హెయిర్‌ స్టైలిస్ట్‌పై అత్యాచారయత్నం | 2 held for trying to rape woman in Hyderabad out skirts | Sakshi
Sakshi News home page

హెయిర్‌ స్టైలిస్ట్‌పై అత్యాచారయత్నం

Published Fri, Mar 3 2017 8:00 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

హెయిర్‌ స్టైలిస్ట్‌పై అత్యాచారయత్నం - Sakshi

హెయిర్‌ స్టైలిస్ట్‌పై అత్యాచారయత్నం

హైదరాబాద్‌: నగర శివారులో దారుణం వెలుగుచూసింది. లిఫ్ట్‌ ఇస్తామని నమ్మించి ఓ మహిళా హెయిర్‌ స్టైలిస్ట్‌ను క్యాబ్‌ ఎక్కించుకున్న యువకులు కొద్ది దూరం వెళ్లాక ఆమెపై అత్యాచారయత్నం చేశారు. కారు టోల్‌గేట్‌ వద్దకు చేరుకోగానే యువతి అందులో నుంచి దూకి రక్షించమని కేకలు వేసింది. ఇది గుర్తించిన టోల్‌గేట్‌ సిబ్బంది యువతిని రక్షించి నిందితులను పోలీసులకు అప్పగించారు.

వివరాలు.. గచ్చిబౌలిలో హెయిర్‌ స్టైలిస్ట్‌గా పని చేస్తున్న గుంటూరుకు చెందిన యువతి నగరం నుంచి విజయవాడ వెళ్లడానికి గురువారం తెల్లవారుజామున ఎల్బీనగర్‌ బస్టాండ్‌లో వేచి ఉంది. ఆ సమయంలో విజయవాడ వెళ్తున్న ఓ క్యాబ్‌ డ్రైవర్‌ తన కార్లో ఓ సీటు ఖాళీగా ఉందని చెప్పి యువతిని ఎక్కించుకున్నాడు. అప్పటికే కారులో డ్రైవర్‌తో పాటు మరో యువకుడు ఓ మహిళ ఉన్నారు. కారు కొద్ది దూరం వెళ్లగానే డ్రైవర్‌, మరో యువకుడు కలిసి ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు.

దీంతో భయబ్రాంతులకు గురైన యువతి తనను తాను రక్షించుకోవడానికి కేకలు వేసిన లాభం లేకపోయింది. కారు చౌటుప్పల్‌ సమీపంలోని పంతంగి టోల్‌గేట్‌ వద్దకు చేరుకోగానే కారులో నుంచి కిందకు దూకి కేకలు వేసింది. దీంతో టోల్‌గేట్‌ సిబ్బంది ఆమెను రక్షించి నిందితులను చౌటుప్పల్‌ పోలీసులకు అప్పగించారు. నిందితులపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement