ముంబై: డిస్కౌంట్ బ్రోకింగ్ సంస్థ అప్‌స్టాక్స్ గత ఆర్థిక సంవత్సరంలో బ్రేక్–ఈవెన్ (లాభ నష్ట రహిత స్థితి) సాధించింది. 2022–23లో మొత్తం ఆదాయం 40 శాతం ఎగిసి రూ. 1,000 కోట్లు దాటినట్లు కంపెనీ సహ వ్యవస్థాపకుడు, సీఈవో రవి కుమార్ తెలిపారు. తమ దగ్గర ప్రస్తుతం రూ. 1,000 కోట్ల పైచిలుకు నగదు నిల్వలు ఉన్నాయని చెప్పారు.
సొంత వ్యాపారాన్ని మరింతగా విస్తరించడం, ఇతర వ్యాపారాలను కొనుగోలు చేయడం తదితర మార్గాల్లో వృద్ధి సాధనపై దృష్టి పెట్టనున్నట్లు పేర్కొన్నారు. వచ్చే అయిదారేళ్లలో తమ కస్టమర్ల సంఖ్యను పది రెట్లు పెంచుకుని 10 కోట్లకు చేర్చుకోవాలని నిర్దేశించుకున్నట్లు ఆయన చెప్పారు. 2009లో ప్రారంభమైన అప్‌స్టాక్స్‌కి ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1.1 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు. వ్యాపార దిగ్గజం రతన్ టాటాతో పాటు టైగర్ గ్లోబల్ వంటి అంతర్జాతీయ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థలు పెట్టుబడులు పెట్టాయి.
Comments
Please login to add a commentAdd a comment