
డబుల్ ధమాకా
అదృష్టం నటి అనుష్కను శనిలా వెంటాడుతోంది. శని, పడితే అంత సులభంగా వదలదంటారు. అలాగే ప్రస్తుతం అదృష్టం అనుష్కను తరుముతోంది. సాధారణంగా రెండు భాషల్లో ప్రాచుర్యం పొందిన హీరోయిన్లు తరువాత కాలంలో ఒకే భాషకు పరిమితమవుతుంటారు. అరయితే అనుష్కకు ఇది వర్తించదు. ఎందుకంటే ఈ బ్యూటీ నటించే ప్రతి సినిమా తమిళం, తెలుగు రెండు భాషల్లోను విడుదలవుతుంది. ప్రస్తుతం అనుష్క నటించే చిత్రాలన్నీ అలాంటి భారీ క్రేజీ చిత్రాలే కావడం విశేషం. ఇంతకు ముందు అనుష్క ఏ భాషలో నటించిన చిత్రాలు ఆ భాషకే పరిమితం అయ్యాయి. అయితే అరుంధతి చిత్రం తరువాత పరిస్థితి మారింది. తమిళం, తెలుగు భాషల్లో ఈమె క్రేజీ అనూహ్యంగా పెరిగింది.
అనుష్క ఒక్క భాషలో నటించిన చిత్రం కచ్చితంగా మరో భాషలోను విడుదలవుతుంది. ఇక ఇప్పడయితే ఆమె నటిస్తున్న చిత్రాలన్ని ద్విభాషా చిత్రాలే. అలాగే అత్యంత భారీ బడ్జెట్ చిత్రాలు కావడం గమనార్హం. అనుష్క ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్ చిత్రాలతోపాటు హీరోలతో రొమాన్స్ చేసే చిత్రాల్లోనూ నటిస్తూ ఆల్‌రౌండర్‌గా తన సత్తా చాటుకుంటున్నారు. రుద్రమదేవి అనే హిస్టారికల్ మూవీలో రాణి రుద్రమాదేవిగా తన నట విశ్వరూపం ప్రవర్తిస్తున్నారు. త్వరలో విడుదలకు సిద్ధం అవుతున్న ఈ చిత్రం తమిళ ప్రేక్షకులను అలరించనుంది. మరో చరిత్రాత్మక కథా చిత్రం బాహుబలి. ఈ చిత్రంలోను అనుష్క వీరప్రతాపాలను ప్రదర్శించనున్నారు. ఇది కూడా బహుభాషా చిత్రమే.
తమిళంలో ఈ ముద్దుగుమ్మ రజనీకాంత్‌తో తొలిసారి జతకడుతున్న చిత్రం లింగా. ఈ చిత్రంలో మరో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా నటిస్తున్నారు. అనుష్క తొలి సారిగా జతకడుతున్న మరో హీరో అజిత్. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రంలో మరో హీరోయిన్‌గా త్రిష నటించడం గమనార్హం. గౌతమ్ మీనన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం తమిళంతోపాటు తెలుగులోను ఏకకాలంలో తెరకెక్కుతోంది. ఇలా అనుష్క ప్రస్తుతం డబుల్ ధమాకాతో యమా ఖుషీలో ఉన్నారు. ఈనాలుగు చిత్రాల్లో తొలుత రుద్రమాదేవి, ఆ తరువాత రజనీకాంత్ లింగా ఆపై అజిత్, ప్రభాస్ చిత్రాలు వరుసగా తెరపైకి రానున్నట్లు సమాచారం.