
బాధితురాలు రేణుక
పెద్దలకు కోడికూర, చేపలు, పిల్లలకు చిప్స్ ఇవ్వలేదనే కోపంతో ఆశా కార్యకర్తపై క్వారంటైన్‌లో ఉన్న వ్యక్తి దాడి చేసి గాయపరిచాడు.
యశవంతపుర : పెద్దలకు కోడికూర, చేపలు, పిల్లలకు చిప్స్ ఇవ్వలేదనే కోపంతో ఆశా కార్యకర్తపై క్వారంటైన్‌లో ఉన్న వ్యక్తి దాడి చేసి గాయపరిచాడు. ఈ ఘటన కర్ణాటకలోని కలబురిగిలో జరిగింది. మహారాష్ట్ర నుంచి కలబురిగి జిల్లాకు వచ్చిన వారికి అళంద కిణ్ణి అబ్బాస్ గ్రామంలో క్వారంటైన్‌ను ఏర్పాటు చేశారు. క్వారంటైన్‌లో ఉన్న సోమనాథ సోనకాంబళె అనే వ్యక్తి తనకు చికెన్, చేప కూరతో భోజనం ఇవ్వాలని ఆశా కార్యకర్త రేణుకా నాగప్పను కోరాడు. ఇందుకు సమాధానంగా ఉన్నతాధికారుల సూచించిన భోజనాన్ని అందజేస్తామని ఆమె తెలిపారు. దీంతో కోపానికి గురైన ఆ వ్యక్తి రేణుకపై దాడి చేశాడు. దీంతో ఆమె ఎడమ చేయి విరిగి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడు సోమనాథ, అతని కుటుంబసభ్యులపై కేసు నమోదు చేశారు.