input subsidy distribution
-
రైతుల కోసం మరో అడుగు ముందుకు వేస్తున్నాం: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: ప్రకృతి విపత్తులతో నష్టపోయిన రైతులకు అదే సీజన్లో పరిహారం అందించేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా మంగళవారం రబీలో నష్టపోయిన మొత్తం 34,586 మంది రైతులకు రూ.22 కోట్లను వారి ఖాతాల్లో సీఎం జగన్ జమ చేశారు.ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. రైతుల కోసం మరో అడుగు ముందుకు వేస్తున్నామని అన్నారు. మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని, రైతులు ఇబ్బంది పడితే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కుంటుపడుతుందని తెలిపారు. రాష్ట్రంలో 62 శాతం జనాభా వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు. అలాంటి రైతు ఇబ్బందిపడితే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ రోడ్డుమీద పడుతుందని సీఎం తెలిపారు. ఇది తెలిసి కూడా గతంలో ఎప్పుడూ కూడా ఇంతగా ఆలోచన చేయలేదని, రైతును చేయిపట్టి నడిపించే విధంగా ఎవరూ చేయలేదన్నారు. ఇవాళ తాము తీసుకుంటున్న చర్యలు చరిత్రలో నిలిచిపోతాయని, రైతులకు ప్రభుత్వం అన్ని విధాలుగా తోడుగా ఉండాలని మనసా, వాచా, కర్మేణా ప్రతి అడుగూ ముందుకు వేస్తున్నామని సీఎం తెలిపారు. చదవండి: ఎమ్మెల్సీ అభ్యర్థులకు బీఫాం అందజేసిన సీఎం జగన్ తుపానులు, వరదలు, కరువు ఏవి వచ్చినా సరే రైతు నష్టపోయే పరిస్థితి రాకూడదని, ఒక వేళ వచ్చినా అదే సీజన్ ముగిసే లోగా పరిహారం అందిస్తున్నామని సీఎం తెలిపారు. రైతుకు మళ్లీ పెట్టుబడి అందేలా చేస్తున్నామని, ఏ సీజన్లో జరిగిన నష్టానికి అదే సీజన్లో పరిహారాన్ని చెల్లించే కొత్త సాంప్రదాయాన్ని రాష్ట్రంలో తీసుకు రావడం జరిగిందని సీఎం జగన్ పేర్కొన్నారు. పూర్తి పారదర్శకతతో వారికి పరిహారం చెల్లిస్తున్నామని, నష్టపోయిన ప్రతి రైతుకూ పూర్తి పారదర్శకతతో చెల్లిస్తున్నామని సీఎం చెప్పారు. రైతు పక్షపాత ప్రభుత్వం 2 నెలల క్రితం గులాబ్ తుపాను కారణంగా పంట నష్టపోయిన 34,586 మంది రైతులకు ఖరీఫ్ సీజన్ ముగిసేలోగా రూ.22 కోట్ల రూపాయలను వారి ఖాతాల్లో జమ చేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. రూ.22 కోట్లే కదా అని కొందరు గిట్టవాళ్లు మాట్లాడే పరిస్థితి ఉంటుందని, కాని ఒక కొత్త సంప్రదాయాన్ని ప్రారంభించామన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని తెలిపారు. ఏ సీజన్లో పంట నష్టం జరిగితే ఆ సీజన్ ముగిసేలోగా కచ్చితంగా ప్రభుత్వం పరిహారం ఇచ్చి తోడుగా ఉంటుందనే విషయాన్ని గుర్తించాలని సీఎం జగన్ అన్నారు. ఈ అంశానికి ప్రాధాన్యత ఇస్తూ ఈ కార్యక్రమం చేస్తున్నామని, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండున్నర ఏళ్ల కాలంలో నవంబర్‌లో నివర్ తుపాన్ వచ్చిందని అన్నారు. డిసెంబర్ చివరినాటికి 8.34 లక్షల మందికి 645.99 కోట్ల రూపాయలు నష్టపరిహారం కింద ఇచ్చామని సీఎం జగన్ చెప్పారు. ఎక్కువ, తక్కువ మొత్తం అనేది కాకుండా రైతుకు నష్టం జరిగినా, తుపాను వచ్చినా ఇతరత్రా కష్టం వచ్చినా ప్రభుత్వం రైతుకు తోడుంగా ఉంటుందనే గట్టి సందేశం ఇవ్వాలనే ఈ కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. 13.96 లక్షల మంది రైతులకు కేవలం ఇన్పుట్ సబ్సిడీ కింద రూ.1,071 కోట్ల రూపాయలు ఇచ్చామని తెలిపారు. రెండున్నరేళ్ల కాలంలో రైతులకోసం అనేక చర్యలు తీసుకున్నామని, వైఎస్సార్ రైతు భరోసా కింద అక్షరాల రూ.18,777 కోట్లు నేరుగా రైతుల చేతికి అందించామని చెప్పారు. వైఎస్సార్ సున్నా వడ్డీ కింద రూ.1674 కోట్లు ఇచ్చామని, ఉచిత పంటల బీమా కింద 3,788 కోట్లు ఇచ్చామని, పగటి పూట నాణ్యమైన విద్యుత్తు కోసం రూ.18వేల కోట్లు ఖర్చు పెట్టామని తెలిపారు. ఆక్వా రైతులకు రూ.1505 కోట్ల రూపాయలు కరెంటు సబ్సిడీ ఇచ్చామని ఫీడర్ల కోసం రూ.1700 కోట్లకుపైగా ఖర్చు చేశామని సీఎం తెలిపారు. పంట కొనుగోలులోనూ ఆర్బీకే కేంద్ర బిందువుగా పనిచేస్తోందని చెప్పారు. ధాన్యం సేకరణ కోసం మాత్రమే 2 సంవత్సరాల కాలంలో అక్షరాల రూ.30వేల కోట్లకుపైగా ఖర్చుచేశామని తెలిపారు. పత్తి కొనుగోలు కోసం రూ.1800 కోట్లు వెచ్చించామని, ఇతర పంటల కొనుగోలు కోసం రైతు నష్టపోకుండా రూ.6430 కోట్ల ఖర్చు చేశామని సీఎం జగన్ పేర్కొన్నారు. ప్రకృతి వైపరీత్యాల నిధి రైతు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో రూ.2వేల కోట్లతో ప్రకృతి వైపరీత్యాల నిధి పెట్టామని, రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి పెట్టామని సీఎం అన్నారు. ధాన్యం సేకరణకోసం గత ప్రభుత్వం పెట్టిన రూ.960 కోట్ల బకాయిలను చెల్లించామని, ఉచిత విద్యుత్ కింద రూ.9వేల కోట్ల కరెంటు బకాయిలను గత ప్రభుత్వం పెడితే దాన్ని చెల్లించామని తెలిపారు. విత్తన బకాయిలు కూడా కట్టామని, రైతన్నలకు తోడుగా ఉండాలని వ్యవస్థలోకి మార్పులను తీసుకు వస్తున్నామని సీఎం పేర్కొన్నారు. వ్యవసాయ సలహా కమిటీలు ఆర్బీకేల స్థాయి, మండలస్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిల్లో పెట్టామని చెప్పారు. ఈ మధ్యకాలంలో వర్షాలు బాగా పడ్డాయని, రైతులెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. నష్టపోయిన ప్రతి రైతుకూ కూడా ప్రభుత్వం తోడుగా ఉంటుంది.. రబీ సీజన్ ముగియకముందే వారికి పరిహారాన్ని చెల్లిస్తామని సీఎం జగన్ తెలిపారు. -
రైతు శ్రేయస్సే లక్ష్యం: సీఎం జగన్
సాక్షి, అమరావతి : ‘రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన ప్రభుత్వం ఇది. అందుకే తొలి రోజు నుంచీ రైతుల పక్షపాతంగా, రైతు శ్రేయస్సే లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తున్నాం. ఈ దిశగా అన్నదాతల కోసం ఈ 18 నెలల కాలంలో ఏకంగా రూ.61,400 కోట్లు చిరునవ్వుతో వెచ్చించాం’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్ పథకం మూడో విడత నిధులు, అక్టోబర్‌లో వచ్చిన నివర్ తుపాను వల్ల పంటలు దెబ్బ తిన్న రైతులకు పెట్టుబడి రాయితీ (ఇన్పుట్ సబ్సిడీ) సొమ్మును మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్లో బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా జిల్లాల్లో రైతులను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. అర కోటి మందికి పైగా రైతులకు మూడో విడత రైతు భరోసాగా రూ.1,120 కోట్లు, నివర్ తుపాను పరిహారం కింద 8.34 లక్షల మంది రైతులకు రూ.646 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నామన్నారు. మొత్తంగా రైతుల ఖాతాల్లో రూ.1,766 కోట్లు జమ చేస్తున్నామని చెప్పారు. ఒక సీజన్లో జరిగిన నష్టానికి అదే సీజన్లో పరిహారం (నెలలోగానే ఇచ్చారు) అందించే మరో శుభకార్యానికి ఈరోజు శ్రీకారం చుట్టామన్నారు. గత టీడీపీ ప్రభుత్వం రూ.87,612 కోట్లు రైతుల రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించి, ఐదేళ్లలో విడతల వారీగా కనీసం రూ.12 వేల కోట్లు కూడా ఇవ్వలేదని స్వయంగా ఆర్బీఐ అధికారులే తెలిపారని చెప్పారు. ధాన్యం, విత్తనాలు, ఇన్సూరెన్సు, కరెంటు బకాయిలతో పాటు, చివరకు ఇన్పుట్ సబ్సిడీ, సున్నా వడ్డీ బకాయిలు కూడా ఎగ్గొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. వారు రైతులకు చేసిన మోసం అంతా ఇంతా కాదని, ఇది అందరికీ తెలుసని చెప్పారు. ఆ కష్టాలు పడలేక ఆత్మహత్య చేసుకున్న 434 మంది రైతుల కుటుంబాలకు మన ప్రభుత్వం వచ్చాక పరిహారం ఇచ్చామని వివరించారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. ఆ డ్రామాలు మనమంతా చూస్తున్నాం ► రైతు భరోసా, నివర్ తుపాను బాధిత రైతులకు ఇన్పుట్ సబ్సిడీని ఇవాళ ఇస్తామని గతంలోనే చెప్పాం. నవంబర్ 24న వీడియో కాన్ఫరెన్స్‌లో, 25న సీఎంవో మీటింగులో, 27న కేబినెట్ మీటింగులో, 28న నివర్ తుపానుపై తిరుపతిలో జరిగిన రివ్యూ మీటింగ్‌లో, నవంబర్ 30న అసెంబ్లీలో చెప్పాం. ఆ తర్వాత డిసెంబర్ 18న కేబినెట్ సమావేశంలో కూడా చెప్పాం. అయినా చంద్రబాబు రాజకీయం చేస్తున్నారు. ► ఇన్ని చేస్తున్నా ‘పండ్లు ఇచ్చే చెట్టు మీదే రాళ్లు పడతాయి’ అన్నట్లుగా, బాధ్యత లేని ప్రతిపక్ష నాయకుడు ఎలా డ్రామాలు ఆడిస్తున్నాడో మనమంతా చూస్తున్నాం. ఇది బాధనిపిస్తోంది. గ్రామాల్లో వికాసం ► గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి, విత్తనం నుంచి పంటల అమ్మకం వరకు రైతుకు తోడుగా ఉంటున్నాం. ► గ్రామాల్లోనే గోదాములు, ప్రైమరీ ప్రాసెసింగ్ సెంటర్లు, నియోజకవర్గాల స్థాయిలో సెకండరీ ప్రాసెసింగ్ యూనిట్లు, గ్రామాల్లో జనతా బజార్లు ఏడాదిలో ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. వీటన్నింటికీ రూ.10 వేల కోట్లు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ► ఈ కార్యక్రమంలో ఎంపీ బాలశౌరి, సీఎస్ నీలం సాహ్ని, ఏపీ అగ్రి మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, పలువురు ఉన్నతాధికారులు, రైతులు పాల్గొన్నారు. ఇది రైతు పక్షపాత ప్రభుత్వం ► వైఎస్సార్ రైతు భరోసా కింద 51.59 లక్షల మంది రైతుల కుటుంబాలకు రూ.13,131 కోట్లు ఇచ్చాం. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు పెట్టుబడి సాయంగా రూ.13,500 చొప్పున ఇవ్వడమే కాకుండా, కౌలు రైతులు, అటవీ భూములు, అసైన్డ్ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు కూడా రైతు భరోసా సహాయం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం మనది. ► గత ప్రభుత్వం రూ.904 కోట్లు సున్నా వడ్డీ బకాయిలు పెట్టిపోతే, ఆ బకాయిలు తీర్చడమే కాకుండా, వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద ఈ ఖరీఫ్‌లో రూ.510 కోట్ల పంట రుణాలు చెల్లించాం. ► వైఎస్సార్ ఉచిత పంటల బీమా క్లెయిమ్‌ల కోసం రూ.1,968 కోట్లు ఇచ్చాం. రైతుల నుంచి కేవలం ఒక్క రూపాయి మాత్రమే తీసుకున్నాం. ► ఈ ఏడాది జూన్ నుంచి నవంబర్ వరకు భారీ వర్షాలు, వరదలు, తుపానుల వల్ల 17.25 లక్షల ఎకరాల్లో జరిగిన పంట నష్టానికి 13.56 లక్షల మంది రైతులకు సుమారు రూ.1,038.46 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ అందించాం. ► ధాన్యం కొనుగోలుకు రూ.18,343 కోట్లు వెచ్చిస్తే, ఇతర పంటల కోసం మరో రూ.4,761 కోట్లు వ్యయం చేశాం. రైతులకు ఇస్తున్న ఉచిత విద్యుత్ కోసం, ఆక్వా రైతుల బాగు కోసం రూ.17,430 కోట్లు ఖర్చు చేశాం. ఇందులో గత ప్రభుత్వం రైతుల తరఫున కట్టాల్సిన రూ.8,655 కోట్ల బకాయిలు చెల్లించాం. ► ఫీడర్ల కెపాసిటీ పెంచేందుకు రూ.1,700 కోట్లు వెచ్చించాం. రైతులకు నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను శాశ్వత ప్రాతిపదికన ఇవ్వడానికి 10 వేల మెగావాట్ల సోలార్ ప్రాజెక్టుకు టెండర్లను కూడా పిలిచాం. ► గత ప్రభుత్వం పెట్టిన ధాన్యం సేకరణ బకాయిలు రూ.960 కోట్లు చెల్లించాం. విత్తనాల సబ్సిడీ కింద గత ప్రభుత్వం ఎగ్గొట్టిన రూ.384 కోట్లు చిరునవ్వుతో ఇచ్చాం. శనగ రైతులకు బోనస్‌గా రూ.300 కోట్లు అధికారంలోకి వచ్చిన వెంటనే చెల్లించాం. సీఎం చరిత్ర సృష్టించారు గతంలో పంట నష్టం జరిగితే ఎప్పుడు అంచనా వేసేవారో తెలియదు. పరిహారం ఎప్పుడిస్తారో అంతకన్నా తెలియదు. సీఎం జగన్ మాత్రం పంట నష్టం జరిగిన నెల రోజుల్లోనే సహాయం చేస్తున్నారు. చెప్పిన తేదీ కంటే ముందే ఇస్తున్నారు. హామీలన్నీ అమలు చేస్తున్నారు. రైతులందరి తరఫున కృతజ్ఞతలు. – కె.కన్నబాబు, వ్యవసాయ శాఖ మంత్రి గత ప్రభుత్వంలో పైసా సాయం అందలేదు నాకు రెండున్నర ఎకరాల పొలం వుంది. నవంబర్‌లో తుపానుకు వరి పంట మొత్తం నీట మునిగి కుళ్లిపోయింది. ఆర్బీకే నుంచి అగ్రికల్చర్ అసిస్టెంట్ వచ్చి సర్వే చేసుకుని వెళ్లాడు. పరిహారం కింద ఇప్పుడు రూ.13,360 వచ్చినట్లు ఆర్బీకేలో పెట్టిన జాబితాలో చూసుకున్నాను. గత ప్రభుత్వ హయాంలో అనేక తుపాన్లు వచ్చినా ఇలా పరిహారం ఎప్పుడూ అందలేదు. ఇప్పుడు రైతులకు సంక్రాంతి ముందుగానే వచ్చింది. అన్ని హామీలూ నెరవేరుస్తున్న మీకు ధన్యవాదాలు. కునుకు నాగరాజు, పాసర్లపూడి, తూర్పు గోదావరి. అడగకుండానే వరాలు ఇస్తున్నారు నాకు నాలుగు ఎకరాల పొలం ఉంది. శనగ, పత్తి పండిస్తున్నాను. నివర్ తుపాను వల్ల పంట నష్టం జరిగింది. ఎకరాకు రూ.నాలుగు వేలు చొప్పున రూ.16 వేలు పరిహారంగా అందింది. రైతు భరోసా కింద ఇప్పుడు రూ.రెండు వేలు ఇస్తున్నారు. ఈ డబ్బుతో నూగు పంట పెట్టుకుంటాను. రైతు కష్టాలను మీ కష్టంగా.. మా సంతోషంలో మీ సంతోషం వెతుక్కుంటున్నారు. దేవుడు అడిగితేనే వరాలు ఇస్తాడు.. మీరు అడగకుండానే వరాలు ఇస్తున్నారు. – ఎం.అర్చన, వీఎన్ పల్లి మండలం, వైఎస్సార్ కడప జిల్లా ప్రజలంతా సంతోషంగా ఉన్నారు రెండున్నర ఎకరాల్లో ఖరీఫ్‌లో వరి సాగు చేశాను. తుపాను వల్ల పంట నష్టం కింద ఎకరానికి రూ.ఆరు వేల చొప్పున పరిహారం అందింది. రైతు భరోసా పథకం కింద ఇప్పటి వరకు రూ.11,500 వచ్చాయి. ఇప్పుడు మరో రూ.రెండు వేలు ఇస్తున్నారు. ఆర్బీకేల వల్ల ఎంతో మేలు జరుగుతోంది. గ్రామ సచివాలయ వ్యవస్థ వల్ల నా కుమారుడు, కుమార్తెకు ఉద్యోగాలు వచ్చాయి. మీ పథకాల వల్ల ప్రజలు సంతోషంగా ఉన్నారు. – కె.నాగమణి, తుమ్మపూడి, దుగ్గిరాల మండలం, గుంటూరు జిల్లా మీరు మనసున్న మహారాజు నాకు రెండున్నర ఎకరాల పొలం వుంది. మిర్చి సాగు చేస్తున్నాను. ఈ ఏడాది నివర్ తుపాను వల్ల పంట నష్టం జరిగితే రూ.15 వేలు పరిహారం అందింది. 15 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నాను. ఎప్పుడూ ఇలా పంట నష్టం జరిగిన నెల రోజుల్లోనే నష్ట పరిహారం రాలేదు. ఉచిత పంటల బీమా వల్ల ఎంతో మంది రైతులకు ఊరట కలుగుతోంది. మనసున్న మహారాజుగా మీరు చిరకాలం సీఎంగా ఉండాలి. – వి.సాంబశివరావు, వంకాయలపాడు, ఇంకొల్లు మండలం, ప్రకాశం జిల్లా గతంలో పంటనష్టం సర్వేకు 40–50 రోజులు పట్టేది నాకున్న 2.86 ఎకరాల పొలంలో నివర్ తుపాను వల్ల వరి పంట దెబ్బతిన్నది. ఇప్పుడు నష్ట పరిహారం కింద రూ.15 వేలు వచ్చింది. గతంలో పంట నష్టం జరిగితే సర్వే చేయడానికే కనీసం 40–50 రోజులు పట్టేది. కానీ మీరు ఏర్పాటు చేసిన సచివాలయ వ్యవస్థ ద్వారా వెంటనే సర్వే చేసి, నెల రోజుల్లోపే పరిహారం అందించడం చాలా గొప్ప విషయం. – పి.ప్రభాకర్ రావు, గుడ్లవల్లేరు మండలం, కౌతవరం గ్రామం, కృష్ణా జిల్లా చంద్రబాబు జూమ్‌కి దగ్గరగా ఉంటారు.. భూమికి దూరంగా ఉంటారు. రైతుల్ని రెచ్చగొడదామని చంద్రబాబు తన పుత్రుడ్ని, దత్తపుత్రుడ్ని.. ఇద్దరిలో ఏ ఒక్కరి మీదా నమ్మకం లేదు కాబట్టి ఇద్దర్నీ రంగంలోకి దించాడు. వీరిద్దరికీ రైతుల కష్టాల గురించి ఏనాడూ పట్టదు. ఆయన చెప్పాడు కాబట్టి హైదరాబాద్ నుంచి వచ్చి హడావుడి చేసి వెళ్లారు. జగన్ ఒక తేదీ చెబితే.. ఆ రోజు చేస్తాడని మీకు తెలుసు. ఇన్పుట్ సబ్సిడీని ఫలానా తేదీన ఇస్తామని చెప్పినప్పటికీ చంద్రబాబు వక్రబుద్ధి చూస్తుంటే బాధనిపిస్తోంది. – సీఎం వైఎస్ జగన్ పెట్టుబడి రాయితీ చెక్కుతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. చిత్రంలో ప్రజాప్రతినిధులు, అధికారులు -
అర్హులకు రాయితీ అందకుంటే ఉద్యమం
చిలమత్తూరు : అర్హులైన రైతులందరికీ పంట రాయితీ అందకుంటే వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో దశలవారీగా ఆందోళనలు, ఉద్యమాలు చేస్తామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ పేర్కొన్నారు. ఆదివారం ఆయన చిలమత్తూరులో ముస్లిం సోదరుల వివాహానికి హాజరయ్యారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా పంట రాయితీ ఏకపక్షంగా జమ అవుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలో పరిశ్రమలు ఎక్కడ స్థాపించారో చెప్పాలని ప్రశ్నించారు. రాగ మయూరి ఎల్సీనా పరిశ్రమ, సెంట్రల్ ఎక్సైజ్ అకాడమీ తదితర పరిశ్రమలు ఏర్పాటు కాలేదని విమర్శించారు. పరిశ్రమలు స్థాపిస్తామని చెప్పి తక్కువ నష్టపరిహారం రైతులకు ఇచ్చి టేకులోడు, నల్లబొమ్మనపల్లి, ఆరుమాకులపల్లి గ్రామాల రైతులతో 210 ఎకరాల భూములు సేకరించారని ఎద్దేవా విమర్శించారు. పెనుకొండ, గొల్లపల్లి, అమ్మవారిపల్లి గ్రామాల సమీపంలో కార్ల పరిశ్రమ ఏర్పాటుకు కూడా అధికార పార్టీ నేతల రియల్ ఎస్టేట్‌కు అనుకూలంగా మారిందని మండిపడ్డారు. ఆయనతో పాటు సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, కన్వీనర్లు వెంకటరత్నం, సుధాకర్‌రెడ్డి, కొండలరాయుడు, రాజగోపాల్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, యాసీన్, తుంగోడు నారాయణరెడ్డి, స్థానిక నాయకులు జబీవుల్లా, లక్ష్మీనారాయరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సేవలు.. చాలిక!
మహబూబ్‌నగర్ వ్యవసాయం: ఆదర్శ రైతులను తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగంసిద్ధం చేసింది. రైతులకు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ పంటలసాగు, సస్యరక్షణ చర్యలను తెలియజేసేందుకు నియమితులైన వీరంతా ఇక ఇంటిబాట పట్టనున్నారు. ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో జిల్లా లో 2747మంది ఆదర్శరైతులపై వేటుపడనుంది. 2008లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆదర్శరైతులను నియమించారు. రైతులకు అందుబాటులో ఉంటూ తగిన సమయంలో సూచనలు, సలహాలు ఇస్తున్న వీరికి ప్రభుత్వం వెయ్యి రూపాయల గౌరవవేతనం ఇస్తోంది. ఇలా నెలకు రూ.27.47లక్షల చొప్పున ఏడాదికి రూ.3.29 కోట్లను వీరికి కోసం చెల్లిస్తున్నారు. మొదట్లో నెలనెలా ఇచ్చిన గౌరవవేతనాన్ని ఆ తరువాత ఆరేడు నెలల కు ఒకమారు ఇస్తున్నారు. వీరిని జిల్లా, డివి జన్ స్థాయి వ్యవసాయశాఖ అధికారు లు ఎంపికచేసేవారు. గ్రామాల్లో 250 మంది రైతులకు ఒక ఆదర్శరైతును నియమించారు. కాగా, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఆదర్శ రైతుల నుంచి ఎలాంటి ఉపయోగం లేదని, రాజకీయ పలుకుబడి కలిగిన ఆదర్శరైతులు వ్యవసాయశాఖ అధికారులపై పెత్త నం, అజమాయిషీ చెలాయిస్తున్నరని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచా రం. పంట నష్టపరిహారం, రుణమాఫీ విషయాల్లోనూ ఆదర్శరైతులు అధికారులను తప్పుదోవపట్టించారనే నెపం తో తొలగింపునకు సిద్ధమయ్యారు. ఆదర్శ రైతుల విధులు గ్రామాల్లో రైతులకు ఎప్పటికప్పుడు వ్యవసాయంలో వచ్చిన నూతన పద్ధతులు, మార్పులను తెలియజేయడం లో కీలకంగా వ్యవహరిస్తారు.ప్రభుత్వ రైతు సంక్షేమ పథకాలను అన్నదాతలకు చేరవేయడంలో ప్రభుత్వం, రైతులకు మధ్య అనుసంధాన కర్తగా వ్యవహరిస్తారు. పొలంబడి, సీడ్ విలేజ్ పథకాల ద్వారా రైతులకు క్షేత్రస్థాయి అవగాహన కార్యక్రమాల్లో కీలకంగా వ్యవహరిస్తారు. అలాగే ఇన్పుట్ సబ్సి డీ పంపిణీ, పంటల బీమా, విత్తనాలు, ఎరువుల పంపిణీ వంటి కార్యక్రమాల్లో అధికారులకు చేదోడువాదోడుగా ఉం టారు. ఆదర్శ రైతులను తొలగించడంతో రైతుల దరికి ప్రభుత్వ పథకాలు చేరే అవకాశం లేకుండా పోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ఇన్పుట్ సబ్సిడీ పంపిణీకి చర్యలు
చిత్తూరు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: ఖరీఫ్- 2012లో పంట నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందించేందుకు చర్యలు చేపడుతున్నామని జిల్లా వ్యవసాయశాఖ జాయింట్ డెరైక్టర్ రవికుమార్ తెలిపారు. సాక్షి దినపత్రికలో ఆదివారం ప్రచురితమైన ‘పరిహారం-పరిహాసం’అనే కథనంపై జేడీ స్పందించారు. ఆయన ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ ఖరీఫ్ 2012లో వేరుశెనగ సాగుచేసిన రైతుల్లో 1.20 లక్షల మంది పంట నష్టపోయారన్నారు. వీరికి రూ.80 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ అవసరమవుతుందని ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపినట్లు చెప్పారు. ప్రభుత్వం 1.12 లక్షల మంది రైతులకు *76.09 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని విడుదల చేసిందని వివరించారు. ఇందులో ఇప్పటికే *71 కోట్లు రైతులకు అందజేశామని తెలిపారు. మిగిలిన మొత్తాన్ని రైతులకు వ్యక్తిగత ఖాతాలున్న 30 బ్యాంకుల్లో జమ చేశామన్నారు. ఈ క్రమంలో 7,690 మంది రైతులకు ఇన్పుట్ సబ్సిడీ త్వరలో అందుతుందని పేర్కొన్నారు. ఇన్పుట్ సబ్సిడీ కింద మరో రూ.4 కోట్లు పంపాల ని వ్యవసాయశాఖ కమిషనర్‌కు ప్రతిపాదనలు పం పినట్లు తెలిపారు. ఈ మొత్తం వస్తే జిల్లాలో మరో 8 వేల మంది రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందించేందుకు వ్యవసాయశాఖ సిద్ధంగా ఉందన్నారు. ఇప్పటికే బ్యాంకు ల్లో జమ చేసిన ఇన్పుట్ సబ్సిడీ మొత్తాలను వెంటనే రైతులకు అందించాలని బ్యాంకర్లను కోరుతామని తెలియజేశారు.