డ్యూటీకి వెళుతున్నానని చెప్పి వెళ్లిన ప్రైవేట్ ఉద్యోగి కనిపించకుండా పోయిన సంఘటన సోమవారం మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
డ్యూటీకి వెళుతున్నానని చెప్పి వెళ్లిన ప్రైవేట్ ఉద్యోగి కనిపించకుండా పోయిన సంఘటన సోమవారం మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ వెంకటయ్య తెలిపిన వివరాల ప్రకారం..బోడుప్పల్ బాలాజీ హిల్స్ కాలనీలో నివసించే వసంతపురం కిరణ్ (27), లక్ష్మి భార్య భర్తలు. వారికి ఒక బాబు ఉన్నాడు. ఈనెల 2వతేదీన ఆఫీసుకు వెళుతున్నానని ఇంట్లో చెప్పి వెళ్లాడు. తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు సోమవారం మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.