చిత్తూరు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: ఖరీఫ్- 2012లో పంట నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ అందించేందుకు చర్యలు చేపడుతున్నామని జిల్లా వ్యవసాయశాఖ జాయింట్ డెరైక్టర్ రవికుమార్ తెలిపారు. సాక్షి దినపత్రికలో ఆదివారం ప్రచురితమైన ‘పరిహారం-పరిహాసం’అనే కథనంపై జేడీ స్పందించారు. ఆయన ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ ఖరీఫ్ 2012లో వేరుశెనగ సాగుచేసిన రైతుల్లో 1.20 లక్షల మంది పంట నష్టపోయారన్నారు. వీరికి రూ.80 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ అవసరమవుతుందని ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపినట్లు చెప్పారు. ప్రభుత్వం 1.12 లక్షల మంది రైతులకు *76.09 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీని విడుదల చేసిందని వివరించారు. ఇందులో ఇప్పటికే *71 కోట్లు రైతులకు అందజేశామని తెలిపారు.
మిగిలిన మొత్తాన్ని రైతులకు వ్యక్తిగత ఖాతాలున్న 30 బ్యాంకుల్లో జమ చేశామన్నారు. ఈ క్రమంలో 7,690 మంది రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ త్వరలో అందుతుందని పేర్కొన్నారు. ఇన్‌పుట్ సబ్సిడీ కింద మరో రూ.4 కోట్లు పంపాల ని వ్యవసాయశాఖ కమిషనర్‌కు ప్రతిపాదనలు పం పినట్లు తెలిపారు. ఈ మొత్తం వస్తే జిల్లాలో మరో 8 వేల మంది రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ అందించేందుకు వ్యవసాయశాఖ సిద్ధంగా ఉందన్నారు. ఇప్పటికే బ్యాంకు ల్లో జమ చేసిన ఇన్‌పుట్ సబ్సిడీ మొత్తాలను వెంటనే రైతులకు అందించాలని బ్యాంకర్లను కోరుతామని తెలియజేశారు.
ఇన్‌పుట్ సబ్సిడీ పంపిణీకి చర్యలు
Published Mon, Dec 16 2013 2:45 AM | Last Updated on Mon, Aug 13 2018 3:11 PM
Advertisement