rajinikantha
-
రాజీవ్ హంతకులను విడుదల చేయాలి : రజనీ
సాక్షి, చెన్నై : మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హంతకులను విడుదల చేయాలని తమిళ నటుడు, సూపర్ స్టార్ రజనీకాంత్ కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మానవతా దృక్పధంతో స్పందించి శిక్ష అనుభవిస్తున్న ఏడుగురు హంతకులను విడుదల చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాజీవ్ హంతకులు తెలీదు అనడానికి తానేమి మూర్ఖుడిని కాదని.. ఈ విషయంపై గతంలో ఆయనపై వచ్చిన విమర్శలను రజనీ తిప్పికొట్టారు. మంగళవారం చెన్నైలో రజనీ ఓ సమావేశంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎలాంటి పార్టీ అనేది ప్రజలే నిర్ణయిస్తారని.. ప్రతిపక్షాలను మాత్రం అది ప్రమాదకర పార్టీనే అని అన్నారు. ఇన్ని పార్టీలు, ఇంతమంది నేతలను ఎదుర్కొంటున్నాడంటే ప్రధాని మోదీ బలమైన నేతనే అని ఆయన కొనియాడారు. తానింకా పూర్తిస్థాయి రాజకీయాల్లోకి రాలేదని ఈ సందర్భంగా రజనీ తేల్చిచెప్పారు. కాగా రాజీవ్ హంతకుల విషయంలో తమిళనాడు ప్రభుత్వం సానుభూతితో ఉన్నా.. కేంద్రం మాత్రం ససేమిరా అంటున్న విషయం తెలిసిందే. ఈ విషయం సుప్రీంకోర్టు పరిశీలనలో ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. -
కబాలి మేనియా
-
'లింగ'కు రజనీ సూపర్‌ఫాస్ట్ డబ్బింగ్!
సూపర్‌స్టార్ రజనీకాంత్ వయస్సు.. 63 ఏళ్లు. కానీ ఈ వయసులో కూడా ఆయన మెరుపువేగంతో డబ్బింగ్ చెప్పేసి అందరినీ ఆశ్చర్యచకితులను చేశారు. 'లింగ' చిత్రం కోసం ఆయన తన మొత్తం డబ్బింగ్ పనిని కేవలం 24 గంటల్లో పూర్తిచేయడంతో యూనిట్ అంతా నోళ్లు వెళ్లబెట్టారట. సాధారణంగా హీరో పాత్రధారి తనకు తాను డబ్బింగ్ చెప్పుకోవాలన్నా కూడా కొన్ని రోజులు పడుతుందని, అక్కడ సీన్ వస్తున్నప్పుడు పెదాల కదలికలకు అనుగుణంగా సరిగ్గా సరిపోయేలా డబ్బింగ్ చెప్పాల్సి ఉంటుందని, అందుకు రెండు మూడు టేకులు కూడా అవసరం అవుతాయని చిత్ర యూనిట్ వర్గాలు తెలిపాయి. కానీ రజనీకాంత్ మాత్రం సింగిల్ టేక్‌లోనే చాలావరకు డైలాగులు డబ్బింగ్ చెప్పేశారన్నారు. 'లింగ' తమిళ వెర్షన్‌కు ఇక రెండు పాటల షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది. మిగిలిన షూటింగ్ అంతా పూర్తయింది. ఓ పాట కోసం యూరప్ వెళ్దామని భావిస్తున్నారు. అక్కడ సోనాక్షి సిన్హా, రజనీకాంత్‌ల మీద పాట చిత్రీకరిస్తారు. కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా... రజనీ పుట్టిన రోజైన డిసెంబర్ 12వ తేదీన విడుదల కానుంది. అనుష్క ఈ సినిమాలో రెండో హీరోయిన్గా చేస్తోంది.