employee suicide
-
జీతం చాలడంలేదని లేఖ.. మిషన్ భగీరథ ఉద్యోగిని ఆత్మహత్య
నల్లగొండ క్రైం: నెల వారి జీతం సక్రమంగా ఇవ్వకపోవడంతోనే ఆర్థిక ఇబ్బందుల కారణంగా మిషన్ భగీరథ 35 ఎంఎల్‌డీలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న సింగం పుష్పలత ఆత్మహత్య చేసుకుందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. గత 6నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని, ఇందులో అధికారుల నిర్లక్ష్యం ఉందన్నారు. ఈమేరకు నల్లగొండ ఎస్పీని కలిసి బాధిత కుటుంబానికి తగిన న్యాయం చేయాలని కోరారు. పుష్పలత ఆత్మహత్యకు ముందు రాసిన సూసైడ్ నోట్‌ను వారికి అందజేశారు. పుష్పలత భర్త మహేష్ 10 నెలల క్రితం ఆత్మహత్య చేసుకోగా.. ఇప్పుడు భార్య ఆత్మహత్య చేసుకుందన్నారు. చిన్నారుల అనాథలుగా మారారన్నారు. కార్మికుల వేతనం రూ.19 వేలు ఇవ్వాల్సి ఉండగా రూ.9వేలు ఇవ్వడం అన్యామన్నారు. కార్మికుల పొట్ట కొడుతున్నప్పటికీ అధికారులు, మంత్రి, ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. హాలియా: మిషన్ భగీరథలో పనిచేస్తున్న ఓ కాంట్రాక్టు ఉద్యోగిని ఆర్థిక ఇబ్బందులతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన హాలియా మున్సిపాలిటీలోని సాయిప్రతాప్ నగర్లో గురువారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. తిరుమలగిరి(సాగర్) మండలంలోని అల్వాల గ్రామానికి చెందిన సింగం పుష్పలత(26)కి చిన్నవయసులోనే తల్లిదండ్రులు చనిపోయారు. మేనమామ అయిన జోలం సాంబయ్య ఆమెను పెంచి పెద్దచేశాడు. పుష్పలతను ఎనిమిదేళ్ల క్రితం నల్లగొండలోని పానగల్‌కు చెందిన సింగం మహేష్‌కి ఇచ్చి వివాహం జరిపించాడు. మహేష్ పానగల్‌లోని మిషన్ భగీరథలో కాంట్రాక్టు పద్ధతిలో కంట్రోల్ రూం ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. వీరికి కుమార్తె సాన్విత, కుమారుడు సాయినందన్ ఉన్నారు. మహేష్‌కు వచ్చే జీతం సరిపోకపోవడంతో ఆర్థిక ఇబ్బందులతో గతేడాది ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. భర్త మృతి చెందడంతో పుష్పలతకు హాలియా మిషన్ భగీరథలో కాంట్రాక్టు ఉద్యోగిగా అవకాశం కల్పించారు. ఈమె 6 నెలల క్రితం హాలియా పట్టణంలోని సాయిప్రతాప్ నగర్‌లోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ విధులు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో గురువారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. ఇంటి యజమాని గమనించి బంధువులు, పోలీసులకు సమాచారం ఇచ్చాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నల్లగొండలోని ఏరియా ఆస్పత్రికి తరలించి, అనంతరం బంధువులకు అప్పగించారు. మృతురాలు మేనమామ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ క్రాంతికుమార్ తెలిపారు. కాగా.. ఏడాది క్రితం తండ్రి, ఇప్పుడు తల్లిని కోల్పోయి ఇద్దరు చిన్నారులు అనాథలుగా మారారు. చావుకు ఎవరూ కారణం కాదు.. సూసైడ్ నోట్లో ఇలా ఉంది.. పుష్పలత మృతదేహం సమీపంలో సూసైడ్ నోట్ కనిపించింది. అందులో తన చావుకు ఎవరూ కారణం కాదని, మిషన్ భగీరథలో చేసే ఉద్యోగానికి తనకు వచ్చే జీతం రూ. 9,500లు సరిపోకపోవడం, అది కూడా రెండు, మూడు నెలల వరకూ రాకపోవడంతో ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నానని పేర్కొని ఉంది. తన కడుపులో గడ్డ కావడంతో వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు ఆపరేషన్‌కు రూ. 2లక్షలు ఖర్చు అవుతుందనడంతో ఆర్థిక స్థోమత లేక ఆత్మహత్య చేసుకుంటున్నానని రాసి ఉంది. -
రష్యా రక్షణ శాఖ ఉద్యోగిని అనుమానాస్పద మృతి
మాస్కో: రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రభుత్వంలోని మరో ఉద్యోగిని అనుమానాస్పదంగా మృతి చెందారు. రక్షణ శాఖలో పని చేస్తున్న 58 ఏళ్ల మరీనా యాంకినా సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో అపార్ట్మెంట్లో 16వ అంతస్తులో ఉన్న తన నివాసం కిటికీ నుంచి కింద పడి ప్రాణాలు కోల్పోయారు. ఆమె ప్రమాదవశాత్తూ పడిపోయారా, ఆత్మహత్య చేసుకున్నారా అన్నది విచారణలో తేలాల్సి ఉంది. 160 అడుగుల ఎత్తు నుంచి కిండ పడిపోవడంతో ఆమె వెంటనే ప్రాణాలు కోల్పోయారు. రక్తపు మడుగులో ఉన్న మరీనాను ఆ మార్గం నుంచి వెళుతున్న వారు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రష్యా అధ్యక్షుడు ఉక్రెయిన్‌పై జరిపే యుద్ధంలో నిధుల సేకరణలో మరీనా అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్నారు. -
తెలంగాణ పోలీసులకు సుప్రీం నోటీసులు
సాక్షి, సంగారెడ్డి : మహిళా ఉద్యోగి ఆత్మహత్య కేసులో తెలంగాణ పోలీసులకు, సీబీఐ అధికారులతోపాటు బీహెచ్ఈఎల్ యాజమాన్యానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. గతేడాది అక్టోబర్‌లో బీహెచ్ఈఎల్లో ఉన్నతస్థాయి అధికారుల వేధింపుల కారణంగా నేహా చౌస్కి అనే ఉద్యోగిని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఉద్యోగ సంస్థలో పై అధికారుల వేధింపుల కారణంగానే తను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు నేహా సుసైడ్ నోట్లో రాశారు. ఈ క్రమంలో కూతురు ఆత్మహత్యపై సీబీఐ విచారణ కోరుతూ నేహా తల్లిదండ్రులు సుప్రీం కోర్టును ఆదేశించారు. (బతికుండగానే చంపేశారు) ఈ నేపథ్యంలో సుసైడ్‌నోట్‌లో ఉన్న ఎనిమిది మందిని మియాపూర్ పోలీసులు ఎందుకు విచారణ జరపలేదని అత్యున్నత ధర్మాసనం జారీ చేసిన నోటీసులో పేర్కొంది. అదే విధంగా లేఖలో ఉన్న బీహెచ్ఈఎల్ అధికారులు, ఇతర ఉద్యోగులపై కూడా యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకుందనే విషయంపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగిగా పనిచేస్తున్న మహిళపై అధికారుల వేధింపులపై ఫిర్యాదు అందినా సీబీఐ ఎందుకు స్పందించలేదని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. (వికాస్ దూబే మరో సహచరుడు అరెస్టు!) -
నా చావుతోనైనా మార్పు రావాలి
-
నా చావుతోనైనా మార్పు రావాలి
విజయనగరం టౌన్: విశాఖపట్నంలోని డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (డీసీఐ)ను ప్రైవేటీకరించొద్దని, తన చావుతోనైనా ఈ ప్రక్రియ నిలిపివేయాలని డీసీఐ ఉద్యోగి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనికి సంబంధించి శ్రీకాకుళం జీఆర్పీ హెచ్‌సీ చిరంజీవులు, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరం ఎమ్మార్వో కార్యాలయ సమీపంలో నివాసం ఉంటున్న భాసిన రామ్మూర్తి, అన్నపూర్ణకు కుమారుడు నారాయణం వెంకటేశ్, సంధ్య, శిరీష అనే కుమార్తెలు ఉన్నారు. వెంకటేశ్ (30) విశాఖ డ్రెడ్జింగ్ కార్పొరేషన్‌లోని అడ్మిన్ విభాగంలో పనిచేస్తున్నాడు. 2017 జూన్‌లో అప్పు చేసి సోదరికి పెళ్లి చేశాడు. తమ సంస్థను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటుపరం చేస్తుందనే సమాచారంతో వెంకటేశ్ ఆందోళనకు గురయ్యాడు. చేసిన అప్పులు ఎలా తీర్చాలో అని కలత చెందాడు. తన చావును చూసైనా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం మార్చుకుంటుందనుకొని ఆత్మహత్యకు సిద్ధపడ్డాడు. శనివారం తన తల్లికి అరగంటలో వస్తానని చెప్పి వెంకటేశ్ ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. సోమవారం సాయంత్రం రైల్వే పోలీసుల నుంచి ఫోన్ వచ్చింది. దీంతో వెంకటేశ్ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. శ్రీకాకుళం రైల్వే జీఆర్పీ చిరంజీవులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, వెంకటేశ్ ఆత్మహత్యకు కేంద్ర ప్రభుత్వమే కారణమని డీసీఐ ఉద్యోగులు సీహార్స్ కూడలిలో ఆందోళనకు దిగారు. -
కులం పేరుతో దూషించారు...!
సాక్షి, నెహ్రూనగర్ (గుంటూరు): వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగి నన్నం రవికుమార్ మృతికి కారకులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని ఆగ్రహం వ్యక్తం చేశాయి. రవికుమార్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం గుంటూరు జీజీహెచ్‌లోని మార్చురీ ఎదుట ధర్నా నిర్వహించారు. పొన్నూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం జూనియర్ అసిస్టెంట్ నన్నం రవికుమార్ ఈనెల 17న పురుగు మందు తాగి ఆత్మ హత్యాయత్నం చేయ డంతో జీజీహెచ్‌కి తరలించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం అందించినా ఫలితం దక్కలేదు. రవికుమార్ బుధవారం రాత్రి చనిపోయాడు. ఆవేదనను వీడియో తీసి... ఆత్మహత్యకు ముందు రవికుమార్ తన ఆవేదనను సెల్ఫోన్లో వీడియో తీసి వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా అందరికీ తెలిపాడు. తనకన్నా సీనియారిటీ తక్కువగా ఉన్నవారికి నగరంలో పోస్టింగ్ ఇచ్చి ఆరోగ్యం బాగాలేని తనను దూర ప్రాంతానికి బదిలీ చేసి పోస్టింగ్ ఆర్డర్ సైతం ఇవ్వకుండా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఇబ్బంది పెడుతున్నారని పేర్కొన్నాడు. అడిగినంత డబ్బులు ఇవ్వలేదనే కక్షతోనే తనను పొన్నూరుకు బదిలీ చేశారని తెలిపాడు. . కులం పేరుతో దూషించి వేధించటంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు వీడియోలో పేర్కొన్నాడు. నలుగురి సస్పెన్షన్ : రవికుమార్ మృతికి కారకులైన నలుగురిని సస్పెండ్ చేస్తున్నట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ జొన్నలగడ్డ యాస్మిన్ తెలిపారు. -
రైల్వే ఉద్యోగి ఆత్మహత్యాయత్నం
కడప అర్బన్ : కడప రైల్వే ఇంజనీరింగ్ విభాగంలో ఆఫీస్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న డి. సుందర్రాజ్ (53) గురువారం మధ్యాహ్నం వాస్మోల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. చికిత్స నిమిత్తం తోటి సిబ్బంది ఆయన్ను కడప రిమ్స్‌కు తరలించారు. బాధితుడు తెలిపిన వివరాల మేరకు..మూడున్నర సంవత్సరాల నుంచి చింతకొమ్మదిన్నె సమీపంలోని అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ కార్యాలయంలో ఆఫీస్ సూపరింటెండెంట్‌గా తాను పని చేస్తున్నట్లు తెలిపాడు. కాగా, 16న(గురువారం) రాత్రి హైదరాబాద్ వెళ్లేందుకు రెండు రోజుల సెలవు ఇవ్వాలని అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ స్టాన్లీని కోరినట్లు తెలిపారు. అయితే ఆయన లీవ్ మంజూరుచేయకపోవడంతో మనస్తాపంతో వాస్మోల్ తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సంఘటనపై బాధితుడి భార్య ప్రమీల మాట్లాడుతూ అధికారి వేధింపుల వల్లే తన భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆరోపించారు. -
అధికారి వేధింపులతో ఉద్యోగి ఆత్మహత్య
సిరిసిల్లటౌన్ / సిరిసిల్ల క్రైం: ఉన్నతాధికారితో పాటు సహోద్యోగి వేధింపులు భరించలేక సబ్‌స్టేషన్ ఆపరేటర్ ఎంబేరి రాజ్‌కుమార్(29) ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని శాంతినగర్‌లో మంగళవారం జరిగింది. రాజ్‌కుమార్ వేములవాడ మండలం మల్లా రం విద్యుత్ సబ్‌స్టేషన్‌లో ఆపరేటర్. 2010లో ఉద్యోగంలో చేరగా ఇటీవలే పర్మనెంటు అయింది. అయితే, ఏఈ సంతోశ్‌కుమార్, సహోద్యోగి నర్సయ్య కలసి సొంతపనులు చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. పైగా విధులు సక్రమంగా చేయడం లేదంటూ వేధిస్తు న్నారు. దీనిపై గతంలో డీఈకి ఫిర్యాదు చేశాడు. అయినా, వారి ప్రవర్తనలో మార్పు రాలేదు. రాజ్‌కుమార్ మంగళవారం తన ఇంటి మేడపైకి వెళ్లి ఫోన్లో మాట్లాడుతున్నాడు. కొంతసేపటికి మరో సహోద్యోగి రాజ్‌కుమార్ వద్దకు వెళ్లాడు. వెంటనే కిందికి వచ్చి రాజ్‌కుమార్ విషం తాగినట్లు కుటుంబ సభ్యులకు చెప్పాడు. వారు బాధితుడిని ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లగా, అప్పటికే చని పోయినట్లు వైద్యులు చెప్పారు. తల్లిదండ్రులు భూలక్ష్మి– లక్ష్మీనారాయణ రెండ్రోజుల క్రితమే శ్రీకాళహస్తిలో మొక్కులు తీర్చుకోవడానికి వెళ్లిన తరుణంలో రాజ్ కుమార్ ఈ అఘా యిత్యానికి ఒడిగ ట్టాడు. ఆయనకు నలుగురు సోదరీమణులు ఉన్నారు. -
'శ్రీచైతన్య'లో ఉద్యోగిని ఆత్మహత్య
విజయవాడ : కృష్ణాజిల్లా గన్నవరం మండలం గూడవల్లిలోని శ్రీచైతన్య కళాశాలలో ఉద్యోగిని గురువారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆ విషయాన్ని గమనించిన కాలేజీ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.