బెల్లంపల్లి : బెల్లంపల్లి కొత్తబస్టాండ్ ఏరియూ ఇందిరమ్మ కాలనీకి చెందిన ఆశ వర్కర్ మల్లెపల్లి స్వప్న(34) ఆత్మహత్యకు పాల్పడింది. వన్‌టౌన్ హెచ్‌హెచ్‌వో జయపాల్ తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం అర్ధరాత్రి నిద్ర నుంచి మేల్కోన్న స్వప్న వంట గదిలోకి వెళ్లి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. గమనించిన ఆమె భర్త రవికుమార్ మంటలు ఆర్పడానికి ప్రయత్నించాడు. స్వప్న 90శాతం గాయూలపాలైన ఆమెను భర్త స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించాడు.
ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ బుధవారం ఉదయం చనిపోయింది. చేతులు, పొట్టకు గాయూలైన రవికుమార్ వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నాడు. అనారోగ్యం, గత మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోవడం కారణంగా అ ప్పుల పాలై జీవితం పై విరక్తి చెంది స్వప్న ఆత్మహత్యకు పాల్పడిందని ఎస్‌హెచ్‌వో తెలిపారు. కేసు దర్యా ప్తు చేస్తున్నామని వివరించారు.
నిప్పంటించుకుని మహిళ..
మందమర్రి రూరల్ : స్థానిక మూడోవ జోన్‌కు చెందిన కలువల రాజేశ్వరి(28) బుధవారం తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడింది. పట్టణ ఎస్సై సతీశ్ తెలిపిన వివరాల ప్రకారం. రాజేశ్వరికి 2006లో అంజయ్య అనే ప్రైవేట్ డ్రైవర్‌తో వివాహామైంది. కొంతకాలంగా ఆర్థిక పరిస్థితులు బాగాలేకపోవడం, అనారోగ్యానికి గురికావడంతో రాజేశ్వరి మనస్తాపం చెందింది. ఆస్పత్రుల్లో వైద్యం చేరుుంచుకున్నా ఆరోగ్యం కుదుటపడకపోవడంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వివరించారు.
ఆశ వర్కర్ ఆత్మహత్య
Published Thu, May 14 2015 1:58 AM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
Advertisement
Advertisement