డబీర్‌పురా(హైదరాబాద్): మెహందీ పెట్టుకోవడానికి స్నేహితురాలి వద్దకు వెళ్లిన ఓ యువతి కనిపించకుండా పోయింది. డబీర్‌పురా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీబీకా అలావా ప్రాంతానికి చెందిన సఫియా బేగం కూతురు సమీనా(19) ఈ నెల 19వ తేదీన రాత్రి 9.30 గంటలకు మెహందీ పెట్టుకోవడానికి స్థానికంగా ఉండే స్నేహితురాలి ఇంటికి వెళ్లింది. అనంతరం తిరిగి ఇంటికి చేరుకోలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోలన చెందారు.
స్నేహితురాలి ఇంటి వద్ద, బంధువులు, స్నేహితుల వద్ద వాకబు చేయగా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో సఫియా బేగం తన కూతురు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆచూకీ తెలిసిన వారు 040- 27854791 డబీర్‌పురా పోలీస్‌స్టేషన్‌లో సమాచారం అందించాలని పోలీసులు కోరారు.
మెహందీ కోసం వెళ్లి యువతి అదృశ్యం..
Published Thu, Jul 20 2017 7:53 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement