సాక్షి, తిరుపతి: ఈ ఏడాది ఇప్పటి వరకు 500 టన్నులకు పైగా ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ రవికుమార్ కథనం మేరకు నెలకు సరాసరి 70 నుంచి వంద టన్నుల ఎర్ర చందనం పట్టుబడుతోంది. ప్రతిరోజు 80 మంది టాస్క్ ఫోర్సు సిబ్బంది కూంబింగ్ ఆపరేషన్‌లో పాల్గొంటున్నారు. శేషాచలం అడవుల్లో దాదాపు 40 బేస్‌క్యాంపులను ఏర్పాటు చేశారు. వీటిలో 200 మందికి పైగా సిబ్బంది ఉంటారు. వీరిలో పోలీసులు, అటవీశాఖా సిబ్బంది కలిపిన టాస్క్ ఫోర్సు సభ్యులు సైతం ఉంటారు. కూంబింగ్‌లో 80 మంది పాల్గొంటారు. 80 మంది సిబ్బందితో కూంబింగ్ అంటే ఒక్కో గ్రూప్‌లో పది మంది కూడా ఉండరు. వీరందరూ ఒక్కసారిగా కూంబింగ్ చేయరు. వీరి వద్ద కూడా సరైన ఆయుధాలు ఉండవు.
పట్టుబడిన ఎర్రచందనం స్మగ్లర్లకు కఠిన శిక్షలు వేసే విధంగా చట్టాలను సవరించాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రతిపాదన చేశారు. అయితే ఆ ప్రతిపాదన ఆచరణలోకి రాలేదు. ఎర్రచందనం కూలీలకు రోజుకు రెండు వేల రూపాయల కూలి లభిస్తోంది. ఒక సారి వచ్చారంటే రె ండుమూడు రోజులుంటారు. దీంతో వీరికి నాలుగైదు వేల రూపాయల ఆదాయం లభిస్తోంది.
ప్రధానంగా వేలూరు, కృష్ణగిరి, ధర్మపురి ప్రాంతాలకు చెందిన కూలీలు వేలూరు నుంచి వచ్చే ప్యాసింజర్ రైలు ద్వారా శేషాచలం అడవులు చేరుకుంటున్నారు. చంద్రగిరి వద్ద ఎక్కువ మంది కూలీలు రైలు నుంచి దిగి, భీమునివాగు మీదుగా అడవిలోకి చేరుకునేవారు. ఇటువైపు నిఘా పెరగడంతో, ప్రస్తుతం బస్సుల్లో వచ్చి, భాకరాపేట అడువుల మీదుగా చేరుకుంటున్నారు. మరికొంత మంది తిరుమలకు భక్తుల రూపంలో వచ్చి, పాపవినాశనం మీదు గా అడువుల్లోకి వెళుతున్నారు. శేషాచలం అడవులు చిత్తూరు, కడప జిల్లాలో విస్తరించి ఉండటంతో ఏ మార్గంలో ప్రవేశిస్తారో తెలుసుకోవడం కష్టం. వందల కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న శేషాచలం అడవుల్లో 80 మందితో కూంబింగ్ చేయించడం వల్ల ఒరిగేది ఏమీ లేదని తెలిసింది.
వేలం వేయలేక పోతున్న అధికారులు
ఐదారు సంవత్సరాల్లో పట్టుబడిన ఎర్రచందనం దుంగలు దాదాపు ఐదు వేల టన్నులు ఉన్నాయి. ఈ దుంగలను వే లం వేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఆలసత్వం చూపుతోంది. ఇంతవరకు తగిన అనుమతులు ఇవ్వలేదు. ఐదువేల టన్నులను రెండంచెలుగా వేలం వే యాల్సి ఉంది. పట్టుబడిన ఎర్రచంద నం వేలం వేస్తే, స్మగ్లర్ల రాకపోకలు తగ్గిపోతాయని అధికారులు భావిస్తున్నా రు. దీనికి కారణం అంతర్జాతీయ మార్కెట్టులో ఏడాదికి రెండు వేల టన్నుల ఎర్రచందనం అవసరం ఉంది. దీంతో ఐదు వేల టన్నులను వేలం వేస్తే, చెట్లను నరకాల్సిన అవసరం ఉండదని, దీంతో స్మగ్లింగ్ తగ్గిపోతుందని భావిస్తున్నారు.
500 టన్నులకు పైగా...
Published Mon, Dec 16 2013 3:00 AM | Last Updated on Mon, Jul 29 2019 5:28 PM
Advertisement
Advertisement