
ప్రపంచ వ్యాప్తంగా 2400 థియేటర్లలో 'లింగా' విడుదల
చెన్నై: సూపర్ స్టార్ రజనీకాంత్ జన్మదిన కానుకగా డిసెంబర్ 12న శుక్రవారం లింగా చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 2400 థియేటర్లలో విడుదలైంది. తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా రజనీకాంత్ అభిమానులు కోలహాలంతో నిండిపోయింది. ఈ సందర్భంగా అభిమానులందరూ బాణసంచా కాలుస్తూ సంబరాలు జరుపుకుంటున్నారు. పాండిచ్చేరిలోని అన్ని థియేటర్లలో లింగా చిత్రం విడుదలైంది.
కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ స్వరాలు అందించారు. ఈ చిత్రం వరల్డ్ వైడ్ ప్రదర్శన హక్కులను ఓ ప్రముఖ సినీ నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్ సంస్థ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. రవికుమార్ - రజనీ కాంత్ కాంబినేషన్‌లో గతంలో నిర్మించిన ముత్తు, అరుణాచలం, నరసింహ చిత్రాలు ఘన విజయాలు సాధించాయి. దాంతో లింగా చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.