'లింగ'కు రజనీ సూపర్ఫాస్ట్ డబ్బింగ్! | Rajinikanth dubbed for 'Lingaa' in 24 hours? | Sakshi
Sakshi News home page

'లింగ'కు రజనీ సూపర్ఫాస్ట్ డబ్బింగ్!

Published Sat, Oct 18 2014 12:32 PM | Last Updated on Sat, Sep 2 2017 3:03 PM

'లింగ'కు రజనీ సూపర్ఫాస్ట్ డబ్బింగ్!

'లింగ'కు రజనీ సూపర్ఫాస్ట్ డబ్బింగ్!

సూపర్స్టార్ రజనీకాంత్ వయస్సు.. 63 ఏళ్లు. కానీ ఈ వయసులో కూడా ఆయన మెరుపువేగంతో డబ్బింగ్ చెప్పేసి అందరినీ ఆశ్చర్యచకితులను చేశారు. 'లింగ' చిత్రం కోసం ఆయన తన మొత్తం డబ్బింగ్ పనిని కేవలం 24 గంటల్లో పూర్తిచేయడంతో యూనిట్ అంతా నోళ్లు వెళ్లబెట్టారట. సాధారణంగా హీరో పాత్రధారి తనకు తాను డబ్బింగ్ చెప్పుకోవాలన్నా కూడా కొన్ని రోజులు పడుతుందని, అక్కడ సీన్ వస్తున్నప్పుడు పెదాల కదలికలకు అనుగుణంగా సరిగ్గా సరిపోయేలా డబ్బింగ్ చెప్పాల్సి ఉంటుందని, అందుకు రెండు మూడు టేకులు కూడా అవసరం అవుతాయని చిత్ర యూనిట్ వర్గాలు తెలిపాయి.

కానీ రజనీకాంత్ మాత్రం సింగిల్ టేక్లోనే చాలావరకు డైలాగులు డబ్బింగ్ చెప్పేశారన్నారు. 'లింగ' తమిళ వెర్షన్కు ఇక రెండు పాటల షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది. మిగిలిన షూటింగ్ అంతా పూర్తయింది. ఓ పాట కోసం యూరప్ వెళ్దామని భావిస్తున్నారు. అక్కడ సోనాక్షి సిన్హా, రజనీకాంత్ల మీద పాట చిత్రీకరిస్తారు. కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా... రజనీ పుట్టిన రోజైన డిసెంబర్ 12వ తేదీన విడుదల కానుంది. అనుష్క ఈ సినిమాలో రెండో హీరోయిన్గా చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement