
రజియా
అప్పటి నుంచి రజియా రామలింగేశ్వరనగర్ లోని మేనమామ ఇంటి వద్దనే ఉంటోంది. కొద్ది రోజుల క్రితం ప్రసాదంపాడు లోని తల్లిదండ్రుల వద్దకు వెళ్లింది.
ఆటోనగర్(విజయవాడ తూర్పు): అనారోగ్యం కారణంగా ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకుని మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన ప్రసాదంపాడులో జరిగింది. పటమట పోలీసుల వివరాల మేరకు షేక్ రజియా(20) భర్త జిన్నా నాలుగు సంవత్సరాల క్రితం గుంటూరు జిల్లా తాడికొండ వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.
అప్పటి నుంచి రజియా రామలింగేశ్వరనగర్ లోని మేనమామ ఇంటి వద్దనే ఉంటోంది. కొద్ది రోజుల క్రితం ప్రసాదంపాడు లోని తల్లిదండ్రుల వద్దకు వెళ్లింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో గదిలో ఉన్న ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకొని ఆత్మçహత్యకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు.
తరచూ ఆనారోగ్య సమస్యలు తలెత్తుతుండటంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు చెప్పారు. సంఘటన గురించి మృతురాలి కుటుంబ సభ్యులను పోలీసులు విచారిస్తున్నారు. రజియా తండ్రి షేక్ సాదిక్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: రిపోర్ట్‌లో అసలు గుట్టు.. మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని..