కాల్‌మనీ వ్యవహారంలో దోషులకు సిఎం చంద్రబాబు ప్రభుత్వం అండగా ఉంటూ, వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నదని .....
ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా కార్యదర్శి ఏసమ్మ
గుంటూరు వెస్ట్ : కాల్‌మనీ వ్యవహారంలో దోషులకు సిఎం చంద్రబాబు ప్రభుత్వం అండగా ఉంటూ, వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నదని ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా కార్యదర్శి శీలం ఏసమ్మ ఆరోపించారు. కాల్‌మనీ వ్యవహారంలో దోషులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ గుంటూరు రూరల్ మండలం లాల్‌పురం పంచాయతీ పరిధిలోని లింగాయపాలెం అల్లూరిసీతారామరాజు కాలనీలో మంగళవారం సభ జరిగింది.
సభలో ఏసమ్మ మాట్లాడుతూ ఈ వ్యవహారంపై నిస్పక్షపాతంగా న్యాయవిచారణ చేపట్టి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కాల్‌మనీ మాఫియాకు పోలీసు వ్యవస్థ అండగా ఉండటం వల్ల దురాగాతాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. కార్యక్రమంలో సంఘం డివిజన్ కార్యదర్శి డి.శివపార్వతి, సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఎన్.బ్రహ్మయ్య, అఖిల భారత రైతుకూలీ సంఘం నాయకులు నక్కా పోతురాజు తదితరులు పాల్గొన్నారు.