
కడప అర్బన్ : కడప రైల్వే ఇంజనీరింగ్ విభాగంలో ఆఫీస్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న డి. సుందర్‌రాజ్ (53) గురువారం మధ్యాహ్నం వాస్మోల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. చికిత్స నిమిత్తం తోటి సిబ్బంది ఆయన్ను కడప రిమ్స్‌కు తరలించారు. బాధితుడు తెలిపిన వివరాల మేరకు..మూడున్నర సంవత్సరాల నుంచి చింతకొమ్మదిన్నె సమీపంలోని అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ కార్యాలయంలో ఆఫీస్ సూపరింటెండెంట్‌గా తాను పని చేస్తున్నట్లు తెలిపాడు. కాగా, 16న(గురువారం) రాత్రి హైదరాబాద్ వెళ్లేందుకు రెండు రోజుల సెలవు ఇవ్వాలని అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ స్టాన్లీని కోరినట్లు తెలిపారు. అయితే ఆయన లీవ్ మంజూరుచేయకపోవడంతో మనస్తాపంతో వాస్మోల్ తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సంఘటనపై బాధితుడి భార్య ప్రమీల మాట్లాడుతూ అధికారి వేధింపుల వల్లే తన భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment