భర్త, కొడుకుతో సీతామహాలక్ష్మి (ఫైల్)
మారేడుమిల్లి(తూర్పుగోదావరి): భర్త సంతకు తీసుకువెళ్లలేదని అతడితో గొడవపడి ఆశా వర్కర్ ఆత్మహత్య చేసుకుంది. మండలంలోని పాములేరు పంచాయతీ పరిధిలోని కొండవాడ గ్రామంలో శనివారం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. బంధువులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఆ గ్రామంలో ఆశా వర్కర్‌గా పనిచేస్తున్న పల్లాల సీతామహాలక్ష్మి (24) శనివారం నాటి మారేడుమిల్లి సంతకు తనను తీసుకువెళ్లమని భర్త అబ్బాయిరెడ్డిని అడిగింది.
చదవండి: చిన్నారిని లాక్కొని గొంతు నులుముతూ.. గొలుసివ్వకపోతే.. చంపేస్తాం!
అందుకు అతడు నిరాకరించడంతో అతడితో గొడవపడింది. మనస్థాపానికి గురైన ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయంలో అధిక మోతాదులో పారాసెట్మాల్ మాత్రలు మింగింది. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను భర్త, కుటుంబ సభ్యులు గమనించి మారేడుమిల్లి పీహెచ్‌సీకి తీసుకువచ్చారు. అప్పటికే సీతామహాలక్ష్మి మృతి చెందినట్టు ఇక్కడి వైద్యాధికారులు నిర్థారించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతురాలికి నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment