'లింగా'లో రజనీకాంత్ డబుల్ రోల్!! | Rajinikanth plays dual avatar in 'Lingaa' | Sakshi
Sakshi News home page

'లింగా'లో రజనీకాంత్ డబుల్ రోల్!!

Published Wed, Jul 2 2014 12:43 PM | Last Updated on Sat, Sep 2 2017 9:42 AM

'లింగా'లో రజనీకాంత్ డబుల్ రోల్!!

'లింగా'లో రజనీకాంత్ డబుల్ రోల్!!

తమిళ యాక్షన్ చిత్రం 'లింగా'లో సూపర్స్టార్ రజనీకాంత్ డబుల్ రోల్ పోషిస్తున్నారు. దీంతో ఆ షూటింగులో మహా బిజీగా ఉంటున్నారు. ఈ రెండు పాత్రల్లో ఒకటి జిల్లా కలెక్టర్ పాత్ర కాగా, మరొకటి ఫ్లాష్బ్యాక్లో వచ్చే పాత్ర. అయితే ఆ రెండోపాత్ర ఏంటన్న విషయాన్ని మాత్రం రహస్యంగానే ఉంచారని ఆ సినిమాకు సంబంధించిన వర్గాలు తెలిపాయి.

ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతోంది. బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా ఈ సినిమాలో రజనీ పక్కన నటిస్తోంది. తన స్నేహితుడి కుమార్తె కావడంతో ఆమె హీరోయిన్ అనగానే కాసేపు రజనీ కాంత్ సందిగ్ధత వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో జగపతిబాబు కూడా ఓ కీలకపాత్రలో నటిస్తున్నారు. కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ స్వరాలు అందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement