బెంగళూరు: దేశీ రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ‘ఇన్ఫోసిస్’ తాజాగా అమెరికాలోని కనెక్టికట్‌లోని హర్ట్‌ఫోర్డ్‌లో టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ హబ్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. దీని కోసం 2022 నాటికి 1,000 మంది అమెరికన్లను నియమించుకుంటామని పేర్కొంది.
కనెక్టికట్ టెక్నాలజీ–ఇన్నోవేషన్ హబ్ ద్వారా ఇన్సూరెన్స్, హెల్త్‌కేర్, మ్యానుఫాక్చరింగ్ రంగాలపై దృష్టి కేంద్రీకరిస్తామని తెలిపింది. ‘కనెక్టికట్‌లో కార్యకలాపాలు విస్తరించడం సంతోషంగా ఉంది. 1,000 మందికి ఉపాధి కల్పిస్తాం’ అని ఇన్ఫోసిస్ ప్రెసిడెంట్ రవికుమార్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment