
పుట్టిన రోజు కేక్ కట్ చేస్తున్న పూరి జగన్నాథ్
బంజారాహిల్స్: ప్రముఖ సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ జన్మదిన వేడుకలు బుధవారం జూబ్లీహిల్స్‌లోని ఆయన కార్యాలయంలో ఘనంగా జరిగాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పూరి జగన్నాథ్ అభిమాన సంఘ అధ్యక్షుడు రవికుమార్ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు నుంచి 500 మంది అభిమానులతో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం 300 మంది అభిమానులు రక్తదానం చేశారు. పూరి జగన్నాథ్ కేక్ కట్ చేసిన అనంతరం 500 మంది పేదలకు అన్నదానం చేశారు.