క్లైమాక్స్ దశకు చేరుకున్న రజనీ 'లింగా' | Rajinikanth 'Lingaa' shoot reaches climax | Sakshi
Sakshi News home page

క్లైమాక్స్ దశకు చేరుకున్న రజనీ 'లింగా'

Published Tue, Sep 9 2014 12:50 PM | Last Updated on Thu, Aug 9 2018 7:28 PM

క్లైమాక్స్ దశకు చేరుకున్న రజనీ 'లింగా' - Sakshi

క్లైమాక్స్ దశకు చేరుకున్న రజనీ 'లింగా'

సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం లింగా క్లైమాక్స్ దశకు చేరుకుంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కర్ణాటకలోని షిమోగా ప్రాంతంలో జరుగుతోంది. హాలీవుడ్ ఫైట్ మాస్టర్ లీ వైటేకర్ దర్శకత్వంలో కొన్ని ముఖ్యమైన ఫైటింగ్ సీక్వెన్సులను అక్కడ చిత్రీకరిస్తున్నారు. వైటేకర్ ప్రస్తుతం ఈ క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణలో చాలా బిజీగా ఉన్నారని, సినిమా చాలా బాగా వస్తోందని సినిమా యూనిట్కు చెందినవాళ్లు చెప్పారు. ఈ సినిమాకు కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.

మరో రెండు వారాలపాటు షూటింగ్ జరుగుతుందని, ఆ తర్వాత కొన్నాళ్ల పాటు బ్రేక్ ఉంటుందని.. అప్పుడు రజనీకాంత్, రవికుమార్ కలిసి శంకర్ తీస్తున్న 'ఐ' చిత్రం ఆడియో విడుదల కార్యక్రమానికి హాజరవుతారు. తన సినిమా ఆడియో విడుదలకు రావాల్సిందిగా శంకర్ స్వయంగా లింగా షూటింగ్ జరుగుతున్న ప్రాంతానికి వచ్చి రజనీకాంత్, రవికుమార్లను ఆహ్వానించారు. ఈ కార్యక్రమం ఈనెల 15న జరగనుంది. సోనాక్షి సిన్హా, అనుష్క నటిస్తున్న లింగాలో.. రజనీ ద్విపాత్రాభినయం చేస్తున్న విషయం తెలిసిందే. రజనీ పుట్టినరోజైన డిసెంబర్ 12నే ఈ సినిమా విడుదల అవుతుందని భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement