సాక్షి, నెహ్రూనగర్ (గుంటూరు): వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగి నన్నం రవికుమార్ మృతికి కారకులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని ఆగ్రహం వ్యక్తం చేశాయి. రవికుమార్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం గుంటూరు జీజీహెచ్‌లోని మార్చురీ ఎదుట ధర్నా నిర్వహించారు. పొన్నూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం జూనియర్ అసిస్టెంట్ నన్నం రవికుమార్ ఈనెల 17న పురుగు మందు తాగి ఆత్మ హత్యాయత్నం చేయ డంతో జీజీహెచ్‌కి తరలించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం అందించినా ఫలితం దక్కలేదు. రవికుమార్ బుధవారం రాత్రి చనిపోయాడు.
ఆవేదనను వీడియో తీసి...
ఆత్మహత్యకు ముందు రవికుమార్ తన ఆవేదనను సెల్‌ఫోన్‌లో వీడియో తీసి వాట్సాప్, ఫేస్‌బుక్ ద్వారా అందరికీ తెలిపాడు. తనకన్నా సీనియారిటీ తక్కువగా ఉన్నవారికి నగరంలో పోస్టింగ్ ఇచ్చి ఆరోగ్యం బాగాలేని తనను దూర ప్రాంతానికి బదిలీ చేసి పోస్టింగ్ ఆర్డర్ సైతం ఇవ్వకుండా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఇబ్బంది పెడుతున్నారని పేర్కొన్నాడు. అడిగినంత డబ్బులు ఇవ్వలేదనే కక్షతోనే తనను పొన్నూరుకు బదిలీ చేశారని తెలిపాడు. . కులం పేరుతో దూషించి వేధించటంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు వీడియోలో పేర్కొన్నాడు.
నలుగురి సస్పెన్షన్ : రవికుమార్ మృతికి కారకులైన నలుగురిని సస్పెండ్ చేస్తున్నట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్ జొన్నలగడ్డ యాస్మిన్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment