కదిరి అర్బన్ : మండల పరిధిలోని అలీపూర్‌తండా వద్ద శనివారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీ కొని గాండ్లపెంట మండలం కటారుపల్లికి చెందిన రవికుమార్(27) అనే యువకుడు దుర్మరణం చెందాడు. మృతుడి బంధువులు తెలిపిన మేరకు వివరాలిలాఉన్నాయి. కటారుపల్లికి చెందిన ఆర్‌ఎంపీ వైద్యుడు వేమయ్య, పద్మావతిల ఏకైక కుమారుడు రవికుమార్. రెండేళ్లక్రితం కటారుపల్లిక్రాస్‌కుచెందిన హేమవతితో వివాహం జరిగింది. రవికుమార్ బెంగళూరులో డ్రైవర్‌పని, భార్య నర్సు ఉద్యోగం చేసుకుంటూ జీవించేవారు.
హేమవతి శనివారం ఉదయం కదిరిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. భార్య, కూతురును చూసేందుకు ద్విచక్రవాహనంలో బెంగూళూరు నుంచి రవికుమార్ వస్తున్నాడు. వాహనం అలీపూర్‌తండావద్దకు రాగానే వెనుక వస్తున్న గుర్తుతెలియని వాహనం ఢీ కొంది. దీంతో రవికుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. కుమారుడి మరణవార్త విన్న తండ్రి ఆస్పత్రిలోనే సృహ కోల్పోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
తాడిపత్రిలో బాలుడు..
తాడిపత్రి: తాడిపత్రిలోని కంచాని లాడ్జి వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పట్టణంలోని ఏటిగడ్డపాలెంకు చెందిన బాషు కుమారుడు మహమ్మద్‌గౌస్(16) మరణించినట్లు ఎస్‌ఐ ఆంజనేయులు తెలిపారు. సీబీ రోడ్డులో బైక్‌పై వెళ్తూ కాలినడకన వెళ్తున్న శివారెడ్డి అనే వ్యక్తిని ఢీకొని కిందపడినట్లు చెప్పారు. అదే సమయంలో వచ్చిన ట్రాక్టర్ అతని కాళ్లపై వెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డాడు.వెంటనే అనంతపురం ఆస్పత్రికి తరలించగా అక్కడ మృతి చెందినట్లు వివరించారు. కేసు దర్యాప్తులో ఉంది.
పుట్టిన బిడ్డను చూసేందుకు వెళ్తూ..
Published Sat, Sep 17 2016 11:53 PM | Last Updated on Mon, Sep 4 2017 1:53 PM
Advertisement
Advertisement