రజనీ పుట్టిన రోజున లింగా రిలీజ్ | Rajinikanth's Lingaa to hit screens on superstar's birthday | Sakshi

రజనీ పుట్టిన రోజున లింగా రిలీజ్

Jun 27 2014 12:27 AM | Updated on Sep 2 2017 9:26 AM

రజనీ పుట్టిన రోజున లింగా రిలీజ్

రజనీ పుట్టిన రోజున లింగా రిలీజ్

సూపర్‌స్టార్ రజనీకాంత్ పుట్టినరోజున లింగా చిత్రం తెరపైకి రానుందన్నది తాజా వార్త. కోచ్చడయాన్ తరువాత రజని నటిస్తున్న చిత్రం లింగా. చరిత్ర కథాంశంతో తెరకెక్కుతున్న

సూపర్‌స్టార్ రజనీకాంత్ పుట్టినరోజున లింగా చిత్రం తెరపైకి రానుందన్నది తాజా వార్త. కోచ్చడయాన్ తరువాత రజని నటిస్తున్న చిత్రం లింగా. చరిత్ర కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రజనీకాంత్ మరోసారి ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఆయన సరసన అందాలభామలు అనుష్క, సోనాక్షి సిన్హా నటిస్తున్న విషయం తెలిసిందే. కె ఎస్ రవికుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవల విడు దలైన సూపర్‌స్టార్ చిత్రం కోచ్చడయాన్   అభిమానులను పూర్తి సంతృప్తి పరచలేక పోయింది. లింగా చిత్రం ముత్తు, పడయప్ప చిత్రాల తరహాలో పూర్తి కమర్షియల్ చిత్రంగా రూపొందబోతుందని యూనిట్ వర్గాల మాట కాగా, ఈ లింగా చిత్రాన్ని రజనీకాంత్ పుట్టిన రోజు కానుకగా డిసెంబర్ 12న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement