రజనీ లింగా షూటింగ్ అడ్డుకునేందుకు యత్నం | Anajpur village residents try to stopped Lingaa shooting | Sakshi
Sakshi News home page

రజనీ లింగా షూటింగ్ అడ్డుకునేందుకు యత్నం

Published Thu, Jul 3 2014 10:21 AM | Last Updated on Wed, Mar 28 2018 11:05 AM

రజనీ లింగా షూటింగ్ అడ్డుకునేందుకు యత్నం - Sakshi

రజనీ లింగా షూటింగ్ అడ్డుకునేందుకు యత్నం

అనాజ్పూర్ : రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌ మండలం అనాజ్‌పూర్‌ సమీపంలో... తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌  'లింగా' సినిమా షూటింగ్‌ను అడ్డుకునేందుకు గ్రామస్తులు యత్నించారు. షూటింగ్ సందర్భంగా చెరువులో రసాయన పదార్ధాలు కలుస్తున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

 

దీంతో చెరువులో నీరు కలుషితమవుతుందని.. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్తామంటున్నారు. మరోవైపు షూటింగ్‌ జరుపుకునేందుకు ఇరిగేషన్‌, గ్రామ పంచాయతీ నుంచి సర్టిఫికెట్‌ తీసుకున్నామని సినిమా సిబ్బంది చెప్తున్నారు. కాగా అంతకు ముందు ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న   బాహుబలి షూటింగ్ను అడ్డకుంటామని అనాజ్ పూర్ గ్రామస్తులు యత్నించిన విషయం తెలిసిందే.

కాగా రజనీకాంత్ ఈ చిత్రంలో ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఆయన సరసన అనుష్క, సోనాక్షి సిన్హా హీరోయిన్లుగా నటిస్తున్నారు. కె ఎస్ రవికుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రజనీ పుట్టినరోజున ఈ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement