రజనీకాంత్‌తో ఐటమ్ సాంగ్ | Nayantara's Item Number In Rajinikanth's Lingaa | Sakshi
Sakshi News home page

రజనీకాంత్‌తో ఐటమ్ సాంగ్

Published Mon, May 19 2014 10:18 PM | Last Updated on Sat, Sep 2 2017 7:34 AM

రజనీకాంత్‌తో ఐటమ్ సాంగ్

రజనీకాంత్‌తో ఐటమ్ సాంగ్

 రజనీకాంత్ సినిమాలో తమ పేరు రావడమే అదృష్టంగా భావిస్తుంటారు కథానాయికలు. ఆయన సరసన ఒక్క సినిమాలో నటించినా పంట పండినట్టే... అనుకుంటుంటారు. కానీ... నయనతార మాత్రం సూపర్‌స్టార్‌తో సినిమాల మీద సినిమాలు చేసేస్తూ, ఇటీవలి కాలంలో ఆయనతో ఎక్కువ సినిమాలు చేసిన నాయికగా రికార్డుకెక్కేస్తోంది. నయనతార కెరీర్‌లో తొలి బ్రేక్ - ‘చంద్రముఖి’. ఆ సినిమాలో రజనీతో జతకట్టి రాత్రికి రాత్రి స్టార్ హీరోయిన్ అయిపోయింది నయన.
 
 ఆమెతో కలసి నటిస్తే కలిసొస్తోందని అనుకున్నారో ఏమో కానీ... రజనీ తన తర్వాతి సినిమా ‘శివాజీ’లో కూడా నయనతారతో ఓ పాటలో కాలు కదిపారు. ఆ వెంటనే వచ్చిన ‘కథానాయకుడు’ (తమిళంలో ‘కుచేలన్’)లో కూడా రజనీతో జతకట్టేసింది నయన. సూపర్‌స్టార్‌తో కలిసి ఇన్ని సినిమాలు చేసిన ఘనత నేటి తారల్లో నయనతారది మాత్రమే. ఇప్పుడు ఈ వివరణ అంతా దేనికంటే... త్వరలో మరోసారి రజనీ-నయన తెరపై స్టెప్పులేయనున్నారు. రజనీ సరసన అనుష్క, సోనాక్షీ సిన్హా నాయికలుగా నటిస్తున్న ‘లింగా’ చిత్రంలో ఓ కీలక సన్నివేశంలో వచ్చే ఐటమ్‌సాంగ్‌లో నయన నర్తించనున్నట్లు చెన్నై సమాచారం. ఆమె ఐటమ్ సాంగ్ చేయడం ఇదే తొలిసారి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement