
రాజ్‌కుమార్ మృతదేహం
సిరిసిల్లటౌన్ / సిరిసిల్ల క్రైం: ఉన్నతాధికారితో పాటు సహోద్యోగి వేధింపులు భరించలేక సబ్‌స్టేషన్ ఆపరేటర్ ఎంబేరి రాజ్‌కుమార్(29) ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని శాంతినగర్‌లో మంగళవారం జరిగింది. రాజ్‌కుమార్ వేములవాడ మండలం మల్లా రం విద్యుత్ సబ్‌స్టేషన్‌లో ఆపరేటర్. 2010లో ఉద్యోగంలో చేరగా ఇటీవలే పర్మనెంటు అయింది. అయితే, ఏఈ సంతోశ్‌కుమార్, సహోద్యోగి నర్సయ్య కలసి సొంతపనులు చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. పైగా విధులు సక్రమంగా చేయడం లేదంటూ వేధిస్తు న్నారు. దీనిపై గతంలో డీఈకి ఫిర్యాదు చేశాడు.
అయినా, వారి ప్రవర్తనలో మార్పు రాలేదు. రాజ్‌కుమార్ మంగళవారం తన ఇంటి మేడపైకి వెళ్లి ఫోన్‌లో మాట్లాడుతున్నాడు. కొంతసేపటికి మరో సహోద్యోగి రాజ్‌కుమార్ వద్దకు వెళ్లాడు. వెంటనే కిందికి వచ్చి రాజ్‌కుమార్ విషం తాగినట్లు కుటుంబ సభ్యులకు చెప్పాడు. వారు బాధితుడిని ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లగా, అప్పటికే చని పోయినట్లు వైద్యులు చెప్పారు. తల్లిదండ్రులు భూలక్ష్మి– లక్ష్మీనారాయణ రెండ్రోజుల క్రితమే శ్రీకాళహస్తిలో మొక్కులు తీర్చుకోవడానికి వెళ్లిన తరుణంలో రాజ్ కుమార్ ఈ అఘా యిత్యానికి ఒడిగ ట్టాడు. ఆయనకు నలుగురు సోదరీమణులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment