రజనీకాంత్ అభిమానులకు గురువారం సన్ పిక్చర్స్ ఓ తీపి వార్త అందించింది. ‘అన్నాత్తే.. దీపావళిక్కు రెడీయా’ (అన్నయ్యా.. దీపావళికి రెడీయా) అంటూ రజనీ వెనక్కి తిరిగి ఉన్న ఒక ఫొటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. రజనీకాంత్ హీరోగా శివ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మించిన చిత్రం ‘అన్నాత్తే’. ఇటీవల వైద్య పరీక్షల కోసం రజనీ అమెరికా వెళ్లిన విషయం తెలిసిందే.
అయితే అక్కడికి వెళ్లక ముందే ఆయన ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేశారు. దాంతో కరోనా లాక్‌డౌన్‌లాంటివి ఏమీ లేకపోతే ముందు అనుకున్నట్లుగానే చిత్రాన్ని నవంబర్ 4న విడుదల చేయాలని సన్ పిక్చర్స్ నిర్ణయించుకుంది. ఆ విషయాన్ని సూచించే విధంగానే గురువారం ట్వీట్ చేశారు. సో.. పండగకి రజనీ సినిమా వస్తే ఆయన అభిమానులకు పండగే పండగ. కీర్తీ సురేశ్, నయనతార, మీనా, ఖుష్బూ తదితరులు నటించిన ఈ సినిమాలో రజనీకాంత్ గ్రామ పెద్ద పాత్రలో కనిపిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment