
సూపర్ స్టార్ రజనీకాంత్.. తనదైన మ్యానరిజం, స్టైల్‌తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. కండక్టర్ నుంచి ఓ స్టార్‌గా ఎదిగాడు. ఆయన సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే థియేటర్లో ఫ్యాన్స్ క్యూ కట్టాల్సిందే. అంతగా అభిమానుల ఆదరణ దక్కించుకున్న ఆయన తాజాగా ‘అన్నాత్తే’ సినిమాతో దీపావళికి బాక్సాఫీస్ బరిలోకి దిగాడు. ఈ సినిమాను తెలుగులో ‘పెద్దన్న’ పేరుతో డబ్ చేసి రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక రజనీకాంత్ సినిమా అంటే ఏ రేంజ్‌లో హంగామా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
చదవండి: పునీత్ సమాధి వద్ద కన్నీటి పర్యంతరమైన హీరో
గతంలో కొన్ని కంపెనీలు రజనీకాంత్ సినిమా చేసేందుకు సెలవులు కూడా ప్రకటించాయి. ఇప్పుడు అన్నాత్తె సినిమా కోసం చెన్నైలోని న్యూవే అనే కంపెనీ తమ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. నవంబర్ 5న అంటే ఈ రోజు తమ ఉద్యోగులకు ఆఫ్ డే లీవ్ ఇస్తున్నట్లుగా ప్రకటించింది. అంతేకాదు.. దీపావళి కానుకలుగా ఉద్యోగులకు అన్నాత్తే మూవీ ఫ్రీ టికెట్స్ ఇస్తున్నట్లుగా అనౌన్స్ చేసింది. అన్నా చెల్లెలు అనుబంధం నేపథ్యంలో తెరకెక్కిన అన్నాత్తె మూవీలో కీర్తి సురేష్ రజినీ చెల్లెలుగా నటించింది. ఇక తలైవా సరసన నయనతార హీరోయిన్గా నటించగా.. మీనా, ఖుష్బూ కీలక పాత్రల్లో పోషించారు.
చదవండి: పెద్దన్న మూవీ రివ్యూ
Comments
Please login to add a commentAdd a comment