ravikumar
-
బీఆర్ఎస్లోకి మోహన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: శాసన మండలి ఉపాధ్యాయ కోటా మాజీ ఎమ్మెల్సీ, పీఆర్టీయూ మాజీ అధ్యక్షుడు బి.మోహన్‌రెడ్డి గురువారం మంత్రి కేటీ రామారావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్న ఆయన ఆ పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సారథ్యంలో విద్యారంగ, ఉపాధ్యాయ అంశాలపైన కలిసి పని చేసేందుకు బీఆర్ఎస్లో చేరుతున్నట్లు ప్రకటించారు. అలాగే ప్రముఖ కళాకారుడు బిత్తిరి సత్తి అలియాస్ చేవెళ్ల రవికుమార్ త్వరలో బీఆర్ఎస్లో చేరేందుకు రంగం సిద్ధమైంది. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ప్రముఖులను పార్టీలోకి ఆహా్వనిస్తున్న బీఆర్ఎస్, తాజాగా బిత్తిరి సత్తితోనూ సంప్రదింపులు జరిపింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, మంత్రి హరీశ్‌రావుతో బిత్తిరి సత్తి గురువా రం ప్రగతిభవన్‌లో భేటీ అయ్యారు. ముదిరాజ్ సామాజికవర్గంతో పాటు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించిన వారు బీఆర్ఎస్తో కలిసి పనిచేయాలని కేటీఆర్, హరీశ్ కోరినట్లు సమాచారం. బీఆర్ఎస్లో చేరికకు అంగీకరించినట్లు బిత్తిరి సత్తి ‘సాక్షి’కి వెల్లడించారు. ముదిరాజ్ సామాజికవర్గానికి మరికొందరు కీలక నేతలు కూడా త్వరలో బీఆర్ఎస్లో చేరుతున్నట్లు పార్టీ వర్గాలు చెబు తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఓ పార్టీకి చెందిన కీలక నేత కూడా బీఆర్ఎస్లో చేరేందుకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. -
బోరబండ ఇన్స్పెక్టర్పై వేటు
హైదరాబాద్: బోరబండ పోలీసుస్టేషన్ ఇన్స్పెక్టర్ కె.రవికుమార్‌పై వేటు పడింది. ఆయన్ను సిటీ కమిషనరేట్‌కే ఎటాచ్ చేస్తూ కొత్వాల్ సందీప్ శాండిల్య మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. విధి నిర్వహణలో అలసత్వం, రికార్డుల నిర్వహణలో నిర్లక్ష్యం తదితర కారణాల నేపథ్యంలో సీపీ ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోపక్క ఎస్సార్‌నగర్ పోలీసుస్టేషన్ పరిధిలో మంగళవారం వెలుగులోకి వచి్చన యువకుడి హత్య కారణంగా మరో ఇన్స్పెక్టర్పై చర్యలకు కమిషనర్ రంగం సిద్ధం చేశారు. దీనికి సంబంధించి బుధవారం ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. ఎన్నికల నేపథ్యంలో ప్రతి స్టేషన్ హౌస్ ఆఫీసర్ తమ పరిధిలో ఉన్న రౌడీషీటర్ల వంటి అసాంఘిక శక్తులపై కన్నేసి ఉంచాలని కొత్వాల్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. రౌడీషీటర్లకు సంబంధించిన రికార్డులు కలిగి ఉండాలని, వీటిని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడంతో పాటు ఇన్స్పెక్టర్లే స్వయంగా పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. వీరిని బైండోవర్ చేయడంతో పాటు క్రమం తప్పకుండా కౌన్సిలింగ్ ఇవ్వడం, వారి ఇళ్లను సందర్శించి కదలికలపై నిఘా ఉంచడం సైతం ఇన్స్పెక్టర్ల బాధ్యతగా సందీప్ శాండిల్య స్పష్టం చేశారు. దైనందిన విధుల నేపథ్యంలో ఈ వ్యవహారాల్లో ఎస్సై సహాయం తీసుకోవాలే తప్ప పూర్తిగా వారిపై విడిచిపెట్ట కూడదని ఆదేశాలు జారీ చేశారు. వీటి అమలును పర్యవేక్షించడానికి ఆయన మంగళవారం నుంచి ఠాణాల తనిఖీలు ప్రారంభించారు. వెస్ట్‌జోన్ పరిధిలోని పలు పోలీసుస్టేషన్లను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. బోరబండ ఠాణాలో సరైన రికార్డులు లేకపోవడం, రౌడీషీటర్ల వ్యవహారం ఎస్సైలే పర్యవేక్షించడం వంటివి సందీప్ శాండిల్య దృష్టికి వచ్చాయి. దీంతో ఇన్స్పెక్టర్ రవికుమార్‌ను నిలదీసిన ఆయన రౌడీషీటర్ల ఇళ్లకు వెళ్లారా? అంటూ ప్రశ్నించారు. తన వెంట వచ్చి కనీసం నలుగురి ఇళ్లైనా చూపాల్సిందిగా ఆదేశించారు. కొత్వాల్ వాహనం వరకు వెళ్ళిన రవికుమార్ ఆ వ్యవహారాలను ఎస్సైలు పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సందీప్ శాండిల్య ఆయన్ను కమిషనరేట్‌కు అటాచ్ చేస్తూ ఉత్తుర్వులు జారీ చేశారు. మరోపక్క రౌడీషీటర్ల కదలికలపై నిఘా ఉంచాలని కొత్వాల్ పదేపదే స్పష్టం చేస్తున్నారు. వాళ్లు ఏం చేస్తున్నారు? ఎవరితో వైరాలు ఉన్నాయి? తదితర అంశాలపై కన్నేయాల్సిందిగా ప్రత్యేక విభాగాలకు ఆదేశించారు. అయితే ఎస్సార్‌నగర్ రౌడీషీటర్ షేక్ షరీఫ్ సోమవారం రాత్రి యువకుడు తరుణ్‌ను హత్య చేశాడు. ఇది మంగళవారం వెలుగులోకి వచ్చింది. గతంలోనూ వీరి మధ్య వైరం ఉన్నా, పలుమార్లు ఘర్షణలు జరిగినా రౌడీషీటర్ పై నిఘా ఉంచడం, చర్యలు తీసుకోవడంలో ప్రత్యేక విభాగాలు నిర్లక్ష్యం వహించాయని కొత్వాల్ భావిస్తున్నారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ఆయన మరో ఇన్స్పెక్టర్పై వేటుకు రంగం సిద్ధం చేశారు. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు బుధవారం వెలువడే అవకాశం ఉంది. -
సంక్రాంతికి అయలాన్
శివ కార్తికేయన్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా ఆర్.రవికుమార్ దర్శకత్వంలో రూపొందిన సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ ‘అయలాన్ ’. కోటపాడి జె.రాజేష్, ఆర్డీ రాజా నిర్మించిన ఈ సినిమాను సంక్రాతికి విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు వెల్లడించారు. ‘‘అయలాన్ అంటే ఏలియన్ అని అర్థం. ఈ ప్రయాణంలో మాకు కొన్ని కష్టాలు ఎదురైనప్పటికీ ధైర్యం కోల్పోకుండా, పట్టుదలతో ఈ సినిమా చేశాం. నాణ్యతా ప్రమాణాల్లో రాజీ పడాలనుకోవడం లేదు. అందుకే సినిమా విడుదల కొంత ఆలస్యం అవుతోంది. మా మూవీలో 4500 సీజీ షాట్స్ ఉన్నాయి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో మా మూవీ రిలీజ్ కానుంది’’ అని యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. -
రాష్ట్ర వైద్య మండలి ఎన్నికలు షురూ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలందరి ఆరోగ్యానికి సంబంధించి అనేక కీలక నిర్ణయాలు తీసుకునే అధికారం ఉన్న తెలంగాణ రాష్ట్ర వైద్య మండలి (టీఎస్ఎమ్సీ) ఎన్నికలను 17 ఏళ్ల తర్వాత తొలిసారిగా నిర్వహించనున్నారు. ఉస్మానియా మెడికల్ కాలేజీ వేదికగా ఆదివారం ఈ ఎన్నికల మేనిఫెస్టోను హెచ్ఆర్డీఏ విడుదల చేసింది. అర్హత లేకుండా వైద్యం చేస్తున్న వారిని ప్రత్యేక కమిటీలు వేసి అరకడతామని ఈ మేనిఫెస్టోలో పేర్కొన్నారు. నూతన భవనం నిర్మించి, తెలంగాణ వైద్యులకు గౌరవం లభించేలా చూస్తామని, వైద్య విద్య ఫీజు నియంత్రణ దిశగా ప్రయత్నాలు చేస్తామని ప్రకటించారు. 48,405మంది డాక్టర్లకు ఓట్లు ప్రస్తుతం 48,405 మంది తెలంగాణ డాక్టర్లు ఈ ఎన్నికల్లో ఓటు వేసే అర్హత కలిగి ఉన్నారు. ఈ ఎన్నికల్లో 13 మంది వైద్యులు వైద్య మండలికి ఎన్నిక కానుండగా, ఇందుకోసం వందకు పైగా అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అభ్యర్థులంతా తమ విధివిధానాలతో సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసుకుంటున్నారు. కొందరు స్వతంత్ర అభ్యర్థులుగా నిలబడగా, మరికొందరు ప్యానల్‌గా ఏర్పడి పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికలు పోస్టల్ బాలెట్ ద్వారా జరగనున్నాయి. వచ్చే నెల నుంచి బ్యాలెట్ పేపర్ల పంపిణీ జరగనుండగా, వాటి లెక్క డిసెంబర్ 1న మొదలుకానుంది. కాగా మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో డా.మహేష్‌కుమార్, డా. ప్రతిభాలక్ష్మీ, డా. కుసుమరాజు రవికుమార్, డా.కిరణ్‌కుమార్ తోటావర్ తదితరులు పాల్గొన్నారు. -
పవన్ క్షమాపణ చెప్పాలి
ఏయూ క్యాంపస్ : ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆంధ్ర విశ్వవిద్యాలయంపై చౌకబారు విమర్శలు చేయడం పవన్‌కళ్యాణ్ మానుకోవాలని ఏయూ జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ జి.రవికుమార్ ఘాటుగా బదులిచ్చారు. ఏయూ ప్రతిష్టకు భంగం కలిగేలా పవన్ చేసిన వ్యాఖ్యలను శుక్రవారం ఆయన ఖండించారు. ఉద్యోగులు, విద్యార్థుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడిన జనసేన అధినేత వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. విశ్వవిద్యాలయాలకు అందించే ర్యాంకింగ్ అనేది ప్రధానంగా విద్యార్థులు, ఆచార్యుల నిష్పత్తిపై ఆధారపడి ఉంటుందన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. ♦ ర్యాంకింగ్‌లో పాల్గొనే విద్యా సంస్థల సంఖ్యపై కూడా వర్సిటీల ర్యాంకులు ఆధారపడి ఉంటుంది. 2019లో ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్‌కి కేవలం వెయ్యి విద్యా సంస్థలు పాల్గొంటే, 2023లో 2,478 సంస్థలు పాల్గొన్నాయి. ♦ తొలి 100 స్థానాల్లో నిలిచే విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్ 2.5 నుంచి 4 మార్కుల వ్యత్యాసం మాత్రమే ఉంటుంది. ర్యాంకింగ్ విధానంలో ఐఐటీలు, కేంద్రీయ, డీమ్డ్ విశ్వవిద్యాలయాలు కొంతమేర ప్రయోజనం పొందుతున్నాయి. ♦ గతంలోనే ఐఐటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఆచార్య రాంగోపాల్ ర్యాంకింగ్ విధానంలో కొన్ని మార్పులు చేయాలని సూచించారు. రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, కేంద్ర, డీమ్డ్ విశ్వవిద్యాలయాలకు పరిమితులు (పారామీటర్స్) వేరుగా ఉండాల్సిన అవసరముందని అన్నారు. ♦ ఇక ఏయూలో విద్యార్థులకు క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ఉద్యోగాలు సాధించే వారి సంఖ్య 2018తో పోలిస్తే 25 శాతానికి పైగా పెరిగింది. 2023లో ఏయూ విద్యార్థులు పొందిన అత్యధిక వార్షిక వేతనం రూ.84.5 లక్షలు. 2018లో విద్యార్థులు సాధించిన అత్యధిక వార్షిక వేతనం కేవలం రూ.22 లక్షలు మాత్రమే. ♦ కేంద్ర విశ్వవిద్యాలయాల కంటే మిన్నగా ఏయూలో ఏర్పాటుచేసిన టెక్ స్టార్టప్, ఇంక్యుబేషన్ సెంటర్ పనిచేస్తున్నాయి. ఇప్పటికే 124కి పైగా సాఫ్ట్వేర్ సంస్థలు ఇక్కడ పనిచేస్తున్నాయి. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్‌లో ఏయూ స్టార్టప్–ఇంక్యుబేషన్ సెంటర్ 14వ ర్యాంకు సాధించింది. తొలి 13 స్థానాల్లో ఐఐటీలు మాత్రమే నిలిచాయి. ♦ జాతీయ విశ్వవిద్యాలయాల తరహాలో 18 చెయిర్ ప్రొఫెసర్లు కలిగిన ఏకైక విశ్వవిద్యాలయం ఏయూ. దీనిపై ఉన్న నమ్మకంతో నవరత్న కంపెనీల నుంచి అమెరికాలో స్థిరపడిన భారతీయులు, ఏయూ పూర్వవిద్యార్థులు ఐఐటీ ఢిల్లీ తరహాలో ఇక్కడ చెయిర్ ప్రొఫెసర్లు ఏర్పాటుచేస్తున్నారు. ఇలా.. వర్సిటీలో ఇంత అభివృద్ధి జరుగుతున్నా తెలుసుకోకుండా ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్‌ని పవన్ చదవడం సరికాదు. ఇప్పటికైనా తప్పు తెలుసుకుని ఏయూకు ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలి. విద్య, వివేకంలేని వ్యక్తిలా పవన్ విశాఖ అర్బన్ కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడు పులపా రవీంద్రనాథ్ ఠాగూర్ ఏయూ క్యాంపస్ : జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలు విద్య, వివేకంలేని వ్యక్తి మాటల్లా ఉన్నాయని విశాఖ అర్బన్ కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడు పులపా రవీంద్రనాథ్ ఠాగూర్ విమర్శించారు. ఏయూపై పవన్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఏయూను శుక్రవారం సందర్శించిన ఆయన మాట్లాడుతూ.. ప్రజలు హర్షించేలా పవన్ మాట్లాడాలని హితవు పలికారు. నిజమైన విద్యావంతుడు, సంస్కారవంతులెవరూ ఏయూని ఉద్దేశించి ఇలా మాట్లాడరన్నారు. పవన్ ఈ ప్రశ్నలకు బదులివ్వు.. ఏయూ విద్యా విభాగాధిపతి డాక్టర్ టి.షారోన్ రాజు భారతీయ విద్యావ్యవస్థపై పవన్ అవగాహన లేకుండా మాట్లాడటం సరికాదని ఏయూ విద్యా విభాగాధిపతి డాక్టర్ టి.షారోన్ రాజు అన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థపై ఆరోపణలు చేసే ముందు నిజానిజాలు తెలుసుకోకుండా మాట్లాడటం సమంజసం కాదన్నారు. ఇన్ని అసత్య ఆరోపణలు చేసిన పవన్‌కు తాను కొన్ని ప్రశ్నలు సంధిస్తున్నానని.. వాటికి ఆయన సమాధానం చెప్పాలని షారోన్‌రాజు సవాల్ విసిరారు. అవి.. ♦ ఏయూకి 2018లో ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.150 కోట్లు నిధులను పసుపు–కుంకుమ పథకానికి ఎందుకు మళ్లించారు. అప్పుడు మీరు దీనిపై ఎందుకు ప్రశ్నించలేదు? ♦ ఏయూ సొంత నిధుల నుంచి రూ.5 కోట్లు వెచ్చించి జ్ఞానభేరి సభను చంద్రబాబు నిర్వహించారు. వాటిని ఎందుకు తిరిగి చెల్లించలేదు? ♦విశ్వవిద్యాలయాల్లో ఉద్యోగ నియామకాలపై 1996 నుంచి 2006 వరకు, తిరిగి 2014 నుంచి 2018 వరకు ఎందుకు నిషేధం విధించారు? ♦పోలమాంబ ఆలయం పక్కనే, ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న రూ.300 కోట్లు విలువైన స్థలాన్ని ఇటీవల ఏయూ స్వాధీనం చేసుకుంది. ఇంతకాలం ఈ స్థలం ఎవరి గుప్పిట్లో ఉందో మీకు తెలుసా? ♦ 2019–2023 మధ్య 200 మందికిపైగా ఆచార్యులు ఏయూలో పదవీ విరమణ చేశారు. అయినప్పటికీ ఏయూ జాతీయ స్థాయిలో మెరుగైన ర్యాంకులు, స్కోర్‌ను మెరుగుపర్చుకుంటూ వస్తోంది. దార్శనికత కలిగిన రాష్ట్ర సీఎం ప్రపంచ స్థాయి విధానాలను అమలుచేయడంవల్లే ఇది సాధ్యపడింది. ఈ విషయం మీకు తెలుసా? -
యాదాద్రి భువనగిరి: మృతదేహాన్ని కొరికేసిన ఎలుకలు!
భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రి మార్చురీలో ఉన్న ఓ మృతదేహాన్ని ఎలుకలు కొరుక్కుతిన్నాయి. ఏపీలోని గుంటూరు జిల్లా ఎడ్లపాడు మండలం బాయపాలెం గ్రామానికి చెందిన పెరికల రవికుమార్ (38) కుటుంబం 2016లో భువనగిరికి వలస వచ్చింది. రవికుమార్‌కు వివాహం జరగా, ఒక కుమార్తె జన్మించింది. కొంతకాలానికి ఆమె చనిపోవడంతో, రెండో వివాహం చేసుకున్నాడు. ఆమెకు ఓ కుమారుడు ఉన్నాడు. ఏడాది క్రితం రెండో భార్య రవికుమార్‌ను వదిలివెళ్లింది. దీంతో ఆయన తల్లిదండ్రులు, పిల్లలతో కలిసి పట్టణంలోని ప్రగతినగర్‌లో అద్దెకు ఉంటున్నాడు. డ్రైవర్‌గా పనిచేస్తున్న రవికుమార్ కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. ఆదివారం రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చాడు. తగాదా పడుతుండడంతో తల్లిదండ్రులు, పిల్లలు సమీపంలోని తెలిసిన వారి ఇంటికి వెళ్లారు. తిరిగి రాత్రి 11:30 నిమిషాలకు ఇంటికి వచ్చేసరికి రవికుమార్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. మార్చురీ గదిలోని ఫ్రీజర్‌లో కాకుండా బయట భద్రపరిచారు. ఆ ఆనవాళ్లు చూసి.. రవికుమార్ మృతదేహాన్ని చూసేందుకు సోమవారం ఉదయం కుటుంబసభ్యులతో పాటు బంధువులు మార్చురీకి వచ్చారు. అప్పటికే మృతదేహం ముఖం, చెంపలు, నుదుటిపై ఎలుకలు కొరికిన ఆనవాళ్లు చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందన్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లారు. ఎలుకలు కొరికినట్టు జరుగుతున్న ప్రచారం అవాస్తవమని ఆస్పత్రి సూపరింటెండెంట్ చిన్నానాయక్ తెలిపారు. -
అప్‌స్టాక్స్ బ్రేక్–ఈవెన్ ..
ముంబై: డిస్కౌంట్ బ్రోకింగ్ సంస్థ అప్‌స్టాక్స్ గత ఆర్థిక సంవత్సరంలో బ్రేక్–ఈవెన్ (లాభ నష్ట రహిత స్థితి) సాధించింది. 2022–23లో మొత్తం ఆదాయం 40 శాతం ఎగిసి రూ. 1,000 కోట్లు దాటినట్లు కంపెనీ సహ వ్యవస్థాపకుడు, సీఈవో రవి కుమార్ తెలిపారు. తమ దగ్గర ప్రస్తుతం రూ. 1,000 కోట్ల పైచిలుకు నగదు నిల్వలు ఉన్నాయని చెప్పారు. సొంత వ్యాపారాన్ని మరింతగా విస్తరించడం, ఇతర వ్యాపారాలను కొనుగోలు చేయడం తదితర మార్గాల్లో వృద్ధి సాధనపై దృష్టి పెట్టనున్నట్లు పేర్కొన్నారు. వచ్చే అయిదారేళ్లలో తమ కస్టమర్ల సంఖ్యను పది రెట్లు పెంచుకుని 10 కోట్లకు చేర్చుకోవాలని నిర్దేశించుకున్నట్లు ఆయన చెప్పారు. 2009లో ప్రారంభమైన అప్‌స్టాక్స్‌కి ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1.1 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు. వ్యాపార దిగ్గజం రతన్ టాటాతో పాటు టైగర్ గ్లోబల్ వంటి అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ సంస్థలు పెట్టుబడులు పెట్టాయి. -
సీఎం ప్రోత్సాహంతో కాంస్య పతకం
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రోత్సాహంతో ప్రపంచస్థాయి దేహదారుఢ్య పోటీలో కాంస్య పతకం సాధించినట్లు బాడీబిల్డర్ రవికుమార్ తెలిపారు. బాడీ బిల్డింగ్ పోటీకి సీఎం ఆర్థికంగా సాయం అందించి ప్రోత్సహించారని తెలిపారు. ఈ మధ్యనే దక్షిణ కొరియాలో జరిగిన 170కి పైగా దేశాలు పాల్గొన్న మిస్టర్ యూనివర్స్–2022 పోటీలో 70 కేజీల విభాగంలో రవికుమార్ కాంస్యపతకం సాధించారు. ఈ సందర్భంగా ఏపీఐఐసీ వైస్ చైర్మన్, ఎండీ జవ్వాది సుబ్రమణ్యంను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. 2020 అక్టోబర్‌లో సీఎం జగన్‌ను కలిసి ఆర్థికసాయం అందించాల్సిందిగా కోరగా, సీఎం ఆదేశాల మేరకు స్వర్గీయ మేకపాటి గౌతమ్‌రెడ్డి చొరవ తీసుకొని ఆర్జాస్ స్టీల్ కంపెనీ ద్వారా రూ.9 లక్షల సాయాన్ని అందించారని గుర్తు చేశారు. ఈ కాంస్య పతకాన్ని మేకపాటి గౌతమ్‌రెడ్డికి అంకితం చేస్తున్నట్లు తెలిపారు. రవికుమార్‌ను ఏపీఐఐసీ ఎండీ సత్కరించి అభినందించారు. మరిన్ని అంతర్జాతీయ పతకాలను సాధించాలని ఆకాంక్షించారు. -
వరి వదల్లేక.. ఊపిరే వదిలాడు
(మృతుని వద్ద దొరికిన లేఖ సారాంశం) సీఎం కేసీఆర్‌కు.. వర్షాకాలంలో సన్నరకం వరి వేయమన్నారు కానీ ధర లేదు. నేను మొత్తం సన్న రకం వరి వేశాను. దిగుబడి తక్కువ వచ్చింది. మద్దతు ధర లేదు. నీరు పుష్కలంగా ఉన్న నా పొలంలో వరిసాగు మాత్రమే అయితది. నేనేం వేయాలి.. కౌలు ఇచ్చిన వారికి ఏం ఇవ్వాలి. మెదక్ రూరల్: వరి పంట వేయొద్దని ప్రభుత్వం సూచించడం.. కుమారుడికి అనారోగ్యం.. వెంటాడుతున్న అప్పులు.. ఇవన్నీ ఆ అన్నదాతను కుంగదీశాయి. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మెదక్ జిల్లా హావేలిఘనపూర్ మండలం బోగుడా భూపతిపూర్ గ్రామంలో శుక్రవారం రైతు కర్ణం రవికుమార్ (40) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బాధితుని కుటుంబ సభ్యులు, పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలివి. రైతు కర్ణం రవికుమార్, పెంటమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తెకు వివాహమైంది. చిన్న కుమార్తె దుబ్బాకలో ఇంటర్ సెకండియర్ చదువుతోంది. కుమారుడు సాయికుమార్ ఐదేళ్ల వయసు నుంచే హిమోఫీలియా అనే వ్యాధితో బాధపడుతుండటంతో ఎనిమిదో తరగతిలో చదువు మాన్పించారు. వరి సాగు శాపమైంది రైతు కర్ణం రవి తనకున్న మూడెకరాలతో పాటు మరో రెండు ఎకరాలను కౌలుకు తీసుకొని ప్రతి సీజన్లో వరిసాగు చేసేవాడు. ఇదే క్రమంలో వానాకాలంలో సన్న రకం వరి సాగు చేశాడు. మద్దతు ధర లేకపోవడం.. ఆశించిన మేర దిగుబడి రాక నష్టపోవలసి వచ్చింది. వ్యవసాయ అధికారులు ఇటీవల గ్రామంలో పర్యటించి వరి వేయకూడదని, ఆరుతడి పంటలనే సాగు చేయాలని చెప్పడంతో ఆందోళనకు గురయ్యాడు. కుమారుడి వైద్యానికి రూ.18 లక్షల ఖర్చు కుమారుడు సాయికుమార్ హిమోఫీలియా అనే వ్యాధితో బాధపడుతున్నాడు. వైద్యం కోసం ఇప్పటి వరకు రూ.18 లక్షలు ఖర్చు చేశాడు. ఇందులో రూ.10 లక్షలు అప్పు తీర్చగా, మరో రూ.8 లక్షల అప్పు ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. అప్పు తీర్చే క్రమంలో తనకున్న మూడెకరాల్లో ఆరు నెలల క్రితం 30 గుంటల భూమిని ఇతరులకు అమ్మేశాడు. కుమారుడి చికిత్సకు ప్రతి నెలా హైదరాబాద్‌లోని గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులకు వెళ్లి ఐదు రోజులు ఐదు ఇంజెక్షన్లు ఇప్పించేవాడు. ఇటీవల ఆ ఇంజక్షన్లు అందుబాటులో లేక, 67 ఏళ్ల తండ్రికి పింఛన్ రాకపోవడం తదితర ఆర్థిక సమస్యలతో కుంగిపోయాడు. రవికుమార్ (40) శుక్రవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో పొలం వద్దకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లాడు. పొలంలోనే పురుగుల మందు తాగాడు. ఎనిమిది గంటల సమయంలో కుమారుడు పొలం వద్దకు వెళ్లగా, తండ్రి ప్రాణాపాయ స్థితిలో కనిపించాడు. ఆస్పత్రికి తీసుకెళ్లే సమయంలోనే మృతి చెందాడు. సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖను మృతుని జేబులో గుర్తించారు. అండగా నిలుస్తాం మృతుడి కుటుంబానికి అండగా నిలుస్తామని ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని బాధితుని కుటుంబ సభ్యులను పరామర్శించి రూ.10 వేలు ఆర్థిక సాయం అందజేశారు. మృతుని కుమారుడి వైద్య చికిత్సల కోసం అవసరమైన ఖర్చులను ప్రభుత్వం భరించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రవి ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమని కాంగ్రెస్ నాయకుడు మ్యాడం బాలకృష్ణ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మెదక్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆందోళనకు దిగారు. -
ఫైనల్లో ఓడినా.. చరిత్ర లిఖించాడు
-
కరోనాతో కార్పొరేటర్ వానపల్లి రవి మృతి
-
ఆసియా సీనియర్ రెజ్లింగ్: భారత్‌కు ఐదు పతకాలు
అల్మాటీ (కజకిస్తాన్): మరోసారి తమ ఆధిపత్యం చాటుకుంటూ ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ పురుషుల ఫ్రీస్టయిల్ విభాగంలో భారత రెజ్లర్లు అదరగొట్టారు. శనివారం బరిలోకి దిగిన ఐదు వెయిట్ కేటగిరీల్లోనూ భారత్‌కు పతకాలు వచ్చాయి. రవి కుమార్ దహియా (57 కేజీలు) తన టైటిల్‌ను నిలబెట్టుకోగా... బజరంగ్ పూనియా (65) రజతం సాధించాడు. కరణ్ (70 కేజీలు), నర్సింగ్ యాదవ్ (79 కేజీలు), సత్యవర్త్ కడియాన్ (97 కేజీలు) కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. ఇప్పటికే టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధిం చిన రవి కుమార్ ఆసియా చాంపియన్‌షిప్‌లో తన జోరు కనబరిచాడు. అలీరెజా (ఇరాన్)తో జరిగిన ఫైనల్లో ఢిల్లీకి చెందిన రవి కుమార్ 9–4తో గెలిచాడు. సెమీఫైనల్లో రవి 11–0తో అబురుమైలా (పాలస్తీనా)పై, క్వార్టర్ ఫైనల్లో 9–2తో సఫరోవ్ (ఉజ్బెకిస్తాన్)పై విజయం సాధించాడు. గతేడాది న్యూఢిల్లీలో జరిగిన ఆసియా చాంపియన్‌షిప్‌లోనూ రవి కుమార్ స్వర్ణ పతకాన్ని సాధించాడు. బజరంగ్‌కు గాయం ఆసియా చాంపియన్‌షిప్‌లో మూడో స్వర్ణం సాధించాలని ఆశించిన భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియాకు నిరాశ ఎదురైంది. జపాన్ రెజ్లర్ టకుటో ఒటుగురోతో ఫైనల్ తలపడాల్సిన బజరంగ్ మోచేతి గాయం కారణంగా బరిలోకి దిగలేదు. దాంతో బజరంగ్‌కు రజతం... ఒటుగురోకు స్వర్ణం దక్కాయి. ఓవరాల్‌గా ఆసియా చాంపియన్‌షిప్‌లో బజరంగ్‌కిది ఏడో పతకం. ఇందులో రెండు స్వర్ణాలు, మూడు రజతాలు, రెండు కాంస్యాలున్నాయి. ఈ టోర్నీ క్వార్టర్ ఫైనల్లో బజరంగ్ 3–0తో జియోంగ్ యోంగ్‌సియోక్ (కొరియా)పై, సెమీఫైనల్లో 7–0తో బిల్‌గున్ సర్‌మన్‌డక్ (మంగోలియా)పై గెలిచాడు. కాంస్య పతక బౌట్లలో కరణ్ 3–1తో సీంగ్‌బోంగ్ లీ (కొరియా)పై, నర్సింగ్ యాదవ్ 8–2తో అహ్మద్ మోసిన్ (ఇరాక్)పై, సత్యవర్త్ 5–2తో మిన్‌వన్ సియో (కొరియా)పై విజయం సాధించారు. -
సిఫార్సు వేరు.. ఆర్డర్ వేరు
సాక్షి, అమరావతి: ప్రజాప్రతినిధులు సిఫార్సు లేఖలు ఇవ్వడం వేరు, కచ్చితంగా చేయాలని ఆర్డర్ లెటరు ఇవ్వడం వేరు.. అని అవినీతి నిరోధక శాఖ సంయుక్త సంచాలకులు రవికుమార్ వెల్లడించారు. ఈఎస్ఐ స్కాములో అప్పటి మంత్రి అచ్చెన్నాయుడు ఫలానా కంపెనీకే ఇవ్వాలని ఆర్డర్ ఇచ్చారని, దీంతో మంత్రి, ఆయనతోపాటు ఆ సర్వీసు ప్రొవైడరూ ఇద్దరూ నిందితులేనన్నారు. టెలీహెల్త్ సర్వీసెస్‌కు సంబంధించి అచ్చెన్నాయుడు మొత్తం మూడు లేఖలు ఇచ్చినట్టు పేర్కొన్నారు. బుధవారం విజయవాడలోని ఏసీబీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశంలో ఏమన్నారంటే... ► మొత్తం రూ.975 కోట్ల కొనుగోళ్లలో రూ.150 కోట్లకు పైగా అవినీతి జరిగినట్టు నిర్ధారించాం. ► రూ.లక్ష విలువ దాటితే ఈ–ప్రొక్యూర్‌మెంట్‌కు వెళ్లాలి. కానీ, నామినేషన్ కింద ఇచ్చారు. ► కడప ప్రాంతీయ కార్యాలయం జాయింట్ డైరెక్టర్ జనార్దన్ ఇందులో కీలకపాత్ర పోషించారు. ► అధిక ధరలతో బడ్జెట్‌కు మించి కొనుగోళ్లు జరిపారు. కొన్ని మందులు 140% ఎక్కువ రేటుకు కొన్నారు. ► డ్రగ్స్‌కు రూ.293.51 కోట్లు కొనుగోలు అవకాశం ఉండగా, రూ.698.36 కోట్లకు కొన్నారు. ► డిస్పెన్సరీల నుంచి ఇండెంట్లు లేకుండానే కొన్నారు. ఆ మందులు కూడా ఆస్పత్రులకు చేరలేదు. ► అమరావతి, తిరుమల వంటి మెడికల్ ఏజెన్సీలు అప్పటికప్పుడు పుట్టుకొచ్చి ఆ తర్వాత మాయమయ్యాయి. ► ఈ కేసులో 12మందిని అరెస్టు చేశాం. మరో 8 మందిని అరెస్టు చేయాల్సి ఉంది. మరో 5 మంది నిందితులను గుర్తించాం. వారికోసం ఏసీబీ బృందాలు గాలింపు చేస్తున్నాయి. వీరిలో మాజీ మంత్రి పితాని కుమారుడు వెంకటసురేష్ కూడా ఉన్నారు. ► ఈ కేసుపై త్వరలోనే చార్జిషీట్ వెయ్యబోతున్నాం. -
అచ్చెన్నాయుడి లేఖ ఆధారంగానే కాంట్రాక్ట్‌లు
సాక్షి, అమరావతి: మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే కె.అచ్చెన్నాయుడి లేఖ ఆధారంగానే టెలీ హెల్త్‌కు కాంట్రాక్ట్‌లు ఇచ్చారని.. ఈఎస్ఐలో రూ.150 కోట్లకు పైగా అక్రమాలు జరిగాయని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) జాయింట్ డైరెక్టర్ రవికుమార్ వెల్లడించారు. విజయవాడలోని ఏసీబీ ప్రాంతీయ కార్యాలయంలో శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అవసరం లేకపోయినా మందులు, నాణ్యత లేని పరికరాలు కొనుగోలు చేశారని చెప్పారు. అప్పట్లో కార్మిక శాఖ మంత్రి హోదాలో అచ్చెన్నాయుడు లేఖల ద్వారా ఆర్డర్లు ఇవ్వాలని ఈఎస్ఐ అధికారులను ఆదేశించినట్టు నిర్ధారణ అయ్యిందన్నారు. ఆధారాలున్నాయి కాబట్టే అచ్చెన్నాయుడిని విచారణకు రావాలని కోరలేదని పేర్కొన్నారు. తగిన ఆధారాలు సేకరించి.. అవకతవకలు జరిగినట్టు గుర్తించి ఆయనను అరెస్ట్ చేశామని వివరించారు. రెండు ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేస్తున్నాయని చెప్పారు. ఈ కేసుకు సంబంధించి జాయింట్ డైరెక్టర్ వెల్లడించిన మరిన్ని వివరాలివీ. ► ఈఎస్ఐలో 2014 నుంచి 2019 వరకు రూ.988.77 కోట్లతో మందులు, పరికరాల కొనుగోలు చేశారు. ఇందులో రూ.150 కోట్లకు పైగా అవినీతి అక్రమాలు జరిగినట్టు గుర్తించాం. ► ల్యాబ్ కిట్లు, సర్జికల్ మెటీరియల్, ఆఫీస్ ఫర్నిచర్, ఈసీజీ పరికరాల కొనుగోలులో అక్రమాలు జరిగినట్టు గుర్తించాం. ► ఈ కుంభకోణంలో అప్పటి కార్మిక శాఖ మంత్రి, టెక్కలి ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుతోపాటు మొత్తం 19 మంది ప్రమేయం ఉన్నట్టు గుర్తించాం. ఇప్పటివరకు ఏడుగుర్ని అరెస్ట్ చేశాం. ► టెలీ మెడిసిన్‌కు సంబంధించి ఇప్పటివరకు ఏడుగురిపై రెండు కేసులు నమోదు చేశాం. ఒక కేసు టెలీ హెల్త్ సర్వీసులకు కాంట్రాక్ట్‌లు కట్టబెట్టడంపై, మరో కేసు మందులు, పరికరాల కొనుగోళ్లలో అక్రమాలపై నమోదు చేశాం. ► ఒక కేసులో చింతల కృష్ణప్ప రమేష్‌కుమార్ ఏ–1 గాను, అచ్చెన్నాయుడు ఏ–2 గాను ఉన్నారు. ► మరో కేసులో ఈటగాడి విజయకుమార్, విప్పర్తి జనార్దన్, ఇవన రమేష్‌బాబు, ఎంకేపీ చక్రవర్తి, గోరో వెంకట సుబ్బారావు నిందితులు. వీరందరికీ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి రిమాండ్ విధించడంతో రాజమహేంద్రవరంలోని కేంద్ర కారాగారానికి తరలించాం. ► అచ్చెన్నాయుడి ఆరోగ్య సమస్య ఉండటంతో మెరుగైన వైద్యం అందించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. శస్త్ర చికిత్స చేయించుకున్న విషయాన్ని న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లడంతో రిమాండ్ అనంతరం ఆస్పత్రికి తరలించాలని న్యాయమూర్తి ఆదేశాలు ఇచ్చారు. ► ఈ కుంభకోణానికి సంబంధించి అనేక మందిని విచారణ చేయాల్సి ఉంది. అనేక రికార్డులు, డాక్యుమెంట్లు పరిశీలించాల్సి ఉంది. ► అచ్చెన్నాయుడు, రమేష్‌కుమార్ తరపున హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్లు వేశారు. హైకోర్టు నుంచి నోటీసులు వచ్చిన అనంతరం వాటిని పరిశీలించి ఏసీబీ సమాధానం ఇస్తుంది. ► ఈ కుంభకోణానికి తెలంగాణాలోను లింకులున్నాయి. ఇందులో 19 మంది ప్రమేయం ఉన్నట్టు ప్రాథమికంగా గుర్తించాం. ► ఈ కుంభకోణం వెనుక ఇంకా చాలా మంది ఉన్నారు. ప్రభుత్వ అధికారులతోపాటు ప్రైవేట్ వ్యక్తుల ప్రమేయం ఎక్కువ ఉంది. అవినీతి వ్యవహారంతో సంబంధం ఉన్న వారందరినీ బయటకు లాగుతాం. -
రూ 150 కోట్ల మేర అవినీతి జరిగింది
-
బాలకృష్ణ ఆదేశాలతో రవికుమార్‌ను నెట్టేసారు
-
వైఎస్సార్ అనే దేవుడు మా బాధ విన్నాడు
‘‘మా ఇంటి గడప దగ్గర చెప్పులు వదిలేసి లోపలికి వెళ్తే వైఎస్సార్గారివి మూడు ఫోటోలు ఉంటాయి. పదేళ్ల క్రితం ఆగిపోవాల్సిన మా అమ్మ గుండె ఇప్పటికీ వినబడుతుందంటే దానికి కారణం వైయస్సార్‌గారు’’ అంటూ ఎమోషనల్ అయ్యారు రవికుమార్. శుక్రవారం ‘యాత్ర’ ప్రీ–రిలీజ్ వేడుకలో మహానేత వై.ఎస్. రాజశేఖర రెడ్డి ప్రవేశ పెట్టిన పథకాల ద్వారా లబ్ధి పొందిన పలువురు మాట్లాడారు. వారిలో ‘యాత్ర’కు అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేసిన రవికుమార్ తన మనోభావాలను పంచుకున్నారిలా. 2008లో నేను డిగ్రీ చదువుతున్నాను. మా అమ్మకు ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్‌కి తీసుకెళితే హార్ట్‌లో హోల్ ఉందని, ఆరు నెలల కంటే బతకదని చెప్పారు. మా అమ్మ దండం పెట్టి ‘అరే, నాకు బతకాలని ఉందిరా. ఏమైనా చేసి ఓ మూడు లక్షలు అప్పు చేసి నాకు ఆపరేషన్ చేయించు’ అన్న మాటలు నాకింకా గుర్తు. అమ్మ కంటే ఏదీ ఎక్కువ కాదనిపించి చదువు మానేసి హైదరాబాద్ వచ్చాను. ఓ హోటల్లో ఎంగిలి ప్లేట్లు, గ్లాసులు కడుగుతూ పనిచేశాను. నాలుగు నెలలు కష్టపడి పనిచేస్తే నేను సంపాదించింది 20 వేలు. అవి మా అమ్మ మందులకు, బస్సు చార్జీలకు కరిగిపోయాయి. మా అమ్మకు రోజులు దగ్గర పడ్డాయని తెలిసి నన్ను పిలిచి చెల్లిని బాగా చూసుకోమని చెప్పింది. చర్చి, గుడి, మసీదు ఏ దేవుడినీ వదలకుండా దండం పెట్టుకునేది. ఏ దేవుడూ ఆమె ఏడుపు వినలేదు. కానీ, వైఎస్సార్ అనే దేవుడు ‘నేను విన్నాను, నేను ఉన్నాను’ అని ఆరోగ్యశ్రీ పథకం పెట్టారు. కామినేని హాస్పిటల్లో రూపాయి ఖర్చు లేకుండా అమ్మకు వైద్యం చేశారు. వైద్యం కోసం ఎవరినైనా అప్పు అడిగితే షూరిటీగా ఏం పెడతారు? అని అడిగేవారు. మాకు ఉన్నదల్లా రెండు గదుల ఇందిరమ్మ ఇల్లు మాత్రమే. అది కూడా ఆ దేవుడి (వైఎస్సార్) దయే. ఈ ఫంక్షన్‌కు మా అమ్మను తీసుకొచ్చేవాణ్ని. కానీ తీసుకురాలేదు. కారణం మా అమ్మకి నేను ఇప్పటికీ ఏం పని చేస్తున్నానో తెలియదు. నేను సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నానని మా అమ్మకి చెప్పాలంటే భయం వేసి చెప్పలేదు. ఎందుకంటే సినిమాలంటే ఒప్పుకోరని. కానీ అమ్మా... ఇప్పుడు చెబుతున్నాను, ఫిబ్రవరి 8న విడుదలయ్యే ‘యాత్ర’ సినిమాను మా అమ్మ, చెల్లెలితో మా ఊరు డిచ్‌పల్లిలో చూస్తాను. నేనీ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసి వైఎస్సార్‌గారి రుణం కొంచెమన్నా తీర్చుకున్నాను అనుకుంటున్నాను. నాకీ చాన్స్ ఇచ్చిన దర్శకుడు మహి.వి.రాఘవ్ గారికి నిర్మాతలు విజయ్ చిల్లా గారికి, శశి దేవిరెడ్డి, శివ గార్లకు జీవితాంతం రుణపడి ఉంటాను’’ అని రవికుమార్ ఎమోషనల్ కావడం వీక్షకులను కదిలించింది. ఈ సందర్భంగా ‘సాక్షి’ మాట్లాడినప్పుడు రవికుమార్ మరిన్ని విశేషాలు పంచుకున్నారు. ► ‘యాత్ర’ మీ మొదటి సినిమానా? దర్శకుడు మహీ వి. రాఘవ్గారు తీసిన ‘పాఠశాల’ నా మొదటి సినిమా. ఆ సినిమాకు ఆఫీస్‌బాయ్‌గా పనిచేశాను. నేను కాఫీ షాప్‌లో చేసే రోజుల్లో మహీ అక్కడికి వస్తుండేవారు. అలా ఆయన సినిమాలతో అసోసియేట్ అయ్యే అవకాశం ఏర్పడింది. మహీగారు చేసిన ‘ఆనందోబ్రహ్మ’కు రైటర్‌గా, ‘యాత్ర’కు రచనా సహకారం అందించాను. ► వైయస్సార్‌గారికి మొదటినుంచే అభిమానిగా ఉండేవారా? మొదట్లో రాజశేఖర్ రెడ్డిగారంటే రాజకీయనాయకులు, మన ముఖ్యమంత్రి అని తెలుసు. కానీ మా అమ్మకు తిరిగి ప్రాణం పోశాక ఆయన మీద అభిమానం పెరిగిపోయింది. ► మొన్న జరిగిన వేడుకలో మాట్లాడాలని ముందే అనుకున్నారా? లేదు. పది నిమిషాల ముందు చెప్పారు. టైముంది. నువ్వు కూడా లబ్ధి పొందావు కదా. నీకు అనిపించింది మాట్లాడితే మాట్లాడు అన్నారు. సడెన్‌గా దర్శకులు స్టేజ్ మీద మాట్లాడమంటే ఎమోషనల్ అయిపోయాను. ► ఇలా వైయస్‌గారి బయోపిక్ ఐడియా ఉందని మహీ మీతో చెప్పినప్పుడు మీ రియాక్షన్ ఏంటి? మహీసార్, నేను, రాజశేఖర్ అని ఓౖ రెటర్. మేం ముగ్గురం ట్రావెల్ అవుతుంటాం. ఫస్ట్ మాతోనే చెప్పారు. చాలా ఎగై్జట్ అయ్యాను. రైతు ఆత్మహత్య చేసుకునే సీన్ ఒకటి, నారాయణరెడ్డిగారు ఎప్పుడొచ్చినా వైయస్‌గారు ఆయనకు సీట్ ఇచ్చి కూర్చోమనేవారట. అలాగే హై కమాండ్ ఏదో విషయం మాట్లాడటానికి వైయస్గారిని ఒక్కరే రావాలని చెప్పారట. నాతో కేవీపి కూడా వస్తారని సమాధానం పంపారట. దానికి వాళ్లు ‘సీటు కావాలంటే ఒక్కరే రావాలి’ అని చెప్పారట. ‘పదవులు చాలా చూస్తాం. నాతో ఉండే మనుషులే ఎక్కువ’ అనుకునేవారట. ఇలా కొన్ని సీన్స్ చెప్పడంతో మేం ముందుకు వెళ్లాం. ► మీ అమ్మగారు ఇప్పుడు ఎలా ఉన్నారు? బాగున్నారు. చలికాలం అప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మొన్న ఫంక్షన్లో నేను మాట్లాడినది విని, ఫోన్ చేసి ఏడ్చారు. ‘యాత్ర’ సినిమాకి పని చేశానన్న ఆనందం అది. -
రెజ్లర్ రవి కుమార్‌కు రజతం
ప్రపంచ అండర్–23 రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్ రవి కుమార్ రజత పతకంతో సంతృప్తి పడ్డాడు. రొమేనియాలోని బుకారెస్ట్‌లో జరిగిన ఈ మెగా ఈవెంట్లో పురుషుల ఫ్రీస్టయిల్ 57 కేజీల విభాగం ఫైనల్లో రవి 0–6తో జపాన్‌కు చెందిన తొషిహిరో హసెగవా చేతిలో ఓడిపోయాడు. ఈ ఈవెంట్ చరిత్రలో పతకం నెగ్గిన మూడో భారతీయ రెజ్లర్‌గా రవి గుర్తింపు పొందాడు. 2017లో బజరంగ్ పూనియా (65 కేజీలు), ఓంప్రకాశ్ (70 కేజీలు) కూడా రజత పతకాలే సాధించారు. -
అమెరికాలో ఇన్ఫీ మరో సెంటర్!!
బెంగళూరు: దేశీ రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ‘ఇన్ఫోసిస్’ తాజాగా అమెరికాలోని కనెక్టికట్‌లోని హర్ట్ఫోర్డ్లో టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ హబ్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. దీని కోసం 2022 నాటికి 1,000 మంది అమెరికన్లను నియమించుకుంటామని పేర్కొంది. కనెక్టికట్ టెక్నాలజీ–ఇన్నోవేషన్ హబ్ ద్వారా ఇన్సూరెన్స్, హెల్త్‌కేర్, మ్యానుఫాక్చరింగ్ రంగాలపై దృష్టి కేంద్రీకరిస్తామని తెలిపింది. ‘కనెక్టికట్‌లో కార్యకలాపాలు విస్తరించడం సంతోషంగా ఉంది. 1,000 మందికి ఉపాధి కల్పిస్తాం’ అని ఇన్ఫోసిస్ ప్రెసిడెంట్ రవికుమార్ పేర్కొన్నారు. -
కొత్త చట్టాలపై అపోహలు వద్దు
నిజామాబాద్ అగ్రికల్చర్(నిజామాబాద్ అర్బన్): తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన మార్కెటింగ్ చట్టాలు, నిబంధనలపై వ్యాపారులు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని, అందరి శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని వీటిని అమలుచేస్తున్నామని మార్కెటింగ్‌శాఖ జాయింట్ డైరెక్టర్ రవికుమార్ తెలిపారు. నగరంలోని నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కిసాన్ మీటింగ్ హాల్లో మార్కెటింగ్ చట్టాలు, నిబంధనలపై సోమవారం వ్యాపారులకు అవగాహనాసదస్సును ఏర్పాటుచేశారు. ఈసందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం గత డిసెంబర్ 29వ తేదీ నుంచి మార్కెటింగ్ శాఖలో కొత్త చట్టాలు, నిబంధనలను అమల్లోకి తెచ్చిందన్నారు.మూడునెలల్లోపు వ్యాపారులు కొత్త చట్టాలకు లోబడి లైసెన్సులను పొందాలని, అందులోకి తమ వ్యాపారాన్ని మార్చుకోవాలని సూచించారు. ఇక నుంచి తమ వ్యాపార సముదాయాల నుంచే నేరుగా లైసెన్సులు పొందవచ్చని, ఒకే లైసెన్స్‌తో రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా పంట ఉత్పత్తులను కొనుగోలు చేసుకోవచ్చన్నారు. ఈ–పర్మిట్లు, ఈ–తక్‌పట్టీల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేదని, నేరుగా ఆన్లైన్లో పొందవచ్చని తెలిపారు. కొత్తగా లైసెన్సులు పొందే వారికి రూ.5లక్షలు, రెన్యూవల్ చేసుకునే వ్యాపారులకు రూ.10లక్షల బ్యాంక్ గ్యారెంటీ నిబంధన తప్పనిసరి చేసిందన్నారు. రూ.10లక్షల బ్యాంక్ గ్యారెంటీతో కోటీ వరకు టర్నోవర్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. సామర్థ్యాన్ని బట్టి వ్యాపారులు వ్యాపారం చేసుకోవాలని, మించి వ్యాపారం చేయడం వల్ల మోసాలు జరుగుతున్నాయన్నారు. నిజామాబాద్ వ్యాపారులు మంచి వారేనని, రాష్ట్రంలోని అన్ని మార్కెట్ల వ్యాపారులను ఉద్ధేశించి చట్టాలను రూపొందించామని తెలిపారు. ఇప్పటి నుంచి వ్యాపారుల లైసెన్సులు రాష్ట్రస్థాయిలో నోటిఫై అవుతాయన్నారు. రాబోయే రోజుల్లో జాతీయస్థాయి లైసెన్సులుగా మారవచ్చని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 44 మార్కెట్లను ఈ–నామ్ ద్వారా అనుసంధానం చేశామని, ప్రస్తుతానికి ఈ మార్కెట్లలో ఏ పంట ఉత్పత్తినైనా ఆన్లైన్లో కొనుగోలు చేయవచ్చని తెలిపారు. మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షులు గంపా శ్రీనివాస్ గుప్త, రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మోటూరి దయానంద్ గుప్త మాట్లాడుతూ కొత్త చట్టాలకు అనుగుణంగా తాము వ్యాపారం చేసేందుకు సుముఖంగా ఉన్నామని, కానీ బ్యాంకు గ్యారెంటీని తగ్గించాలని కోరారు.బ్యాంకు గ్యారెంటీ వ్యాపారులకు భారమని, జిల్లా రైతులను ఏనాడూ మోసం చేసిన చరిత్ర లేదన్నారు. వ్యాపారులతో చర్చించకుండా బ్యాంకు గ్యారెంటీని నిర్ణయించారని, కావున పాత విధానాన్నే అనుసరించాలని డిమాండ్‌చేశారు.మంత్రి, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని జేడీని కోరారు. అంతకుముందు జేడీ రవికుమార్ పాలకవర్గం ప్రతిపాదించిన కవర్ షెడ్స్ ఆవశ్యకతను ఆయా గ్రామాల ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను తీసుకున్నారు. మార్కెట్‌కమిటీ పరిధిలోని గ్రామాల్లో కవర్ షెడ్స్ నిర్మాణానికి పాలకవర్గం మంత్రికి ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఈకార్యక్రమంలో మార్కెట్‌కమిటీ వైస్ చైర్మన్ చంద్రశేఖర్‌రెడ్డి, సెలక్షన్ గ్రేడ్ సెక్రటరీ స్వరూపారాణి, డీఎంఓ రియాజ్, అసిస్టెంట్ సెక్రటరీ విజయ్‌కిషోర్, రవీందర్‌రెడ్డి, వ్యా పారులు కరిపె సత్యం, మాస్టర్ శంకర్, మల్లేష్, దేవేందర్, హన్మంతు, సాయిరాం, పిండి గంగాధర్, రాధాకిషన్, మురళీ, గంగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
కులం పేరుతో దూషించారు...!
సాక్షి, నెహ్రూనగర్ (గుంటూరు): వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగి నన్నం రవికుమార్ మృతికి కారకులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని ఆగ్రహం వ్యక్తం చేశాయి. రవికుమార్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం గుంటూరు జీజీహెచ్‌లోని మార్చురీ ఎదుట ధర్నా నిర్వహించారు. పొన్నూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం జూనియర్ అసిస్టెంట్ నన్నం రవికుమార్ ఈనెల 17న పురుగు మందు తాగి ఆత్మ హత్యాయత్నం చేయ డంతో జీజీహెచ్‌కి తరలించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం అందించినా ఫలితం దక్కలేదు. రవికుమార్ బుధవారం రాత్రి చనిపోయాడు. ఆవేదనను వీడియో తీసి... ఆత్మహత్యకు ముందు రవికుమార్ తన ఆవేదనను సెల్ఫోన్లో వీడియో తీసి వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా అందరికీ తెలిపాడు. తనకన్నా సీనియారిటీ తక్కువగా ఉన్నవారికి నగరంలో పోస్టింగ్ ఇచ్చి ఆరోగ్యం బాగాలేని తనను దూర ప్రాంతానికి బదిలీ చేసి పోస్టింగ్ ఆర్డర్ సైతం ఇవ్వకుండా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఇబ్బంది పెడుతున్నారని పేర్కొన్నాడు. అడిగినంత డబ్బులు ఇవ్వలేదనే కక్షతోనే తనను పొన్నూరుకు బదిలీ చేశారని తెలిపాడు. . కులం పేరుతో దూషించి వేధించటంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు వీడియోలో పేర్కొన్నాడు. నలుగురి సస్పెన్షన్ : రవికుమార్ మృతికి కారకులైన నలుగురిని సస్పెండ్ చేస్తున్నట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ జొన్నలగడ్డ యాస్మిన్ తెలిపారు. -
క్యూ2లో బజాజ్ ఆటో రికార్డ్ టర్నోవర్
ముంబై: వాహన దిగ్గజం బజాజ్ ఆటో నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం జూలై–సెప్టెంబర్ క్వార్టర్లో స్వల్పంగా తగ్గి రూ.1,194 కోట్లకు పడిపోయింది. గత క్యూ2లో రూ.1,200 కోట్ల నికర లాభం సాధించామని బజాజ్ ఆటో తెలిపింది. ఆదాయం రూ.6,432 కోట్ల నుంచి 2 శాతం పెరిగి రూ.6,566 కోట్లకు పెరిగిందని బజాజ్ ఆటో ప్రెసిడెంట్ (బిజినెస్ డెవలప్మెంట్) ఎస్.రవికుమార్ చెప్పారు. నిర్వహణ లాభం 0.2 శాతం ఎగసి రూ.1,297 కోట్లకు పెరగ్గా, మార్జిన్ 170 బేసిస్ పాయింట్లు తగ్గి 19.7 శాతానికి పడిపోయిందని పేర్కొన్నారు. నగదు, నగదు సమాన నిధులు రూ.12,699 కోట్లుగా ఉన్నాయని వివరించారు. ఉత్పత్తి వ్యయాలు అధికంగా ఉండడం, అమ్మకాలు తక్కువగా ఉండటం, ఇన్వెస్ట్మెంట్ ఆదాయం తక్కువగా ఉండడంతో ఇతర ఆదాయం 13 శాతం తగ్గడం తదితర కారణాల వల్ల నికర లాభం తగ్గిందని తెలిపారు. అయితే ఈ క్వార్టర్లో గతంలో ఎన్నడూ లేనంత టర్నోవర్ సాధించామని, 21 శాతం ఇబిటా మార్జిన్ నమోదు చేశామని, దేశీయ మోటార్ సైకిల్ సెగ్మెంట్లో 20 శాతానికి పైగా మార్కెట్ వాటా సాధించామని వివరించారు. 40 లక్షల వాహన విక్రయాలు లక్ష్యం: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 40 లక్షల వాహనాలు విక్రయించాలనే (ఎగుమతులను కూడా కలుపుకొని) లక్ష్యంగా పెట్టుకున్నామని, ఈ లక్ష్య సాధన దిశగానే విక్రయాలున్నాయని ఎస్. రవికుమార్ చెప్పారు. ఆల్‌టైమ్ హైకి బజాజ్ ఆటో: ఫలితాలు అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ, అంచనాలు మించడంతో బజాజ్ ఆటో షేర్ మంగళవారం ఇంట్రాడేలో ఆల్‌టైమ్ హై, రూ.3,310ను తాకింది. చివరకు 1 శాతం లాభంతో రూ.3,257 వద్ద ముగిసింది. -
స్విమ్స్ డైరెక్టర్.. లుంగి డాన్స్!
►టీటీడీ ఆడిటోరియంలో స్టెప్పులు తిరుపతి : టీటీడీకి చెందిన సంస్థలో అపచారం చోటు చేసుకుంది. శ్రీవారి పాదాల చెంత కొలువై, దేవస్థానం ఆర్థిక సహకారంతో నిర్వహిస్తున్న శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్)లో సాక్షాత్తు డైరెక్టర్ తన హోదా మరచి ఓ కార్యక్రమంలో ‘లుంగి డ్యాన్స్’ అనే పాటకు చిందులేయడం వివాదా స్పదమైంది. ఆయన డ్యాన్స్‌కు సంబంధించిన వీడియో, చిత్రాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇటీవల స్విమ్స్ ఉద్యోగుల పిల్లల సంరక్షణ కేంద్రం వార్షికోత్సవాన్ని శ్రీపద్మావతి ఆడిటోరియంలో నిర్వ హించారు. ముఖ్య అతిథిగా స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ రవికుమార్ హాజరయ్యారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థినులతో కలసి స్టెప్పు లేయడం చూసిన వారు ముక్కున వేలేసుకున్నారు. స్విమ్స్ ఆసుపత్రిలో అసభ్యకరమైన, పాశ్చాత్య సంస్కృతికి చెందిన కార్యక్రమాలకు స్థానం లేదు. ఆ సంస్థ వైన్స్ చాన్స్‌లర్, డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఉన్నతాధికారే ఈ విషయాన్ని విస్మరించి, వేదికపై శ్రీవారి విగ్రహం ఎదుటే ఏమాత్రం సంకోచించకుండా స్టెప్పులేశారు. పాలనాపరంగానూ ఆరోపణలు ఎన్ఆర్ఐ అయిన డాక్టర్ రవికుమార్ అధికార పార్టీకి చెందిన వైద్య శాఖ మంత్రికి సన్నిహితుడు. ఏడాది క్రితం డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఆరంభంలో కొన్ని పాలనా పరమైన సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నప్పటికీ తర్వాత అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లోనే పని చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కీలకమైన నిర్ణయాలను సైతం అధికార పార్టీకి చెందిన అధికారులకు అప్పగించడం, తరచూ సెలవులో విదేశాలకు వెళ్లడంతో స్విమ్స్‌లో పాలన అటకెక్కింది. సీనియర్లను కాకుండా తనకు సన్నిహితంగా ఉన్న వ్యక్తికి ఫర్ఫ్యూజనిస్ట్గా శాశ్వత ప్రాతిపదికన ఉపాధి కల్పించారు. ఫైనాన్స్ కమిటీ అప్రూవల్, ప్రిన్సిపల్ సెక్రటరీ అనుమతి లేకుండానే ఈ నియామకం పట్ల సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టు ఉద్యోగులకు 151 జీవో ప్రకారం కనీస వేతనాలు చెల్లించడం లేదు. ఓ మహిళకు కాంట్రాక్టు పద్ధతిలో ఉపాధి కల్పించి క్వార్టర్స్ కేటాయించడంపై విమర్శ లున్నాయి. దీనిపై స్విమ్స్ డైరెక్టర్‌ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. -
ఆ జంట ఒక్కటైంది
రొళ్ల (మడకశిర) : పెళ్లి కొడుకు తన తప్పు తెలుసుకోవడంతో ఈ నెల 2న ఆగిన ఓ వివాహం తిరిగి సోమవారం జరిగింది. దీంతో ఆ జంట మళ్లీ ఒకటయ్యారు. వివరాలిలా ఉన్నాయి. రొళ్ల మండలం కాకి గ్రామానికి చెందిన లక్కమ్మ గోవిందరాజు దంపతుల కుమార్తె ఆశను గుడిబండ మండలం కొంకల్లు గ్రామానికి చెందిన నరసమ్మ, హనుంతరాయప్ప రెండవ కుమారుడు రవికుమార్‌తో పెద్దలు వివాహం నిశ్చయించారు. పెద్దల సమక్షంలో ఫిబ్రవరి 9న నిశ్చితార్థం చేశారు. ఇరు కుటుంబాల వారు కలిసి 02.03.2017న గురువారం ఉదయం 10.15 నుండి 11 గంటల మధ్యలో రొళ్ల లక్ష్మీనరసింహాస్వామి ఆలయంలో పెళ్లి జరిపించాలని అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. 2వ తేదీ వేకువజామున బహిర్భూమికి వెళ్లి వస్తానని పెళ్లి కొడుకు పరారయ్యాడు. దీంతో పెళ్లి ఆగిపోయింది. పెళ్లికొడుకుపై అప్పట్లో రొళ్ల పోలీసుస్టేషన్ ఫిర్యాదు చేశారు. అయితే తన తప్పు తెలుసుకున్న రవికుమార్ స్నేహితులతో కలిసి వచ్చి రొళ్ల ఆంజనేయస్వామి ఆలయంలో సోమవారం ఆశను వివాహం చేసుకున్నాడు. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. -
నాన్నా అనకుండానే..
బెంగళూరు : కర్ణాటకలోని దొడ్డబళ్లాపురంలో రోడ్డుప్రమాదంలో దుర్మరణం పాలైన మైసూరు లోకాయుక్త ఎస్పీ రవికుమార్ (36) అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. బెంగళూరు నుంచి మైసూరుకు తిరిగివెళ్తూ ఆయన ప్రయాణిస్తున్న కారు రామోహళ్లి వద్ద బోల్తా పడడంతో దుర్మరణం పాలయ్యారు. గురువారం రవికుమార్ భౌతికకాయాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చారు. కడసారి చూసేందుకు బంధువులే కాకుండా పార్టీలకతీతంగా రాజకీయ నాయకులు, జనం తరలివచ్చారు. సాసలు గ్రామంలో చిన్ననాటి స్నేహితులు రవిని తలుచుకుని కన్నీటిపర్యంతమయ్యారు. కుటుంబ సభ్యులను సముదాయించడం ఎవరితరం కాలేదు. నిరుపేద కుటుంబం నుంచి ఉన్నతస్థాయికి మూడేళ్ల క్రితం రవికుమార్‌కు అనిత అనే యువతితో వివాహం జరుగగా 10 రోజుల క్రితమే వారికి ఆడపాప జన్మించింది. పురిటి బిడ్డ కన్నతండ్రిని కళ్లుతెరిచి చూసే లోపే శాశ్వతంగా తండ్రి దూరమవడం అందరినీ కంటతడి పెట్టించింది. రవికుమార్ తల్లిదండ్రులు తీవ్ర శోకంలో మునిగిపోయారు. నిరుపేద రైతు కుటుంబానికి చెందిన రవికుమార్ పట్టుదలతో చదివి పోలీసు అధికారిగా ఉద్యోగంలో చేరారు. స్వశక్తితో జీవితంలో ఉన్నతస్థానానికి చేరుకుంటున్న తరుణంలో విధికి కన్నుకుట్టింది. ఆయనకు ఇద్దరు అన్నలు ఉండగా ఒకరు టీచరు, మరొకరు రైతు. భార్య అనిత గృహిణి. భర్త లేడనే చేదు నిజం నమ్మలేక ఆమె షాక్‌కు గురైంది. పాప పుట్టాక భర్త ఒక్కసారి చూసి వెళ్లారు. త్వరలోనే వస్తానంటూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడని బంధువులు విలపించారు. తిరిగిచూడని మంత్రులు.. భగ్గుమన్న స్థానికులు మధ్యాహ్నం ఒంటిగంట అయినా ఒక్క మంత్రి కూడా రవికుమార్‌కు నివాళులర్పించడానికి రాకపోవడం పట్ల గ్రామస్తులు ఆగ్రహించారు. ఒక ఉన్నతాధికారి విధినిర్వహణలో మరణిస్తే కనీసం నివాళులర్పించలేరా? అని ప్రశ్నించారు. హోం మినిస్టర్ పరమేశ్వర్, జిల్లా ఇన్చార్జి మంత్రి కృష్ణభైరేగౌడ తక్షణం రావాలని డిమాండు చేస్తూ గంటపాటు రవికుమార్ భౌతికకాయంతో ధర్నా చేపట్టారు. అనంతరం అక్కడకు చేరుకున్న స్థానిక ఎమ్మెల్యే వెంకట రమణయ్య మాట్లాడుతూ మంత్రులు రాలేని పరిస్థితిలో ఉన్నారని వివరణ ఇచ్చి శాంతింపజేశారు. జిల్లా కలెక్టర్ పాలయ్య, ఏసీ జగదీష్, తహసీల్దార్ మోహన్, బెంగళూరు ఐజీ సీమంత్‌కుమార్‌సింగ్, మైసూరు ఐజీ నితిన్‌కుమార్, ఉన్నతాధికారులు రవికుమార్‌ను కడసారి దర్శించి నివాళులర్పించారు. -
ఘనంగా పూరి జన్మదిన వేడుకలు
బంజారాహిల్స్: ప్రముఖ సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ జన్మదిన వేడుకలు బుధవారం జూబ్లీహిల్స్‌లోని ఆయన కార్యాలయంలో ఘనంగా జరిగాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పూరి జగన్నాథ్ అభిమాన సంఘ అధ్యక్షుడు రవికుమార్ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు నుంచి 500 మంది అభిమానులతో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం 300 మంది అభిమానులు రక్తదానం చేశారు. పూరి జగన్నాథ్ కేక్ కట్ చేసిన అనంతరం 500 మంది పేదలకు అన్నదానం చేశారు. -
స్నాచింగ్‌కు పాల్పడిన బీటెక్ స్టూడెంట్ అరెస్ట్
జల్సాలకు అలవాటపడి చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు రోజుల క్రితం నగరంలోని ఎల్బీనగర్ రాక్‌టౌన్ కాలనీలో నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో నుంచి గుర్తుతెలియని దుండగుడు గొలుసు లాక్కెళ్లాడు. ఈ సంఘటన పై బాధితురాలు పోలీసులను ఆశ్రయించండంతో.. పోలీసులు సమీపంలోని సీసీ టీవీ ఫూటేజిల ఆధారంగా చైన్ స్నాచింగ్‌కు పాల్పడిన రవికుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి రెండు తులాల మంగళ సూత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు. రవికుమార్ నగరంలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్నట్లు పోలీసులు గుర్తించారు. -
పుట్టిన బిడ్డను చూసేందుకు వెళ్తూ..
కదిరి అర్బన్ : మండల పరిధిలోని అలీపూర్‌తండా వద్ద శనివారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీ కొని గాండ్లపెంట మండలం కటారుపల్లికి చెందిన రవికుమార్(27) అనే యువకుడు దుర్మరణం చెందాడు. మృతుడి బంధువులు తెలిపిన మేరకు వివరాలిలాఉన్నాయి. కటారుపల్లికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు వేమయ్య, పద్మావతిల ఏకైక కుమారుడు రవికుమార్. రెండేళ్లక్రితం కటారుపల్లిక్రాస్‌కుచెందిన హేమవతితో వివాహం జరిగింది. రవికుమార్ బెంగళూరులో డ్రైవర్‌పని, భార్య నర్సు ఉద్యోగం చేసుకుంటూ జీవించేవారు. హేమవతి శనివారం ఉదయం కదిరిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. భార్య, కూతురును చూసేందుకు ద్విచక్రవాహనంలో బెంగూళూరు నుంచి రవికుమార్ వస్తున్నాడు. వాహనం అలీపూర్‌తండావద్దకు రాగానే వెనుక వస్తున్న గుర్తుతెలియని వాహనం ఢీ కొంది. దీంతో రవికుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. కుమారుడి మరణవార్త విన్న తండ్రి ఆస్పత్రిలోనే సృహ కోల్పోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తాడిపత్రిలో బాలుడు.. తాడిపత్రి: తాడిపత్రిలోని కంచాని లాడ్జి వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పట్టణంలోని ఏటిగడ్డపాలెంకు చెందిన బాషు కుమారుడు మహమ్మద్‌గౌస్(16) మరణించినట్లు ఎస్ఐ ఆంజనేయులు తెలిపారు. సీబీ రోడ్డులో బైక్‌పై వెళ్తూ కాలినడకన వెళ్తున్న శివారెడ్డి అనే వ్యక్తిని ఢీకొని కిందపడినట్లు చెప్పారు. అదే సమయంలో వచ్చిన ట్రాక్టర్ అతని కాళ్లపై వెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డాడు.వెంటనే అనంతపురం ఆస్పత్రికి తరలించగా అక్కడ మృతి చెందినట్లు వివరించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
పరిశోధనలకు అధిక ప్రాధాన్యం
తిరుపతి మెడికల్: స్టెమ్‌సెల్ థెరపీ రంగంలో పరిశోధనలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ రవికుమార్ తెలిపారు. గురువారం స్విమ్స్ శ్రీపద్మావతి ఆడిటోరియంలో రేడియాలజీ గోల్డ్‌మెడల్ ఒరేషన్ ప్రోగ్రాంను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డైరెక్టర్ రవికుమార్ రేడియాలజీరంగంలో చోటు చేసుకుంటున్న విప్లవాత్మకమైనన మార్పులను వివరించారు. డాక్టర్ సంజీవ శర్మ మాట్లాడుతూ శ్రీవారి చెంత ఏర్పాటైన సంస్థ ద్వారా తనకు గోల్డ్‌మెడల్ లభించడం తన అదృష్టం అన్నారు.‘క్లినికల్ అప్లికేషన్స్ ఆఫ్ ఇమేజ్ గైడెడ్ ఆటోలోగస్ స్టెమ్‌సెల్ థెరపీ ఇన్ వేరియస్ స్టేజెస్’ అనే అంశంపై ఆయన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేశారు. ప్రొఫెసర్ డాక్టర్ ఏవై లక్ష్మీ మాట్లాడుతూ రేడియాలజీ రంగంలో విశేష సేవలు అందించిన వారికి ప్రతి ఏటా గోల్డ్ మెడల్ ఇస్తున్నట్టు తెలిపారు. -
ఉద్యోగం రాలేదనే మనస్తాపంతో..
ఉద్యోగం రాలేదనే మనస్తాపంతో బెజ్జాల రవికుమార్(24) అనే యువకుడు మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మహకవిపోతన కాలనీలో చోటుచేసుకుంది. రవికుమార్ ఎంటెక్ చదివాడు. చదువు అయిపోయి సంవత్సరం గడిచినా ఉద్యోగం రాకపోవడంతో మనస్తాపం చెంది ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. -
ఏడీఏల సస్పెన్షన్‌కు కలెక్టర్ సిఫారసు?
అనంతపురం అగ్రికల్చర్ : రైతులకు దక్కాల్సిన క్రిబ్కో కంపెనీకి చెందిన రాయితీ ఎరువులను నిబంధనలకు విరుద్ధంగా భాస్కర్ ఫర్టిలైజర్స్‌కు తరలించిన వ్యవహారంలో ఏడీఏ (పీపీ) కె.మల్లికార్జున, అనంతపురం డివిజన్ ఏడీఏ రవికుమార్‌లను సస్పెండ్ చేయాలని కలెక్టర్ శశిధర్ వ్యవసాయశాఖ కమిషనరేట్‌కు సిఫారసు చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ అక్రమ బాగోతంపై జాయింట్ కలెక్టర్–2 ఖాజామొహిద్దీన్ విచారణ నివేదికను కలెక్టర్‌కు అందజేసిన విషయం విదితమే. దీని ఆధారంగా ఏడీఏ (పీపీ) కె.మల్లికార్జున, ఏడీఏ రవికుమార్‌లను ఇప్పటికే విధుల నుంచి తప్పించారు. తదుపరి చర్యల్లో భాగంగా ఇద్దరినీ సస్పెండ్ చేయాలని సిఫారసు చేసినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో ఇంకా ఎవరిపాత్ర ఏ స్థాయిలో ఉందనే విషయంపై విచారణ కొనసాగించి.. మరికొందరిపై చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. నేడో రేపో ఇద్దరు అధికారులకూ సస్పెన్షన్ ఉత్తర్వులు రావచ్చని వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. మొత్తమ్మీద ఎరువుల కుంభకోణం వ్యవసాయశాఖలో కలకలం రేపుతోంది. ఇందులో భాగస్వాములైన అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. -
టీడీపీ ఎంపీ తోట నర్సింహంపై ఫిర్యాదు
కాకినాడ : తూర్పు గోదావరి జిల్లా కాకినాడ ఎంపీ తోట నర్సింహంపై (జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సంస్థ) నేషనల్ చైల్డ్ రైట్స్ కమిషన్‌కు రవికుమార్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. మైనర్లు అయిన తమ పిల్లల ఫోటోలను అభ్యంతరంగా చిత్రీకరించి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేశారని అతడు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఎంపీతో పాటు మరో అయిదుగురిపైనా అతడు ఫిర్యాదు చేశాడు. మాధవపట్నంలోని ఓ భూవివాదంలో తమ కుటుంబాన్ని భయబ్రాంతులకు గురి చేస్తున్నారని రవికుమార్ ఆవేదన వ్యక్తం చేశాడు. రవికుమార్ ఫిర్యాదుపై స్పందించిన నేషనల్ చైల్డ్ రైట్స్ కమిషన్ ఇందుకు సంబంధించి ఏపీ హోంశాఖ కార్యదర్శి, డీజీపీకి నోటీసులు జారీ చేసింది. ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ సెక్సువల్ అఫెన్సెస్ కింద కేసు నమోదు చేయాలని ఆదేశించింది. కాగా తనపై వచ్చిన ఆరోపణలను ఎంపీ తోట నర్సింహం ఖండించారు. తనపై లేనిపోని దుష్ప్రచారం చేస్తున్నారని, దీనిపై తాను చర్యలు తీసుకుంటానని ఆయన హెచ్చరించారు. -
హాస్టల్ నుంచి విద్యార్థి అదృశ్యం
ఎస్సీ వసతి గృహం నుంచి బాలుడు అదృశ్యం అయిన సంఘటన నిజామాబాద్ జిల్లా వర్నిలో గురువారం వెలుగుచూసింది. స్థానిక ఎస్సీ బాలుర వసతి గృహంలో ఉంటూ తొమ్మిదో తరగతి చదువుతున్న రవికుమార్(14) హాస్టల్ నుంచి అదృశ్యమయ్యాడు. దీంతో హాస్టల్ సిబ్బంది, తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
మద్యానికి డబ్బులివ్వలేదని ఆత్మహత్య
నందిగామ: మద్యానికి భార్య డబ్బులివ్వలేదనే మనస్తాపంతో ఓ వ్యక్తి బలవన్మరణం చెందాడు.కృష్ణా జిల్లా నందిగామలోని రమణ కాలనీలో శనివారం ఉదయం చోటు చేసుకుంది ఈ ఘటన. వేముల రవికుమార్(40), వెంకటనర్సమ్మ దంపతులు తమ ఇద్దరు కుమార్తెలతో కలిసి రెండు నెలల క్రితం గుంటూరు నుంచి వలస వచ్చారు. రవి కుమార్ తాపీ పని, వెంకటనర్సమ్మ కూలి పనులు చేస్తుంటారు. మద్యానికి బానిసైన రవి కుమార్ శుక్రవారం రాత్రి భార్యను మద్యం కోసం డబ్బులు అడగ్గా తన వద్ద లేవని ఆమె బదులిచ్చింది. ఇంటి నుంచి బయటకు వెళ్లిన రవికుమార్ మద్యం తాగి అర్థరాత్రి సమయంలో వచ్చి గొడవపడ్డాడు. శనివారం ఉదయం వెంకటనర్సమ్మ నిద్ర లేచి చూసేసరికి ఇంట్లోనే ఉరికి వేలాడుతూ కనిపించాడు. -
పెళ్లి తర్వాత జీవితం
భారతీయ సంప్రదాయం గొప్పతనం గురించి తెలిపే కథాంశంతో రాజ్ ఈమండి నిర్మించనున్న చిత్రం ‘శ్రీకారం’. ‘ముహూర్తం’ సినిమాతో నంది పురస్కారం గెల్చుకున్న పి. రవికుమార్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రంలో ప్రముఖ హీరో, హీరోయిన్ నటించనున్నారు. రాజ్ ఈమండి మాట్లాడుతూ -‘యూఎస్‌లో వ్యాపారరంగంలో విజయవంతంగా కొనసాగుతున్నా. స్వచ్ఛమైన, సంప్రదాయ ప్రేమకథతో సినిమా చేయాలని ‘శ్రీకారం’ కథ రాసుకున్నా. ఇండియా, అమెరికాలో నివసించేవాళ్ల మధ్య పెళ్లిళ్లు, పెళ్లి తర్వాత జీవితం అనే కథాంశంతో ఉంటుంది. షూటింగ్‌ని 90 శాతం అమెరికాలోనే జరుపుతాం’’ అని చెప్పారు. -
ప్రపంచ వ్యాప్తంగా 2400 థియేటర్లలో 'లింగా' విడుదల
చెన్నై: సూపర్ స్టార్ రజనీకాంత్ జన్మదిన కానుకగా డిసెంబర్ 12న శుక్రవారం లింగా చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 2400 థియేటర్లలో విడుదలైంది. తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా రజనీకాంత్ అభిమానులు కోలహాలంతో నిండిపోయింది. ఈ సందర్భంగా అభిమానులందరూ బాణసంచా కాలుస్తూ సంబరాలు జరుపుకుంటున్నారు. పాండిచ్చేరిలోని అన్ని థియేటర్లలో లింగా చిత్రం విడుదలైంది. కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ స్వరాలు అందించారు. ఈ చిత్రం వరల్డ్ వైడ్ ప్రదర్శన హక్కులను ఓ ప్రముఖ సినీ నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్ సంస్థ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. రవికుమార్ - రజనీ కాంత్ కాంబినేషన్లో గతంలో నిర్మించిన ముత్తు, అరుణాచలం, నరసింహ చిత్రాలు ఘన విజయాలు సాధించాయి. దాంతో లింగా చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. -
లింగా టాకీ పూర్తి
లింగా చిత్రం మాటల చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఇక పాటల షూటింగ్ మాత్రమే మిగిలింది. చిత్రాన్ని రజనీకాంత్ పుట్టిన రోజు డిసెంబర్ 12న విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర యూనిట్ వర్గాలు వెల్లడించాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ కోచ్చడయాన్ విడుదల తరువాత లింగా చిత్రంలో నటించడానికి రెడీ అయ్యారు. ఈ చిత్రంలో ఆయన తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఇందులో ఒక పాత్ర నేటి తరానికి చెందింది కాగా మరో పాత్ర 1990 కాలానికి చెందినదని సమాచారం. ఇద్దరు రజనీల సరసన అనుష్క, సోనాక్షి సిన్హాలు రొమాన్స్ చేస్తున్నారు. కె.ఎస్.రవికుమార్ ముత్తు పడయప్పా చిత్రాల తరువాత రజనీకాంత్‌తో చేస్తున్న మూడో చిత్రం లింగా. కన్నడ నటుడురకలైన్ వెంకటేశ్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ తొలి షెడ్యూల్ మైసూర్లో జరిగింది. ఆ తరువాత హైదరాబాద్, చెన్నై తదితర ప్రాంతాల్లో జరిగింది. చిత్ర తుది ఘట్ట సన్నివేశాలను కర్ణాటకలోని షిమోకా ప్రాంతంలో నెల రోజులుగా చిత్రీకరిస్తున్నారు. దీంతో చిత్ర టాకీపార్టు పూర్తి కావడంతో చిత్ర యూనిట్ ఇటీవల చెన్నైకి తిరిగి వచ్చింది. మిగిలిన పాటల చిత్రీకరణ పూర్తి చేసి చిత్రాన్ని రజనీకాంత్ పుట్టిన రోజు సందర్భంగా డిసెంబర్ 12న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు యూనిట్ వర్గాలు తెలిపారుు. చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని వచ్చే నెలలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ చిత్రానికి చాయాగ్రహణం రత్నవేల్ సంగీతాన్ని ఏ.ఆర్.రెహ్మాన్ అందిస్తున్నారు. -
రూ.9 లక్షల పట్టివేత
పాచిపెంట, న్యూస్‌లైన్ : ఎన్నికల నేపథ్యంలో పి.కోనవలస ఆంధ్ర-ఒడిశా సరిహద్దు చెక్‌పోస్టు వద్ద బుధవారం ఉదయం తనిఖీ చేస్తున్న పోలీసులకు.. భారీ మొత్తంలో నగదు లభ్యమైంది. ఒడిశా నుంచి వస్తున్న వాహనంలో రూ.9 లక్షలకుపైగా నగదును స్వాధీనం చేసుకున్నారు. విషయం తెలుసుకున్న సాలూరు సీఐ జి.దేముళ్లు పాచిపెంట పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. డబ్బు తరలిస్తున్న వ్యక్తుల నుంచి వివరాలు సేకరించారు. అనంతరం స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడారు. ప్రైవేట్ పాసింజర్ వాహనాన్ని తనిఖీ చేస్తుండగా నలుపు రంగు బ్యాగులో రూ.9 లక్షలకుపైగా నగదు లభ్యమైందని చెప్పారు. ఒడిశాలోని సుంకి గ్రామానికి చెందిన అభిషేక్ కుమార్, నిర్మల్ యాదవ్ ఈ మొత్తాన్ని తరలిస్తున్నారని తెలిపారు. వారిని ప్రశ్నించగా.. మద్యం బేవరేజెస్ కంపెనీకి తీసుకెళ్తున్నట్లు చెప్పారని తెలిపారు. అయితే ఇందుకు సంబంధించిన ఆధారాలను చూపలేకపోయారని చెప్పారు. సరిపడా ఆధారాలు చూపిస్తే.. ఎన్నికల తర్వాత ఆ మొత్తాన్ని వారికి అప్పగిస్తామని చెప్పారు. మూడురోజులుగా బ్యాంకు సెలవు కావడంతో రాయగడలో గల బ్రాందీ విక్రయ కేంద్రానికి నేరుగా నగదు తీసుకెళ్లాల్సి వచ్చిందని బాధితులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. స్వాధీనం చేసుకున్న నగదును స్థానిక తహశీల్దార్ ఎల్లారావుకు అప్పగించినట్లు సీఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాచిపెంట ఎస్సై రవికుమార్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
‘స్త్రీనిధి’ రికవరీలో జిల్లా ప్రథమస్థానం
నాగిరెడ్డిపేట, న్యూస్‌లైన్ : స్త్రీనిధి ద్వారా ఈ ఏడాది లక్ష్యానికి మించి రుణాలు అందించామని, అలాగే లబ్ధిదారుల నుంచి రికవరీ చేయడంలో జిల్లా ప్రథమస్థానంలో ఉందని స్త్రీనిధి అసిస్టెంట్ జనరల్ మేనేజర్ రవికుమార్ పేర్కొన్నారు. మండలంలోని లింగంపల్లికలాన్‌లో రుణాలను పొందిన లబ్ధిదారులతో శనివారం ఆయన సమావేశం నిర్వహించారు. స్త్రీనిధి ద్వారా రుణాలు పొందడం వల్ల కలిగిన ప్రయోజనాలను లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించడం వల్ల తిరిగి ఎక్కువ డబ్బులను రుణంగా పొందవచ్చని ఆయన సూచించారు. అనంతరం మండలకేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో ఈ ఏడాది స్త్రీనిధి ద్వారా 122కోట్లు రుణాలుగా ఇవ్వాలని లక్ష్యంగా ఉందన్నారు. ఇప్పటివరకు 127కోట్లను రుణాలుగా ఇచ్చామని, మార్చి ఆఖరు వరకు మరో 20కోట్లు రుణాలుగా ఇవ్వనున్నట్లు ఆయన చెప్పారు. దీంతో ఈ ఏడాది లక్ష్యానికిమించి స్త్రీనిధి ద్వారా మహిళలకు రుణాలు అందించామన్నారు. జిల్లాలో రుణాల రికవరీ ఇప్పటి వరకు 99.5శాతం జరిగిందని ఆయన వివరించారు. జిల్లాలోని స్త్రీనిధి పథకం ద్వారా అత్యధికంగా కోటగిరి మండలంలో 5కోట్ల75లక్షలు రుణాలుగా ఇచ్చామని, తర్వాత బోధన్ మండలంలో 5కోట్ల68లక్షలు ఇచ్చామని ఆయన చెప్పారు. రైతులకు రుణాలు ఎల్లారెడ్డి, బాన్సువాడ బీఎంసీల పరిధిలో రైతులకు స్త్రీనిధి ద్వారా రుణాలు అందించడానికి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చామని, ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే రైతులకు రుణాలను ఇస్తామని ఏజీఎం పేర్కొన్నారు. స్త్రీనిధి రుణాల వినియోగంపై ప్రస్తుతం మొదటివిడతగా జిల్లాలో లింగంపేట మండలంలోని పర్మళ్ల, కోర్పొల్, పోతాయిపల్లితోపాటు డిచ్పల్లి మండలంలోని ఇందల్వాయి గ్రామాల్లో సామాజిక తనిఖీ నిర్వహిస్తున్నామన్నారు. రెండోవిడతలో నాగిరెడ్డిపేట మండలంలోని లింగంపల్లికలాన్, నిజాంసాగర్ మండలం సింగితం గ్రామాల్లో సామాజిక తనిఖీ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఆయనవెంట ఏపీఎం మహేష్‌కుమార్, సిబ్బంది రాజు తదితరులు ఉన్నారు. -
అమ్మకానికి ‘ఆధార్’ !
కొత్తగూడెం, న్యూస్‌లైన్: కొత్తగూడెం మండలం లక్ష్మీదేవిపల్లికి చెందిన ఓ నలుగురు కుటుంబ సభ్యులు ఆధార్ కార్డు దిగేందుకు మున్సిపాలిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్‌కు వెళ్లారు. వీరి కుటుంబంలో తల్లిదండ్రుల పేర్లు మాత్రమే రేషన్‌కార్డులో నమోదై ఉన్నాయి. ఇద్దరు పిల్లలకు గుర్తింపు కార్డులు లేవు. ముందుగా ఒక్కొక్కరికి రూ.వంద చొప్పున వసూలు చేసిన ఎన్రోల్మెంట్ నిర్వాహకులు ఇద్దరికి గుర్తింపు కార్డులు లేకపోవడం, రేషన్‌కార్డులో వారి పేర్లు లేకపోవడంతో మరో రూ.వంద అదనంగా వసూలు చేశారు. ఇలా వారు రూ.600 సమర్పించుకుని ఆధార్ దిగాల్సి వచ్చింది. ఇలా ఎన్రోల్మెంట్ నిర్వాహకులు ఒక్కో సెంటర్ నుంచి రోజుకు రూ.3 వేల నుంచి 5 వేల వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నాలుగు నెలల క్రితం వరకు ఆధార్ కేంద్రాల వద్దకు ప్రజలు భారీగా తరలిరావడంతో ఒక ఎన్రోల్మెంట్కు రూ.1000 వరకు వసూలు చేసిన నిర్వాహకులు ఇప్పుడు ఎన్రోల్మెంట్ కోసం వచ్చేవారి సంఖ్య తగ్గడంతో నిర్ణీత ధర నిర్ణయించారు. రెండు నెలల క్రితం జిల్లాలో పర్మనెంట్ ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేస్తూ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో బాగంగా జిల్లాలోని మీ సేవా సెంటర్లలో ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడికి ఎన్రోల్మెంట్ చేసుకునేందుకు వెళ్లేవారు సొమ్ములు చెల్లించకపోతే ఆధార్ కార్డు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. పైసలిస్తేనే పని... నిర్వాహకులు అడిగినట్లు రూ.100 చెల్లిస్తే వాటిని ఆన్లైన్ ఎన్రోల్మెంట్ చేస్తున్నారు. అయితే ‘ప్రభుత్వం మీకు డబ్బులు చెల్లిస్తుంది కదా..? మేమెందుకు ఇవ్వాలి’ అని ఎవరైనా దబాయిస్తే వారికి కార్డు మాత్రం రానట్లే. కేవలం కంప్యూటర్లో ఫొటోలు తీసి ఆధార్ దిగినట్లుగా కాపీని అందిస్తున్న నిర్వాహకులు ఆ తర్వాత వాటిని ఆన్లైన్లో ఎన్రోల్మెంట్ చేయకపోవడంతో జిల్లాలో సుమారు లక్ష మంది వరకు ఆధార్ కార్డులు దిగి.. నెలల తరబడి ఎదురుచూస్తున్నా కార్డులు అందడం లేదు. నిర్వాహకులు అడిగిన సొమ్ములు చెల్లించుకున్న వారికి మాత్రం నెల రోజుల లోపు కార్డులు వస్తున్నాయి. చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్న రెవెన్యూ అధికారులు.. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆధార్ కార్డు అందేలా చూడాల్సిన రెవెన్యూ అధికారులు ఈ వసూళ్ల పర్వంపై చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆధార్ సెంటర్ల వద్ద వసూళ్ల పర్వం బహిరంగంగానే జరుగుతునప్పటికీ వాటిని అరికట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని పలువురు అంటున్నారు. ఈ విషయంపై ఆధార్ ఎన్రోల్మెంట్ నిర్వహిస్తున్న ప్రైవేట్ సంస్థ సూపర్వైజర్ రవికుమార్‌ను ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా ఆధార్ కేంద్రాల వద్ద వసూళ్లు నిజమేనని, కానీ ఎలాంటి గుర్తింపు కార్డులు లేకుండా ఆధార్ ఎన్రోల్మెంట్ చేయడం లేదని పేర్కొనడం గమనార్హం. ఏది ఏమైనా ఆధార్ కేంద్రాల వద్ద సాగుతున్న ఈ అక్రమ వసూళ్ల పర్వంపై ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు దృష్టి సారించి, అక్రమ వసూళ్లను నిలిపివేయాలని ప్రజలు కోరుతున్నారు. -
సత్ఫలితాలిస్తున్న కోర్టు మానిటరింగ్
నిజామాబాద్ లీగల్, న్యూస్‌లైన్ : జిల్లాలో కోర్టు మానిటరింగ్ సిస్టం ప్రారంభమైనప్పటి నుంచి కేసులు త్వరితగతిన పరిష్కారమవుతున్నాయి. కోర్టుల్లో పేరుకుపోయిన కేసులను పరిష్కరించేందుకు ప్రభుత్వం విజయవాడలో అమలు చేస్తున్న కోర్టు మానిటరింగ్ సిస్టంను నిజామాబాద్ జిల్లాలో మార్చి 1, 2013న ప్రారంభించింది. ఈ సిస్టం వల్ల కక్షిదారులకు, న్యాయవాదులకు సమయం వృథా కావడం లేదు. అప్పటి జిల్లా ప్రధాన న్యాయమూర్తి రవికుమార్, జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పరిపూర్ణ మహేందర్‌రెడ్డి ఎస్పీ విక్రమ్‌జిత్‌దుగ్గల్ కోర్టు మానిటరింగ్ సిస్టం అమలు కోసం సమీక్ష, సమావేశాలు నిర్వహించి కోర్టు మానిటరింగ్ సిస్టం ప్రారంభించేందుకు చర్యలు తీసుకున్నారు. ఈక్రమంలో జిల్లాలో 25 కోర్టులు ఉండగా 23 కోర్టుల్లో కోర్టు మానిటరింగ్ సిస్టాన్ని ప్రారంభించారు. దీనికింద జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి సెషన్ కోర్టు జడ్జి కోర్టుల్లో ఒక ఏఎస్సై, ఒక కానిస్టేబుల్‌ను, ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేశారు. వీరు కోర్టులో ఉన్న కేసులకు సంబంధించిన సాక్షులను, కోర్టువారు జారీ చేసిన సమన్లతో సాక్షులను సకాలంలో హాజరుపరుస్తారు. గడిచిన 9 నెలలల్లో జిల్లాలో ఉన్న కోర్టుల్లో సుమారు 350 కేసులు పరిష్కారమైనట్లు అధికారులు తెలిపారు. ఈ పద్ధతిపై జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి 11 కేసులను పరిష్కరించారని జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎస్.పరిపూర్ణ మహేందర్‌రెడ్డి తెలిపారు. 9 హత్య కేసుల్లో 13 మందికి జీవిత ఖైదీ విధించారన్నారు. -
500 టన్నులకు పైగా...
సాక్షి, తిరుపతి: ఈ ఏడాది ఇప్పటి వరకు 500 టన్నులకు పైగా ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ రవికుమార్ కథనం మేరకు నెలకు సరాసరి 70 నుంచి వంద టన్నుల ఎర్ర చందనం పట్టుబడుతోంది. ప్రతిరోజు 80 మంది టాస్క్ ఫోర్సు సిబ్బంది కూంబింగ్ ఆపరేషన్‌లో పాల్గొంటున్నారు. శేషాచలం అడవుల్లో దాదాపు 40 బేస్‌క్యాంపులను ఏర్పాటు చేశారు. వీటిలో 200 మందికి పైగా సిబ్బంది ఉంటారు. వీరిలో పోలీసులు, అటవీశాఖా సిబ్బంది కలిపిన టాస్క్ ఫోర్సు సభ్యులు సైతం ఉంటారు. కూంబింగ్‌లో 80 మంది పాల్గొంటారు. 80 మంది సిబ్బందితో కూంబింగ్ అంటే ఒక్కో గ్రూప్‌లో పది మంది కూడా ఉండరు. వీరందరూ ఒక్కసారిగా కూంబింగ్ చేయరు. వీరి వద్ద కూడా సరైన ఆయుధాలు ఉండవు. పట్టుబడిన ఎర్రచందనం స్మగ్లర్లకు కఠిన శిక్షలు వేసే విధంగా చట్టాలను సవరించాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రతిపాదన చేశారు. అయితే ఆ ప్రతిపాదన ఆచరణలోకి రాలేదు. ఎర్రచందనం కూలీలకు రోజుకు రెండు వేల రూపాయల కూలి లభిస్తోంది. ఒక సారి వచ్చారంటే రె ండుమూడు రోజులుంటారు. దీంతో వీరికి నాలుగైదు వేల రూపాయల ఆదాయం లభిస్తోంది. ప్రధానంగా వేలూరు, కృష్ణగిరి, ధర్మపురి ప్రాంతాలకు చెందిన కూలీలు వేలూరు నుంచి వచ్చే ప్యాసింజర్ రైలు ద్వారా శేషాచలం అడవులు చేరుకుంటున్నారు. చంద్రగిరి వద్ద ఎక్కువ మంది కూలీలు రైలు నుంచి దిగి, భీమునివాగు మీదుగా అడవిలోకి చేరుకునేవారు. ఇటువైపు నిఘా పెరగడంతో, ప్రస్తుతం బస్సుల్లో వచ్చి, భాకరాపేట అడువుల మీదుగా చేరుకుంటున్నారు. మరికొంత మంది తిరుమలకు భక్తుల రూపంలో వచ్చి, పాపవినాశనం మీదు గా అడువుల్లోకి వెళుతున్నారు. శేషాచలం అడవులు చిత్తూరు, కడప జిల్లాలో విస్తరించి ఉండటంతో ఏ మార్గంలో ప్రవేశిస్తారో తెలుసుకోవడం కష్టం. వందల కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న శేషాచలం అడవుల్లో 80 మందితో కూంబింగ్ చేయించడం వల్ల ఒరిగేది ఏమీ లేదని తెలిసింది. వేలం వేయలేక పోతున్న అధికారులు ఐదారు సంవత్సరాల్లో పట్టుబడిన ఎర్రచందనం దుంగలు దాదాపు ఐదు వేల టన్నులు ఉన్నాయి. ఈ దుంగలను వే లం వేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఆలసత్వం చూపుతోంది. ఇంతవరకు తగిన అనుమతులు ఇవ్వలేదు. ఐదువేల టన్నులను రెండంచెలుగా వేలం వే యాల్సి ఉంది. పట్టుబడిన ఎర్రచంద నం వేలం వేస్తే, స్మగ్లర్ల రాకపోకలు తగ్గిపోతాయని అధికారులు భావిస్తున్నా రు. దీనికి కారణం అంతర్జాతీయ మార్కెట్టులో ఏడాదికి రెండు వేల టన్నుల ఎర్రచందనం అవసరం ఉంది. దీంతో ఐదు వేల టన్నులను వేలం వేస్తే, చెట్లను నరకాల్సిన అవసరం ఉండదని, దీంతో స్మగ్లింగ్ తగ్గిపోతుందని భావిస్తున్నారు. -
ఇన్పుట్ సబ్సిడీ పంపిణీకి చర్యలు
చిత్తూరు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: ఖరీఫ్- 2012లో పంట నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందించేందుకు చర్యలు చేపడుతున్నామని జిల్లా వ్యవసాయశాఖ జాయింట్ డెరైక్టర్ రవికుమార్ తెలిపారు. సాక్షి దినపత్రికలో ఆదివారం ప్రచురితమైన ‘పరిహారం-పరిహాసం’అనే కథనంపై జేడీ స్పందించారు. ఆయన ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ ఖరీఫ్ 2012లో వేరుశెనగ సాగుచేసిన రైతుల్లో 1.20 లక్షల మంది పంట నష్టపోయారన్నారు. వీరికి రూ.80 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ అవసరమవుతుందని ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపినట్లు చెప్పారు. ప్రభుత్వం 1.12 లక్షల మంది రైతులకు *76.09 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని విడుదల చేసిందని వివరించారు. ఇందులో ఇప్పటికే *71 కోట్లు రైతులకు అందజేశామని తెలిపారు. మిగిలిన మొత్తాన్ని రైతులకు వ్యక్తిగత ఖాతాలున్న 30 బ్యాంకుల్లో జమ చేశామన్నారు. ఈ క్రమంలో 7,690 మంది రైతులకు ఇన్పుట్ సబ్సిడీ త్వరలో అందుతుందని పేర్కొన్నారు. ఇన్పుట్ సబ్సిడీ కింద మరో రూ.4 కోట్లు పంపాల ని వ్యవసాయశాఖ కమిషనర్‌కు ప్రతిపాదనలు పం పినట్లు తెలిపారు. ఈ మొత్తం వస్తే జిల్లాలో మరో 8 వేల మంది రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందించేందుకు వ్యవసాయశాఖ సిద్ధంగా ఉందన్నారు. ఇప్పటికే బ్యాంకు ల్లో జమ చేసిన ఇన్పుట్ సబ్సిడీ మొత్తాలను వెంటనే రైతులకు అందించాలని బ్యాంకర్లను కోరుతామని తెలియజేశారు. -
కడుపు తరుక్కుపోయేలా
కురుపాం, న్యూస్‌లైన్: గర్భం మరో బ్రహ్మలోకమని, ప్రసవం స్త్రీకి పునర్జన్మ అని అంటారు. కానీ జిల్లాలోని అధికారులకు ఈ వాక్యాలు అంతగా పరిచయం ఉన్నట్లు లేవు. మాతాశిశు రక్షణ కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశపెడుతున్నా అవి మారుమూల పల్లె వరకు చేరడం గగనమైపోతోంది. అందులోనూ కొండకోనల్లో పలు మూఢనమ్మకాలు గూడుకట్టుకున్న గిరిజనులకు అవగాహన కల్పించేవారు కనిపించడంలేదు. దీనికి మరో ఉదాహరణే ఈ సంఘటన. కొమరాడ మండలం పాలెం పంచాయతీ మర్రిగూడ గ్రామానికి చెందిన గర్భిణి పాలక ప్రమీల(21)కు పురిటి నొప్పులు తీవ్రం కావడంతో మంగళవారం అర్ధరాత్రి 108 వాహనంలో కురుపాం పీహెచ్‌సీకి ఆమె తల్లి పాలక యశోద, అత్త నారాయణమ్మలు తీసుకొని వచ్చారు. అయితే అప్పటికే విధి నిర్వహణలో ఉన్న వైద్యాధికారి రవికుమార్ వైద్యసేవలు అందించారు. గర్భంలో ఉమ్మనీరు పోవడంతో ప్రసవం కష్టం అవుతుందని పార్వతీపురం వెళ్లాల్సి ఉంటుందని ఆయన సూచించారు. కానీ ఆ గర్భిణిలో గూడు కట్టుకుపోయిన భయాలు ఆమెను ఆస్పత్రికి వెళ్లనీయలేదు. ఆపరేషన్ అంటే భయం, ఆస్పత్రిలో ఉంటే చనిపోతానేమోనన్న భీతి మరోపక్క ఆర్థిక స్థోమత లేకపోవడంతో ఆమె పార్వతీపురం వెళ్లేందుకు నిరాకరించి తిరిగి ఇంటికి వెళ్లి పోదామని పట్టుబట్టింది. వైద్యాధికారులు, తల్లి, అత్తలు ఎంత చెప్పినా, నొప్పులు పడుతూనే ఎవ్వరికి చెప్పకుండా తెల్లవారు జామున ఆస్పత్రి నుంచి పారిపోయి శివ్వన్నపేట జంక్షన్‌కు చేరుకుంది. అయితే అప్పటికే నొప్పులు ఎక్కువ కావడంతో శివ్వన్నపేట మూలబుడ్డి జంక్షన్లో రోడ్డుపైనే ప్రసమవుతుండగా స్థానిక మహిళలంతా చేరి చీరలు, దుప్పట్లను చుట్టూ పెట్టి ప్రసవానికి సహాయపడ్డారు. దీంతో బుధవారం ఉదయం 6.15 నిమిషాలకు నడిరోడ్డుపై గిరిజన గర్భిణి మగ పిల్లాడికి జన్మనిచ్చింది. వెంటనే స్థానికులు ఆస్పత్రికి వెళ్లి స్టాఫ్‌నర్స్‌ను వెంట తీసుకు వచ్చి దగ్గర ఉండి పసిబిడ్డ బొడ్డు కోయించి సపర్యలు చేయించి తిరిగి ఆస్పత్రికి తీసుకు వెళ్లారు. అవగాహన రాహిత్యమే కారణమా..? ప్రభుత్వ పథకాలను అమలు చేయాల్సిన అధికారులు వాటిని ప్రచారం చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఫలితంగా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ముందుగానే అధికారులు గ్రామాల్లోకి వెళ్లి పథకాలపై విస్తృత ప్రచారం నిర్వహిస్తే గిరిజన తల్లులకు ఈ వేదన ఉండదు. ఇప్పటికైనా ఈ అమ్మ రోదనలు ఎవరైనా పట్టించుకుంటారా..? ఆ తల్లి నడిరోడ్డుపై కార్చిన కన్నీటి బొట్లకు అర్థం చెబుతారా అన్నది వేచి చూడాలి. -
మాట తప్పని జగన్ వెంటే నడుస్తా
అద్దంకి, న్యూస్‌లైన్ : మాట తప్పని.. మడమ తిప్పని వైఎస్ జగన్మోహన్రెడ్డి బాటలోనే నడుస్తానని, సమైక్యాంధ్ర కోసం దీక్షను ఎన్ని రోజులైనా కొనసాగిస్తాన ని అద్దంకి నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ సమన్వయకర్త గొట్టిపాటి రవికుమార్ అన్నారు.సమైక్యాంధ్రకు మద్దతుగా ఆయన చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష శుక్రవారానికి మూడో రోజుకు రేరింది. స్థానిక వైద్యులు వచ్చి గొట్టిపాటికి వైద్య పరీక్షలు నిర్వహించి షుగర్ లెవల్స్ తగ్గాయని చెప్పారు. గొట్టిపాటి మాట్లాడుతూ పార్టీ అభిమానుల నుంచి వస్తున్న ఆదరణను చూస్తే ఎన్ని రోజులైనా నిరాహార దీక్ష కొనసాగించగలననే నమ్మకం కలుగుతోందన్నారు. రాష్ట్రం ముక్కలవుతుంటే సీమాంధ్ర ప్రజాప్రతినిధులు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రజలను మోసం చేసేందుకు టీడీపీ సహకరించిందని దుయ్యబట్టారు. ఏ మొహం పెట్టుకుని చంద్రబాబు అత్మగౌరవ యాత్ర చేస్తారని ప్రశ్నించారు. నేటికీ చంద్రబాబు సమైక్యవాదో, విభజనవాదో తేల్చుకోలేకపోతున్నారన్నారు. ప్రతిపక్ష నాయకునిగా చంద్రబాబు చేయలేని పనిని జగన్ చేస్తున్నారని గుర్తుచేశారు. జగన్ నాయకత్వంలో రాష్ట్రం సమైక్యంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ సీపీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమైక్యాంధ్ర కోసం 72 గంటల బంద్‌ను అద్దంకి నియోజకవర్గంలో విజయవంతం చేస్తామని గొట్టిపాటి చెప్పారు.