఇంగ్లీష్ తప్ప అన్ని సబ్జెక్టులు పాసయ్యింది. ఇంగ్లీష్ కూడా కేవలం నాలుగు మార్కులతో ఫెయిల్ అయింది. తాను ఫెయిల్ అయ్యానని కుంగిపోకుండా మరోసారి ఇంగ్లీష్ పరీక్ష రాసింది. ఈసారి కూడా ఫలితం ఆమెకు వ్యతిరేకంగానే వచ్చింది. ఏం చేయాలో పాలుపోని స్థితిలో స్వర్ణలతకు ఓడిశా ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఈసారి ఆమెను దేవుడు కరోనా రూపంలో కరుణించాడు. కరోనా కారణంగా గతేడాదితో పాటు ఈ ఏడాది ఓపెన్‌లో అప్లై చేసుకున్న అందరిని పాస్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇంకేముంది తాను పాసయినట్లు తెలుసుకున్న స్వర్ణలతా దాన్ని ఒక పెద్ద పండగలా చేసుకుంది. ఇక తన జాబ్ ఎక్కడికి పోదని.. తనకు అన్ని సౌకర్యాలు లభిస్తాయని ఆనందం వ్యక్తం చేసింది. చదవండి: మొబైల్ సిగ్నల్ కోసం చెట్టెక్కిన పిల్లలు.. అంతలోనే ఒక్కసారిగా -
ఆశావర్కర్ అనిత కేసు ఓ డ్రామా
సాక్షి, అనంతపురం: టీడీపీ మాజీ మంత్రి పరిటాల సునీత బురద రాజకీయాలు మరోసారి బయటపడ్డాయి. ఆశావర్కర్ అనితను పరామర్శించిన పరిటాల సునీత ప్రభుత్వంపై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసుకు సంబంధించిన కీలక విషయాలను సీఐ విజయభాస్కర్ వెల్లడించారు. చెర్లోపల్లిలో లైంగిక వేధింపులపై ఆశావర్కర్ అనిత పోలీసులకు ఫిర్యాదు చేసి ఆత్మహత్యాయత్నం చేసింది. అయితే ఆమె ఉద్దేశపూర్వకంగానే, నలుగురు వైఎస్సార్సీపీ కార్యకర్తలపై ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతో పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేసి వాస్తవాలను వెల్లడించారు. అనిత కేసు ఓ డ్రామాగా ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు పేర్కొన్నారు. ఆమెపై ఎలాంటి లైంగిక వేధింపులు జరగలేదని తెలిపారు. ఉద్యోగం నుంచి తీసేస్తారని అనిత అపోహ పడిందని సీఐ విజయభాస్కర్ తెలిపారు. రాజకీయ ఒత్తిడితో అనిత కేసు పెట్టిందని సీఐ పేర్కొన్నారు. అనిత ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా, ఆమె పాయిజన్ తీసుకోలేదని చెప్పారు. లైంగిక వేధింపుల ఆరోపణలపై ఎలాంటి ఆధారాలు లభించలేదని వెల్లడించారు. ఈ కేసులో రాజకీయ కుట్ర కోణం ఉందని సీఐ విజయభాస్కర్ పేర్కొన్నారు. పరిటాల సునీత మహానటి.. సాక్షి, అనంతపురం: రాప్తాడు మండలం చెర్లోపల్లి ఆశావర్కర్ ఘటనను టీడీపీ మాజీ మంత్రి పరిటాల సునీత రాజకీయం చేయాలనుకోవడం దురదృష్టకరమని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మండిపడ్డారు. పరిటాల సునీత చిల్లర రాజకీయాలు మానుకోవాలన్నారు. దౌర్జన్యాలకు కేరాఫ్ అడ్రస్ పరిటాల వర్గమే అని మండిపడ్డారు. తప్పుడు ఆరోపణల ద్వారా రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారని తెలిపారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆశా వర్కర్ అనిత టీడీపీ ట్రాప్‌లో పడిందని తెలిపారు. పరిటాల సునీత మహానటి అనే విషయం అందరికీ తెలిసిందేనని, తాజాగా ఆశా వర్కర్ ఘటనను రాజకీయం చేసేందుకు దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారని విమర్శించారు. ఇటీవల జరిగిన పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఘోర ఓటమి నేపథ్యంలో ఉనికి చాటుకునేందుకు ఓ చిరుద్యోగిని అడ్డుపెట్టుకుని రాజకీయానికి సిద్ధమయ్యారన్నారు. జిల్లా ఎస్పీ సత్యయేసుబాబు శాంతిభద్రతల విషయంలో నిక్కచ్చిగా వ్యవహరిస్తున్నారనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. ఆశా వర్కర్ అనిత ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు డాక్టర్లను అడిగి తెలుసుకుంటున్నామని, ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. ఆశా వర్కర్ కుటుంబం వైఎస్సార్సీపీ సానుభూతి పరులని, తమలో తమకే చిచ్చు పెట్టేందుకు సునీత ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. పరిటాల శ్రీరాంపై మూడు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని.. వైఎస్సార్ విగ్రహాన్ని ధ్వంసం చేసింది తానేనని శ్రీరాం ఒప్పుకున్నా... ఇప్పటి వరకు అరెస్టు చేయలేదన్నారు. చట్టం తనపని తాను చేసుకుపోతుందనే నమ్మకంతో ఉన్నామన్నారు. నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. చదవండి: చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేసిన ఎంపీ విజయసాయి రెడ్డి -
ఆశా వర్కర్ మృతి: 50 లక్షల సాయం
సాక్షి, గుంటూరు : ఆశా వర్కర్ విజయలక్ష్మి కరోనా వ్యాక్సిన్ వల్లే చనిపోయిందని ఇంకా నిర్ధారణ కాలేదని ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు. తాడేపల్లి మండలం పెనుమాకలో ఆశా వర్కర్ బొక్కా విజయ లక్ష్మి కుటుంబ సభ్యులను మంత్రి ఆళ్ల నాని, హోం మంత్రి మేకతోటి సుచరిత, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కాటంనేని భాస్కర్, జిల్లా అధికారులు సోమవారం పరామర్శించారు. కాగా గుంటూరులోని తాడేపల్లి మండలం పెనుమాక గ్రామానికి చెందిన ఆశా వర్కర్ బొక్కా విజయలక్క్క్ష్మీ ఆదివారం మరణించిన విషయం తెలిసిందే. ఈమె ఈనెల 19న కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. చదవండి: వ్యాక్సిన్: బ్రెయిన్ డెడ్ అయిన ఆశా వర్కర్ మృతి ఈ సందర్భంగా మంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ.. విజయలక్ష్మి చనిపోవడం దురదృష్టకరమన్నారు. అయితే పోస్టుమార్టం రిపోర్టు వస్తే గాని ఆమె మరణానికి సంబంధించిన కారణాలు తెలుస్తాయన్నారు. పోస్టుమార్టం రిపోర్టు త్వరగా వచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. విజయలక్ష్మి మరణానికి కారణాలు ఏమైనా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటనే స్పందించారని తెలిపారు. విజయలక్ష్మి కుటుంబానికి అండగా ఉంటామని చెప్పమని తమను పంపినట్లు పేర్కొన్నారు. విజయలక్ష్మి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలన్నీ కుటుంబ సభ్యులకు వివరించామని తెలిపారు. కుటుంబ సభ్యులు ఒక ఉద్యోగం అడిగారని, అలాగే ఇళ్ల స్థలం, ఇన్సూరెన్స్ కింద వచ్చే యాభై లక్షలు అడిగారని తెలిపారు. విజయలక్ష్మి మరణానికి 50 లక్షల ఇన్సూరెన్స్ వర్తించదన్నారు. కరోనా విధులు అందించేటప్పుడు మాత్రమే ఇన్సూరెన్స్ వర్తిస్తుందని, వ్యాక్సినేషన్‌కు వర్తించదని తెలిపారు. అయితే సీఎం వైఎస్ జగన్ మానవత్వంతో ఇన్సూరెన్స్‌తో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం తరపున యాభై లక్షల రూపాయలు ఇస్తామన్నారని మంత్రి ఆళ్ల నాని తెలిపారు. ఇప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా వ్యాక్సిన్ వేయించుకోవడానికి 3 లక్షల 88 వేల మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, ఇప్పటివరకు లక్షా యాభై వేల మంది కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారని తెలిపారు. ఇప్పటివరకు 39 మందికి మాత్రమే తల తిరగటం, జలుబు, జ్వరం లాంటి లక్షణాలు కనిపించాయని, రిజిస్ట్రేషన్ చేయించుకున్న అంతమాత్రాన వ్యాక్సిన్ వేయించుకోవాలనే అవసరం లేదని స్పష్టం చేశారు. ఏమైనా అనారోగ్య కారణాలు ఉంటే డాక్టర్‌ను సంప్రదించి డాక్టర్ సలహాలు తీసుకుని వ్యాక్సిన్ వేయించుకోవచ్చని సూచించారు. ఆశా వర్కర్ విజయలక్ష్మి మరణించడం బాధకరమని హోంమంత్రి మేకతోటి సుకరిత ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. సమాచారం తెలియగానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెంటనే స్పందించారని, విజయలక్ష్మి కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారన్నారు. విజయలక్ష్మి కుటుంబానికి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. -
పనే అన్నపూర్ణ ఐడీ
‘ఐ యామ్ ఫ్రమ్ సీబీఐ’ అనగానే.. టెన్షన్, అటెన్షన్ వచ్చేస్తాయి. ఇన్‌కం టాక్స్కీ ఒక ఐడీ ఉంటుంది. మీడియాకూ ఐడీ ఉంటుంది. ఏ ఐడీ వాల్యూ ఆ ఐడీకి ఉంటుంది. అన్నపూర్ణ దగ్గరా ఒక ఐడీ ఉంది. చేతిలోని ఐడీ కాదు. చేతల్లోని ఐడీ! ఆ ఐడీకి ప్రభుత్వం సెల్యూట్ చేసింది. ‘బెస్ట్ ఆశా వర్కర్’ గా గుర్తించింది. మంచి చెబితే ఎవరికీ నచ్చదు అంటారు. మాస్క్ పెట్టుకోమంటే అసలే నచ్చడం లేదు జనాలకు. ఈమధ్య ఒక ప్రభుత్వోద్యోగి.. ‘నన్నే మాస్క్ పెట్టుకోమంటావా!’ అని ఉగ్రుడైపోయి, ఆఫీస్‌లో తన కింద పని చేస్తున్న మహిళా కాంట్రాక్టు ఉద్యోగిని జుట్టుపట్టుకుని లాగి, ఆమెపై పిడిగుద్దులు కురిపించాడు. ఇలాంటి ఘటనలే దేశంలో రెండుమూడు చోట్ల జరిగాయి. అన్నపూర్ణ ఆశా వర్కర్. మంచి చెప్పడం ఆమె పని. ఇప్పుడైతే ఇక మాస్క్ పెట్టుకోమని చెప్పడం కూడా. అక్కడితో అయిపోదు ఆమె డ్యూటీ. భౌతిక దూరం పాటించేలా చూడాలి. ఎవరికైనా అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆరోగ్యా కేంద్రానికి తెలియజేయాలి. కరోనా అని ఎవరైనా భయపడుతుంటే ధైర్యం చెప్పాలి. మాకెందుకొస్తుందిలే అని ఎవరైనా కనీస జాగ్రత్తలు పాటించకుండా తిరుగుతుంటే భయం చెప్పాలి. ఇవన్నీ ఊరికే చెప్పేస్తే జరిగిపోయేవి కావు. కొందరు చెప్పనీయరు. కొందరు చెప్పినా వినరు. కొన్నిసార్లు మాటలు కూడా పడుతుంటుంది అన్నపూర్ణ. మురికివాడల్లోని మాటలు ఎలా ఉంటాయో అన్నపూర్ణొచ్చి చెప్పనవసరం లేదు. అన్నపూర్ణ గురించి మాత్రం కేంద్ర ప్రభుత్వం దేశం మొత్తానికీ చెప్పేసింది.. ‘షీ ఈజ్ ద బెస్ట్’ అని! అవును. ‘బెస్ట్ ఆశా వర్కర్’గా కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ అన్నపూర్ణను గుర్తించింది. అందుకు తగిన కారణమే ఉంది. కోవిడ్ మల్టీ టాస్కింగ్ చేసింది అన్నపూర్ణ.. ప్రభుత్వం ఇచ్చిన ఆశా వర్కర్ అనే చిన్న ఐడీ కార్డును మెడలో వేసుకుని. వర్కర్ అనే కానీ, అంతకంటే ఎక్కువ పనే చేసింది. కర్ణాటకలోని తుంగానగర్‌లో ఆమె ఆశా (అక్రెడిటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్) వర్కర్. చిన్న గ్రామం అది. మూడు వేల మంది జనాభా ఉంటే, 2,500 మంది మురికివాడల్లోనే ఉంటారు. పైగా కోవిడ్ ‘కంటైన్మెంట్’ ఏరియా! తమ ప్రాంతాన్ని ప్రభుత్వం మూసివేసినప్పుడు వాళ్లంతా మొండిగా వ్యతిరేకించారు. అప్పుడు అన్నపూర్ణే వారికి.. ‘మూసివేయకపోతే మన ప్రాణాలు పోతాయి’అని అర్థమయ్యేలా చెప్పగలిగింది. ఆశావర్కర్‌గా అన్నపూర్ణ ఐడీ అన్నపూర్ణతో పాటు మరో ఏడుగురు ఆశా వర్కర్లు ఉన్నప్పటికీ వారికి అప్పగించిన బాధ్యతల్లో వాళ్లు ఉండేవారు. అన్నపూర్ణ మాత్రం తుంగానగర్ మొత్తాన్నీ తన కుటుంబ బాధ్యతగా తీసుకుంది. అక్కడ ఉండేవాళ్లంతా రోజుకూలీలే. కంటైన్మెంట్గా ప్రకటించాక వారి ఉపాధి కూడా పోయింది. అప్పుడు కూడా అన్నపూర్ణ దగ్గరుండి మరీ ఇంటింటికీ ప్రభుత్వం పంపించిన నిత్యావసర సరకులను పంపిణీ చేయించింది. ఆమె ఆ ప్రాంతంలో 2015 నుంచీ ఆశావర్కర్‌గా పని చేస్తోంది. మొత్తం పది కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి తుంగానగర్‌లో ఇప్పుడు. బయటి వాళ్లు ఎవరైనా వస్తే వెంటనే తన దృష్టికి వచ్చే ఏర్పాటు చేసుకుంది అన్నపూర్ణ. గ్రామస్థులే ఫోన్ చేస్తారు. వెంటనే ఆ బయటి వాళ్లను క్వారెంటైన్‌కు పంపిస్తుంది. ఇవికాక ఆమె చేసే రోజువారి పనులు ఉంటాయి. గర్భిణులను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తీసుకెళుతుంది. వారి ఆరోగ్యస్థితి గురించి అధికారులకు సమాచారం ఇస్తుంది. ఇంటెన్సివ్ కేర్ నుంచి డిశ్చార్జి అయిన శిశువుల ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు వివరాలు సేకరిస్తుంది. పౌష్టికాహారం అందని పిల్లల గురించి ఆరోగ్య కేంద్రానికి తెలియజేస్తుంది. ఇళ్ల బయటి వరకే తన పరిమితి అనుకోలేదు అన్నపూర్ణ. తలుపుల చాటున జరిగే గృహహింసను వెళ్లి ఆపేసేది. ఏడుస్తున్న గృహిణి కన్నీళ్లు తుడిచి కారణం తెలుసుకునేది. సాధారణంగా భర్తే కారణం అయి ఉంటాడు. అతడి గురించి అధికారులకు చెబితే వాళ్లు పిలిపించి హెచ్చరించేవారు. గృహహింస ఒకటేనా.. కరోనా వల్ల మహిళలు, ఆడపిల్లలు తక్కువ బాధలేం పడటం లేదు. రోజంతా చాకిరి, అనారోగ్యంలోనూ విశ్రాంతి తీసుకోలేని స్థితి. వాకిట్లో నిలబడి ఇంట్లోని మగవాళ్లకు నాలుగు మంచి మాటలు చెప్పి వెళ్లేది. ఆమె మాట్లాడుతుంటే ప్రభుత్వమే మాట్లాడుతున్నట్లు ఉండేది. చేతికి గ్లవుజులు, చేతుల్లో ఫైల్స్, ముఖానికి మాస్క్, మెడలో ఐడీ.. సీరియస్‌గా ఉండేది. ఓరోజు.. చిన్న పిల్లకు పెళ్లి చేస్తున్నారని అన్నపూర్ణకు కబురొచ్చింది. వేరొకరైతే పోలీసులకు చెప్పేవారు. అన్నపూర్ణ రెండు కుటుంబాలను కూర్చోబెట్టింది. ఆ పెళ్లిని ఆపించింది. ఇవన్నీ కూడా అన్నపూర్ణ చెప్పుకుంటే కేంద్ర ప్రభుత్వానికి తెలిసినవి కాదు. తుంగానగర్ గ్రామస్థులు, డిస్ట్రిక్ట్ ఆశా మెంటర్ ఆరతి చెబితే తెలిసినవి. ‘‘బెస్ట్ వర్కర్ అని ప్రభుత్వ గుర్తింపు వచ్చింది కదా.. ఎలా అనిపిస్తోంది’’ అనే ప్రశ్నకు అన్నపూర్ణ చెప్పే సమాధానంలోనూ ఆమె బాధ్యత కనిపిస్తుంది! ‘‘ప్రతి ఆశా వర్కరూ బెస్ట్ వర్కరే’’ అంటుంది అన్నపూర్ణ. -
క్వారంటైన్లో కోడికూర ఇవ్వలేదని..
యశవంతపుర : పెద్దలకు కోడికూర, చేపలు, పిల్లలకు చిప్స్ ఇవ్వలేదనే కోపంతో ఆశా కార్యకర్తపై క్వారంటైన్లో ఉన్న వ్యక్తి దాడి చేసి గాయపరిచాడు. ఈ ఘటన కర్ణాటకలోని కలబురిగిలో జరిగింది. మహారాష్ట్ర నుంచి కలబురిగి జిల్లాకు వచ్చిన వారికి అళంద కిణ్ణి అబ్బాస్ గ్రామంలో క్వారంటైన్‌ను ఏర్పాటు చేశారు. క్వారంటైన్లో ఉన్న సోమనాథ సోనకాంబళె అనే వ్యక్తి తనకు చికెన్, చేప కూరతో భోజనం ఇవ్వాలని ఆశా కార్యకర్త రేణుకా నాగప్పను కోరాడు. ఇందుకు సమాధానంగా ఉన్నతాధికారుల సూచించిన భోజనాన్ని అందజేస్తామని ఆమె తెలిపారు. దీంతో కోపానికి గురైన ఆ వ్యక్తి రేణుకపై దాడి చేశాడు. దీంతో ఆమె ఎడమ చేయి విరిగి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడు సోమనాథ, అతని కుటుంబసభ్యులపై కేసు నమోదు చేశారు. -
50 ఏళ్ల వయసులో మళ్లీ తల్లయింది
అశ్వారావుపేట రూరల్: ఐదు పదులు దాటిన వయసులో ఓ మహిళ ప్రసవించింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. మండల పరిధిలోని అనంతారం గ్రామానికి చెందిన రాములమ్మ, రాముడు దంపతులకు 36 ఏళ్ల క్రితమే వివాహమైంది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు జన్మించారు. అనంతరం రాములమ్మకు కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స చేయించారు. ప్రస్తుతం రాములమ్మ, రాముడు దంపతులు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కాగా.. శుక్రవారం ఉదయం రాములమ్మకు కడుపులో తీవ్రమైన నొప్పి రావడంతో గ్రామంలోని ఓ ఆశ కార్యకర్త వద్దకు వెళ్లి మాత్ర తెచ్చుకుని వేసుకుంది. కొద్దిసేపటి తర్వాత నొప్పి అధికం కావడంతో ఇంటి వద్దే ఉన్న బాత్రూమ్కు వెళ్లి ప్రసవించింది. ఆడబిడ్డ జన్మించింది. గమనించిన కుటుంబీకులు ఆశ కార్యకర్తకు సమాచారం అందించగా.. ఆమె 108 ద్వారా తల్లీబిడ్డలను అశ్వారావుపేట ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి తరలించారు. తల్లికి రక్తహీనత.. శిశువు కేవలం 800 గ్రాముల బరువు ఉండటంతో మెరుగైన చికిత్స కోసం భద్రాచలం ఆస్పత్రికి తరలించారు. సీహెచ్‌సీ వైద్యురాలు నీలిమను వివరణ కోరగా.. రాములమ్మ పెద్ద వయసులో ప్రసవించడం ఆశ్చర్యకరమేనని పేర్కొన్నారు. కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స గురించి ఆమె స్పష్టంగా చెప్పలేకపోతోందని తెలిపారు. -
భర్తను కడతేర్చిన భార్య
సాక్షి, యల్లనూరు: ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తనే హత్యచేయించిన భార్య ఉదంతం యల్లనూరు మండల కేంద్రంలో వెలుగు చూసింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన మేరకు... యల్లనూరుకు చెందిన డి.చిన్న ఆంజనేయులు (38) భార్య రాజేశ్వరి, ఇద్దరు కూతుర్లతో కలిసి నివాసముంటున్నాడు. చిన్న ఆంజనేయులు లారీ డ్రైవర్‌గా పనిచేస్తుండగా, రాజేశ్వరి ఆశావర్కర్‌గా విధులు నిర్వహిస్తోంది. రాజేశ్వరి కొంత కాలంగా తాడిపత్రి ప్రాంతానికి చెందిన వేరొక వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. పథకం ప్రకారం హత్య అడ్డుగా ఉన్న భర్తను హతమార్చడం కోసం రాజేశ్వరి తన ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్ అమలు చేసింది. గత శుక్రవారం రోజున చిన్న ఆంజనేయులు, రాజేశ్వరి ప్రియుడు మద్యం తాగారు. రాజేశ్వరి సూచనల ప్రకారం చిన్న ఆంజనేయులును హత్య చేసి, శవాన్ని గోనె సంచుల్లో కట్టి సమీపంలోని చెరువు వద్ద గల చింత వనంలో పడేసి వెళ్లారు. భర్తను వెతుకుతున్నట్లు నటించి.. భర్తను హత్య చేయించిన రాజేశ్వరి ఎవరికీ అనుమానం రాకుండా ఉండటానికి చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. శుక్రవారం సాయంత్రం రూ.500 కావాలంటూ భర్త తనతో గొడవపడ్డాడని, డబ్బు ఇవ్వకపోవడంతో ఇంటి నుంచి వెళ్లిపోతున్నానని కోపంగా చెప్పి వెళ్లిపోయాడని సమీప బంధులకు చెప్పింది. అనంతరం అక్కడా, ఇక్కడా వెతకడంతో పాటు పలువురు స్వామీజీల వద్దకు వెళ్లింది. అయితే స్వామీజీల వద్దకు వెళ్లినప్పుడు నీ భర్త ఊరికి తూర్పు భాగాన వేరొక ఊరికి వెళ్లే దారిలో కుడి పక్క ఉన్నట్లు చెప్పడంతో ఆ మేరకు వెతుకుతుండగా చింత వనంలో భర్త శవమై కనిపించాడని, దీంతో గ్రామస్తులకు, పోలీసులకు సమాచారం ఇచ్చింది. రాజేశ్వరిపై బంధువుల ఫిర్యాదు చిన్న ఆంజనేయులు హత్యకు గురయ్యాడని తెలుసుకున్న అతని సమీప బంధువులు సోమవారం యల్లనూరు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి చిన్న ఆంజనేయులు భార్య రాజేశ్వరిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు రాజేశ్వరిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. చిన్న ఆంజనేయులు హత్యకు గల కారణం వివాహేతర సంబంధమేమని, భార్యే అతడి హత్యకు ప్లాన్ వేసిందని పోలీసుల విచారణలో తేలింది. హత్య చేసిన నిందితులు, వారికి సహకరించిన వారి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
శ్రీకాకుళం జిల్లాలో రొడ్డెక్కిన ఆశా వర్కర్లు
-
ఆశ వర్కర్ దారుణ హత్య
గుంటూరు , సత్తెనపల్లి: కుటుంబ కలహాల నేపథ్యంలో ఆశ వర్కర్ దారుణ హత్యకు గురైన సంఘటన సత్తెనపల్లి మండలం పెదమక్కెనలో గురువారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం... సత్తెనపల్లి మండలం పెదమక్కెన గ్రామానికి చెందిన గడిపర్తి వెంకటరమణ (40), కోటేశ్వరరావులకు సుమారు 20 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు మగ సంతానం. పెద్ద కుమారుడు డిగ్రీ, చిన్న కుమారుడు ఇంటర్ చదువుతున్నారు. వెంకటరమణ ఆశ వర్కర్‌గా పని చేస్తుండగా కోటేశ్వరరావు కూలి పనులకు వెళ్లేవాడు. మూడేళ్ల క్రితం కోటేశ్వరరావుకు పక్షవాతం రావడంతో కుటుంబ బాధ్యతలన్నీ వెంకటరమణ తన భుజాన వేసుకుంది. ఈ క్రమంలో పొలం పనులు కూడా ఆమే చూస్తోంది. జమా ఖర్చులు లెక్కలు చెప్పడం లేదని భర్త కోటేశ్వరరావు కొంత కోపంగా ఉన్నాడు. రెండు రోజులగా వీరి భార్యభర్తల మధ్య గొడవ జరుగుతోంది. గురువారం ఇంట్లో ఉన్న వెంకటరమణ నిర్జీవంగా పడి ఉంది. ఆమె తల నుంచి రక్తస్రావం కావడం, దగ్గర్లో బాడిశకు రక్తం ఉండడంతో వెంకటరమణను భర్త కోటేశ్వరరావు హతమార్చి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. సంఘటన స్థలాన్ని సత్తెనపల్లి డీఎస్పీ వీ కాలేషావలి, రూరల్ సీఐ ఎం వీరయ్య, రూరల్ ఎస్ఐ మీర్జానజీర్ బేగ్ పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సత్తెనపల్లి ఏరియా వైద్యశాలకు తరలించారు. మృతురాలి తల్లి కత్తి విజయమ్మ ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆశా కార్యకర్త అనుమానాస్పద మృతి
పెగడపల్లి: జగిత్యాల జిల్లా పెగడపెల్లి మండలం వెంగళాయిపేటలో ఓ ‘ఆశ’ కార్యకర్త అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మోకెనపెల్లి పద్మ ‘ఆశ’ కార్యకర్తగా పనిచేస్తున్నది. అయితే ఆమె గొంతు కోసి ఉండి రక్తపుమడుగులో మృతిచెంది ఉంది. ఆమె ఆత్మహత్యకు పాల్పడిందా లేక ఎవరైనా హత్య చేశారా అనేది తెలియలేదు. భర్త వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఎస్సై వెంకటరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. -
ఆశా వర్కర్ కిడ్నాప్.. గ్యాంగ్ రేప్..!
సంగారెడ్డి: మెదక్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. విధులకు వెళ్లి వస్తున్న ఆశా వర్కర్ ను కొందరు గుర్తు తెలియని దుండగులు కారులో ఎత్తుకెళ్లి గ్యాంగ్ రేప్ చేశారు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. నర్సాపూర్ లో ఓ సమావేశానికి ఆశా వర్కర్ హాజరైంది. రాత్రివేళ మీటింగ్ పూర్తయిన తర్వాత ఆమె ఇంటికి వెళ్లేందుకు నర్సాపూర్ బస్టాండ్ కు వెళ్తోంది. ఇంతలో అయిదుగురు గుర్తుతెలియని దుండగులు ఆశా వర్కర్ ను కారులో ఎక్కించుకుని కిడ్నాప్ చేశారు. నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి బాధితురాలిపై సామూహిక అత్యాచారం చేసి ఆమెను అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. రాత్రంతా వర్షం కురవడం, ఆ వైపుగా ఎవరూ వెళ్లకపోవడంతో నిన్న ఎవరూ ఆమెను గమనించలేదు. దీంతో ఎలాంటి సహాయం లేక రాత్రి ఆ ప్రదేశంలోనే బాధితురాలు ఉండిపోయింది. శనివారం ఉదయం అటుగా వెళ్తున్న కొందరు ఈ విషయాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వారు బాధితురాలిని సంగారెడ్డి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితురాలికి తీవ్ర రక్తస్రావం అవుతుందని, ఆమె షాక్ నుంచి ఇంకా తేరుకోలేదని పోలీసులు వెల్లడించారు. మైరుగైన చికిత్స నిమిత్తం ఆశా కార్తకర్తను హైదరాబాద్ కు తరలించాలని వైద్యులు సూచించారు. ప్రస్తుతానికైతే ఆమె పరిస్థితి కాస్త విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. బాధితురాలు తెలిపిన వివరాలతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని చెప్పారు. -
ఆశా కార్యకర్త ఆత్మహత్య
కుటుంబకలహాల నేపథ్యంలో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల మండలం వేంపల్లి గ్రామానికి చెందిన రామిళ్ల స్వప్న(35) ఆశా కార్యకర్తగా పనిచేస్తోంది. ఇటీవల భర్తతో ఆమెకు విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలోనే ఆమె మంగళవారం ఉదయం కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని చనిపోయింది. ఈ మేరకు పోలీసులు.. భర్త మోహన్ సహా ఆరుగురిపై కేసు నమోదు చేశారు. -
కరీంనగర్లో ఆశావర్కర్ ఆత్మహత్య
కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో శుక్రవారం మధ్యాహ్నం విషాదం చోటుచేసుకుంది. బెజ్జంకి మండలం బేగంపేటలో గంగాభవాని అనే ఆశావర్కర్ ఆత్మహత్యకు పాల్పడింది. వేతనాల పెంపు కోసం గంగాభవాని సమ్మెలో పాల్గొంటున్న విషయమై శుక్రవారం భార్య, భర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెందిన గంగాభవాని పురుగుల మందు తాగింది. దీంతో ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గత కొంతకాలంగా వేతనాల పెంపు కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆశావర్కర్లు ఆందోళనలు చేపడుతున్న విషయం తెలిసిందే. -
ఆశా వర్కర్ల ధర్నాలో ఉద్రిక్తత
-
ఆశ వర్కర్ ఆత్మహత్య
బెల్లంపల్లి : బెల్లంపల్లి కొత్తబస్టాండ్ ఏరియూ ఇందిరమ్మ కాలనీకి చెందిన ఆశ వర్కర్ మల్లెపల్లి స్వప్న(34) ఆత్మహత్యకు పాల్పడింది. వన్‌టౌన్ హెచ్‌హెచ్‌వో జయపాల్ తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం అర్ధరాత్రి నిద్ర నుంచి మేల్కోన్న స్వప్న వంట గదిలోకి వెళ్లి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. గమనించిన ఆమె భర్త రవికుమార్ మంటలు ఆర్పడానికి ప్రయత్నించాడు. స్వప్న 90శాతం గాయూలపాలైన ఆమెను భర్త స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించాడు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ బుధవారం ఉదయం చనిపోయింది. చేతులు, పొట్టకు గాయూలైన రవికుమార్ వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నాడు. అనారోగ్యం, గత మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోవడం కారణంగా అ ప్పుల పాలై జీవితం పై విరక్తి చెంది స్వప్న ఆత్మహత్యకు పాల్పడిందని ఎస్‌హెచ్‌వో తెలిపారు. కేసు దర్యా ప్తు చేస్తున్నామని వివరించారు. నిప్పంటించుకుని మహిళ.. మందమర్రి రూరల్ : స్థానిక మూడోవ జోన్‌కు చెందిన కలువల రాజేశ్వరి(28) బుధవారం తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడింది. పట్టణ ఎస్సై సతీశ్ తెలిపిన వివరాల ప్రకారం. రాజేశ్వరికి 2006లో అంజయ్య అనే ప్రైవేట్ డ్రైవర్‌తో వివాహామైంది. కొంతకాలంగా ఆర్థిక పరిస్థితులు బాగాలేకపోవడం, అనారోగ్యానికి గురికావడంతో రాజేశ్వరి మనస్తాపం చెందింది. ఆస్పత్రుల్లో వైద్యం చేరుుంచుకున్నా ఆరోగ్యం కుదుటపడకపోవడంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వివరించారు. -
ఆశ కార్యకర్తలకు గౌరవ వేతనం పెంచాలి
* టీఆర్ఎస్ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్‌కు వెన్నెముకగా ఉన్న ఆశ కార్యకర్తలకు గౌరవ వేతనం పెంచడానికి కమిటీని నియమించాలని కోరుతూ కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సహాయమంత్రి శ్రీపాద యశోనాయక్‌కు టీఆర్ఎస్ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ బుధవారం వినతి పత్రం ఇచ్చారు. గ్రామాల్లో ప్రతి వెయ్యి మందికి ఒక ఆశ కార్యకర్త వైద్య సేవల సమాచారాన్ని అందిస్తున్నారని, వారికిచ్చే ప్రతిఫలం నెలకు రూ.600 నుంచి రూ.800 మాత్రమే ఉందని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఒక్కో ఆశ కార్యకర్తకు రోజుకు రూ.26 మాత్రమే అందుతున్నాయని, దీనితో కుటుంబపోషణ అసాధ్యమని చెప్పారు. కనీసం అంగన్వాడీ కార్యకర్తలకు ఇస్తున్న గౌరవ వేతనం తరహాలో ఆశ కార్యకర్తలకు ఇచ్చేందుకు సాధ్యమైన కమిటీని త్వరగా ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.