అజిత్‌తో అధర చుంబనం | anushka liplock sean with ajit | Sakshi
Sakshi News home page

అజిత్‌తో అధర చుంబనం

Published Fri, May 2 2014 10:35 PM | Last Updated on Sat, Sep 2 2017 6:50 AM

అజిత్‌తో  అధర చుంబనం

అజిత్‌తో అధర చుంబనం

 హిందీ సినీపరిశ్రమ సంస్కృతి నిదానంగా దక్షిణాదిని కూడా ఆవహించేస్తోంది. ఇక్కడి హీరోయిన్లు కూడా లిప్‌లాక్‌లకు రెడీ అయిపోతున్నారు. శింబుతో నయనతార, బన్నీతో కాజల్, నాగచైతన్యతో సమంత ఇప్పటికే లిప్‌లాక్ సన్నివేశాల్లో నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ జాబితాలోకి అనుష్క కూడా చేరారు. ఇంతకీ అనుష్క అధరాలను చుంబించిన ఆ హీరో ఎవరో తెలుసా? అజిత్. ప్రస్తుతం ఈ జంట గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే. కథ రీత్యా ఇందులో శృంగారభరితమైన ఓ సన్నివేశం ఉంది. ఆ సీన్‌ని గౌతమ్ చాలా బోల్డ్‌గా తీశారని కోలీవుడ్ సమాచారం.

తాను అనుకున్నట్లు ఆ సన్నివేశం రావడానికి గౌతమ్ కొన్ని కఠిన నిర్ణయాలు కూడా తీసుకున్నారట. యూనిట్ మొత్తాన్నీ బయటకు పంపించేసి, తాను, అజిత్, అనుష్క, కెమెరామేన్ మాత్రమే లొకేషన్లో ఉండి, ఈ సన్నివేశాన్ని చిత్రీకరించారట. ఈ సీన్‌లో అజిత్, అనుష్క రెచ్చిపోయి నటించారని యూనిట్ సభ్యులే బాహాటంగా చెప్పుకుంటున్నారు. ఈ సన్నివేశంలో భాగంగానే వీరిద్దరితో లిప్‌లాక్ కూడా చేయించారట గౌతమ్. ఈ సన్నివేశం సినిమాకు హైలైట్ కానుందని కోలీవుడ్ టాక్. గౌతమ్‌మీనన్- అజిత్ సినిమా అంటే... కచ్చితంగా తెలుగులోకి కూడా అనువాదమవ్వడం ఖాయం. సో... అనుష్క-అజిత్‌ల అధర చుంబనాన్ని తెలుగు ప్రేక్షకులు కూడా వీక్షిస్తారన్నమాట.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement