స్నాచింగ్‌కు పాల్పడిన బీటెక్ స్టూడెంట్ అరెస్ట్ | B Tech student arrested for chain snatching | Sakshi
Sakshi News home page

స్నాచింగ్‌కు పాల్పడిన బీటెక్ స్టూడెంట్ అరెస్ట్

Published Mon, Sep 19 2016 1:20 PM | Last Updated on Tue, Sep 4 2018 5:24 PM

B Tech student arrested for chain snatching

జల్సాలకు అలవాటపడి చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు రోజుల క్రితం నగరంలోని ఎల్బీనగర్ రాక్‌టౌన్ కాలనీలో నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో నుంచి గుర్తుతెలియని దుండగుడు గొలుసు లాక్కెళ్లాడు. ఈ సంఘటన పై బాధితురాలు పోలీసులను ఆశ్రయించండంతో.. పోలీసులు సమీపంలోని సీసీ టీవీ ఫూటేజిల ఆధారంగా చైన్ స్నాచింగ్‌కు పాల్పడిన రవికుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి రెండు తులాల మంగళ సూత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు. రవికుమార్ నగరంలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement