ఏపీపీఎస్సీ సభ్యుడిగా పద్మరాజు
ఏపీపీఎస్సీ సభ్యుడిగా పద్మరాజు
Published Sun, Sep 11 2016 10:43 PM | Last Updated on Mon, Sep 4 2017 1:06 PM
బాలాజీచెరువు (కాకినాడ) :
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీ పీఎస్సీ)∙సభ్యుడిగా జేఎన్‌టీయూకే డైరెక్టర్ ఆఫ్ అకడమిక్ ప్లానింగ్ ‡ డాక్టర్ కొప్పిరెడ్డి పద్మరాజు ఎంపికయ్యారు. సామర్లకోట మండలం ఉండూరు చెందిన పద్దయ్యమ్మ, అమ్మిరాజు దంపతుల కుమారుడు పద్మరాజు. ఈయన 1989లో బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో ఈసీఈ, 1992లో వరంగల్ రీజనల్ ఇంజనీరింగ్ కళాశాలలో ఎంటెక్ ఇన్‌స్ర్టుమెంటేషన్ ఇంజనీరింగ్, 2005లో పీహెచ్‌డీ చేశారు.1992లో జేఎన్‌టీయూ కాకినాడ కళాశాలలో అసిస్టెంట్‌ప్రొఫెసర్‌గా, 2002లో అనంతరపురం కళాశాలలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. 2009లో జేఎన్‌టీయూకే ఇండస్ట్రీ ఇన్‌స్టిట్యూట్ ఇంటరాకషన్ ప్లేస్‌మెంట్ ఆఫీసర్‌గా 2012 నుండి 15 వరకూ జేఎన్‌టీయూ కాకినాడ కళాశాల ప్రిన్సిపాల్‌గా సేవలందించారు. ప్రస్తుతం ఆయన డైరక్టర్ ఆఫ్ అకడమిక్ ప్లానింగ్ ఆఫీసర్‌గా వి««దlులు నిర్వహిస్తున్నారు. పలు జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్‌లో ఈయన రచనలు ప్రచురితమయ్యాయి. 30 అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొన్నారు. 2004, 2014లో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారు. జేఎన్‌టీయూ ఇంజనీరింగ్ కళాశాలల తనిఖీ కమిటీ సభ్యులుగా, ఏపీ ఫైబర్ గ్రిడ్ టెండర్ కమిటీ సభ్యుడిగా ఉన్నారు. పద్మరాజును జేఎన్‌టీయూకే వీసీ వీఎస్‌ఎస్æకుమార్, రిజిస్ట్రార్ సాయిబాబు, ప్రిన్సిపాల్ ప్రసాద్‌రాజు తదితరులు అభినందించారు.
Advertisement