
లింగా టాకీ పూర్తి
లింగా చిత్రం మాటల చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఇక పాటల షూటింగ్ మాత్రమే మిగిలింది. చిత్రాన్ని రజనీకాంత్ పుట్టిన రోజు డిసెంబర్ 12న విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర యూనిట్ వర్గాలు వెల్లడించాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ కోచ్చడయాన్ విడుదల తరువాత లింగా చిత్రంలో నటించడానికి రెడీ అయ్యారు. ఈ చిత్రంలో ఆయన తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఇందులో ఒక పాత్ర నేటి తరానికి చెందింది కాగా మరో పాత్ర 1990 కాలానికి చెందినదని సమాచారం. ఇద్దరు రజనీల సరసన అనుష్క, సోనాక్షి సిన్హాలు రొమాన్స్ చేస్తున్నారు. కె.ఎస్.రవికుమార్ ముత్తు పడయప్పా చిత్రాల తరువాత రజనీకాంత్‌తో చేస్తున్న మూడో చిత్రం లింగా.
కన్నడ నటుడురకలైన్ వెంకటేశ్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ తొలి షెడ్యూల్ మైసూర్‌లో జరిగింది. ఆ తరువాత హైదరాబాద్, చెన్నై తదితర ప్రాంతాల్లో జరిగింది. చిత్ర తుది ఘట్ట సన్నివేశాలను కర్ణాటకలోని షిమోకా ప్రాంతంలో నెల రోజులుగా చిత్రీకరిస్తున్నారు. దీంతో చిత్ర టాకీపార్టు పూర్తి కావడంతో చిత్ర యూనిట్ ఇటీవల చెన్నైకి తిరిగి వచ్చింది. మిగిలిన పాటల చిత్రీకరణ పూర్తి చేసి చిత్రాన్ని రజనీకాంత్ పుట్టిన రోజు సందర్భంగా డిసెంబర్ 12న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు యూనిట్ వర్గాలు తెలిపారుు. చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని వచ్చే నెలలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ చిత్రానికి చాయాగ్రహణం రత్నవేల్ సంగీతాన్ని ఏ.ఆర్.రెహ్మాన్ అందిస్తున్నారు.