ఇంజనీరింగ్ విద్యార్థి అదృశ్యమైన సంఘటన సైదాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది.
ఇంజనీరింగ్ విద్యార్థి అదృశ్యమైన సంఘటన సైదాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సైదాబాద్ డివిజన్ జయానగర్ కాలనీకి చెందిన బి. ప్రదీప్(20) ఇబ్రహీంపట్నంలోని శ్రీ దత్తా ఇంజనీరింగ్ కళాశాలలో చదువుకుంటున్నాడు. కళాశాలలో నిర్వహించిన పరీక్షలో ప్రదీప్ మూడు సబ్జెక్టులలో ఫెయిల్ అయ్యాడు. గత నెల 29న కళాశాలకు వెళ్తున్నానని చెప్పి బయల్దేరిన ప్రదీప్ తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నారు.