మల్కన్‌గిరి(భువనేశ్వర్): పింఛన్ ఇస్తామని ఓ యువకుడిని తీసుకెళ్లిన ఆశ వర్కర్.. కుటుంబ సంక్షేమ శస్త్రచికిత్స చేసిన వైనం మల్కన్‌గిరి జిల్లా మత్తిలి సమితిలో వెలుగుచూసింది. బాధిత కుటుంబం తెలిపిన వివరాల మేరకు.. మత్తిలి సమితి మొహిపోధర్ పంచాయతీ అంబగూడకు చెందిన గాంగదురువ(26) పుట్టుకతో మూగ. ఇంకా వివాహం కాలేదు. ఈ నెల 3న గ్రామానికి చెందిన ఆశా వర్కర్ గాంగదరువ ఇంటికి వచ్చింది. పెన్షన్ ఇప్పిస్తానని చెప్పి మత్తిలి సమితి ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లింది.
పిల్లలు పుట్టకుండా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించింది. ఇంటికి మందులతో తిరిగి వచ్చిన కుమారుడిని తల్లి చూసి.. ఎందుకు మందులు వేసుకుంటున్నావని ప్రశ్నించింది. జరిగిన విషయం చెప్పడంతో ఆమె గ్రామస్తులతో కలిసి ఆస్పత్రికి వెళ్లి వైద్యులను నిలదీసింది. తన బిడ్డకు పిల్లలు పుట్టకుండా చేసిన ఆశ వర్కర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ విషయమై మల్కన్‌గిరి జిల్లా వైద్యాధికారి ప్రపుల్ల కుమార్ నాందో వద్ద ప్రస్తావించగా.. విచారణ నిమిత్తం జిల్లా ప్రభుత్వాస్పత్రి నుంచి బృందాన్ని మత్తిలి పంపించామన్నారు. ఆశ వర్కర్ తప్పు చేసినట్లు రుజువైతే చర్యలు తీసుకుంటామని చెప్పారు.
చదవండి: హెచ్‌ఎం వేధింపులు.. జాబ్ కావాలంటే , నేను చెప్పినట్లు వినాల్సిందే!
Comments
Please login to add a commentAdd a comment