peddanna
-
రజనీ కోసం ఉద్యోగులకు హాఫ్ డే లీవ్ ప్రకటించిన చెన్నై కంపెనీ
సూపర్ స్టార్ రజనీకాంత్.. తనదైన మ్యానరిజం, స్టైల్‌తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. కండక్టర్ నుంచి ఓ స్టార్‌గా ఎదిగాడు. ఆయన సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే థియేటర్లో ఫ్యాన్స్ క్యూ కట్టాల్సిందే. అంతగా అభిమానుల ఆదరణ దక్కించుకున్న ఆయన తాజాగా ‘అన్నాత్తే’ సినిమాతో దీపావళికి బాక్సాఫీస్ బరిలోకి దిగాడు. ఈ సినిమాను తెలుగులో ‘పెద్దన్న’ పేరుతో డబ్ చేసి రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక రజనీకాంత్ సినిమా అంటే ఏ రేంజ్లో హంగామా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చదవండి: పునీత్ సమాధి వద్ద కన్నీటి పర్యంతరమైన హీరో గతంలో కొన్ని కంపెనీలు రజనీకాంత్ సినిమా చేసేందుకు సెలవులు కూడా ప్రకటించాయి. ఇప్పుడు అన్నాత్తె సినిమా కోసం చెన్నైలోని న్యూవే అనే కంపెనీ తమ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. నవంబర్ 5న అంటే ఈ రోజు తమ ఉద్యోగులకు ఆఫ్ డే లీవ్ ఇస్తున్నట్లుగా ప్రకటించింది. అంతేకాదు.. దీపావళి కానుకలుగా ఉద్యోగులకు అన్నాత్తే మూవీ ఫ్రీ టికెట్స్ ఇస్తున్నట్లుగా అనౌన్స్ చేసింది. అన్నా చెల్లెలు అనుబంధం నేపథ్యంలో తెరకెక్కిన అన్నాత్తె మూవీలో కీర్తి సురేష్ రజినీ చెల్లెలుగా నటించింది. ఇక తలైవా సరసన నయనతార హీరోయిన్గా నటించగా.. మీనా, ఖుష్బూ కీలక పాత్రల్లో పోషించారు. చదవండి: పెద్దన్న మూవీ రివ్యూ -
పెద్దన్న మూవీ రివ్యూ
టైటిల్ : పెద్దన్న నటీనటులు : రజనీకాంత్, నయనతార, కీర్తి సురేశ్, జగపతిబాబు, ప్రకాశ్ రాజ్, మీనా, ఖుష్బు తదితరులు నిర్మాణ సంస్థ: సన్ పిక్చర్స్ దర్శకత్వం : శివ సంగీతం : డి. ఇమాన్ సినిమాటోగ్రఫీ : వెట్రీ విడుదల తేది : నవంబర్ 4,2021 సూపర్‌స్టార్ రజనీకాంత్ తనదైన స్టైల్లో బాక్సాఫీస్ వద్ద దీపావళి సంబరాలను ప్రారంభించాడు. ‘అన్నాత్తే’ సినిమాతో బాక్సాఫీస్ బరిలోకి దిగాడు. ఈ సినిమాను తెలుగులో ‘పెద్దన్న’ పేరుతో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. టాలీవుడ్లో రజనీకాంత్‌కు ఉన్నఛరిష్మా, స్టామినాను చూసుకుంటే ‘పెద్దన్న’ పెద్ద సినిమాగానే పరిగణించాలి. గతంలో దర్బార్, కబాలి, కాలా, 2.0, పెట్టా వంటి సినిమాలతో తెలుగువారిని పలుకరించిన ఈ సూపర్‌స్టార్ తన స్టామినాకు తగ్గ హిట్‌ను అందుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలో యాక్షన్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న శివ దర్శకత్వంలో తొలిసారి రజనీకాంత్ నటిస్తున్న సినిమా కావడం.. ఈ సినిమాలో కీర్తి సురేశ్.. లేడీ సూపర్ స్టార్ నయనతారతో పాటు సీనియర్ బ్యూటీ మీనా కూడా కీలక పాత్రలో నటిస్తుండటంతో ‘పెద్దన్న’హైప్ క్రియేట్ అయింది. ఎన్నో అంచనాల మధ్య గురువారం(నవంబర్ 4)న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘పెద్దన్న’ను ప్రేక్షకులు ఏమేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం. ‘పెద్దన్న’కథేంటంటే? తూర్పు గోదావరి జిల్లా రాజోలుకు చెందిన వీరన్న(రజనీకాంత్)కు చెల్లి కనకమహాలక్ష్మీ అలియాస్ కనకమ్(కీర్తి సురేశ్) అంటే అమితమైన ప్రేమ. చిన్నప్పుడే అమ్మ చనిపోవడంతో చెల్లిని గారాబంగా పెంచాడు. చెల్లి సంతోషం కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా, తీయడానికైనా వెనకాడడు. అంత ప్రేమగా చూసుకునే అన్నయ్య చూసిన పెళ్లి సంబంధం కాదని.. కనకమహాలక్ష్మీ కలకత్తాకు పారిపోతుంది. అసలు కనకమహాలక్ష్మీ అన్న నిర్ణయాన్ని వ్యతిరేకించి ఎందుకు పారిపోయింది? కలకత్తాలో ఆమెకు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? మరికొద్ది గంటల్లో పెళ్లి ఉండగా పారిపోయిన చెల్లి విషయంలో వీరన్న ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? చెల్లికి వచ్చిన సమస్యలను ఎలా తీర్చాడు? చివరకు ఈ అన్నా చెల్లెళ్లు ఎలా కలిశారు అనేదే ‘పెద్దన్న’కథ. ఎవరెలా చేశారు? సూపర్ స్టార్ రజనీకాంత్‌కు వయసు పెరుగుతున్నా.. స్టామినా మాత్రం తగ్గడంలేదు. తనదైన స్టైల్, యాక్టింగ్‌తో ఇప్పటికీ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తూనే ఉన్నాడు. తాజా సినిమా ‘పెద్దన్న’కూడా పూర్తిగా రజనీకాంత్ జనీ స్టైల్, మ్యానరిజమ్స్, పంచ్ డైలాగుల మీద ఆధారపడింది. గ్రామపెద్ద వీరన్న పాత్రలో ఆయన అద్భుతంగా నటించాడు. తనదైన పంచ్ డైలాగ్స్, యాక్టింగ్‌తో సినిమా భారాన్ని మొత్తం తనపై వేసుకొని నడిపించాడు. తనదైన కామెడీతో నవ్వించే ప్రయత్నం కూడా చేశాడు. ఇక వీరన్న చెల్లెలు కనకమహాలక్ష్మీ పాత్రలో కీర్తి సురేశ్ అద్భుతంగా నటించింది. ఈ సినిమాలో ఆమె పాత్రే కీలకం. కథను మలుపుతిప్పే కనకమ్ పాత్రలో కీర్తి పరకాయప్రవేశం చేసింది. ఎమోషనల్ సీన్స్‌లో అద్భుత నటనను కనబర్చింది. ఇక లాయర్ పార్వతిగా నయనతార తన పాత్రకు న్యాయం చేసింది. విలన్స్‌గా జగపతిబాబు, అభిమన్యు సింగ్ ఆకట్టుకున్నారు. మీనా, ఖుష్బూలతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఎలా ఉందంటే.. ‘పెద్దన్న’కథను పక్కా రజనీకాంత్ ఇమేజ్‌కి సరితూగే విధంగా రాసుకున్నాడు దర్శకుడు శివ. రొటీన్ కథనే కాస్త విభిన్నంగా తెరకెక్కించే ప్రయత్నం చేశాడు. ఫస్టాఫ్ అంతా రజనీ అభిమానులు అశించే డైలాగ్స్, ఫైట్స్, స్టైల్‌తో ముగుస్తుంది. ఇక సెకండాఫ్‌లో కూడా కథలో ఎలాంటి ట్విస్ట్‌లు లేకుండా సింపుల్‌గా సాగుతుంది. ఎన్నో సినిమాల్లో చూసిన చెల్లెలు సెంటిమెంట్ సీన్స్‌తో సెకండాఫ్‌ని నెట్టుకొచ్చాడు. కథలో ఎమోషనల్ సీన్స్ పండించడానికి స్కోప్ ఉన్నా.. దర్శకుడు ఆ దిశగా కసరత్తు చేయలేదనే అభిప్రాయం కలుగుతుంది. అలాగే మీనా, ఖుష్బుల పాత్రలు కూడా పేలవంగా అనిపిస్తాయి.రజనీకాంత్ సినిమా కాబట్టే వాళ్లు ఆ పాత్రలు చేయడానికి ముందుకొచ్చారేమోనని అనిపిస్తుంది. సినిమా ముగుస్తుందనే సమయంలో విలన్స్‌గా జగపతిబాబు, అభిమన్యు సింగ్ పాత్రలను పరిచయం చేసి కథను సాగదీశాడనే అభిప్రాయం కలుగుతుంది. ఇక క్లైమాక్స్ ఫైట్ సీన్స్‌లో కీర్తిసురేశ్ తనను కాపాడుతున్న దెవరో తెలియక అయోమయంగా ముఖం పెట్టడం.. చెల్లికి కనిపించకుండా విలన్స్‌ని అన్న కొట్టడం... ఇవన్నీ రొటీన్ సీన్స్లాగానే అనిపిస్తాయి. ఇక కమర్షియల్ సినిమా ఎండింగ్ స్టైల్లోనే ఈ సినిమా కూడా ముగించాడు దర్శకుడు. స్క్రీన్‌ప్లే కూడా రొటీన్‌గా ఉంటుంది. ఇక టెక్నికల్ విషయాలకొస్తే.. ఇమాన్ సంగీతం పర్వాలేదనిపిస్తుంది. హాలీ హాలీ.. సాంగ్ మినహా మిగతా పాటలేవి ఆకట్టుకోలేకపోయినా.. నేపథ్య సంగీతం మాత్రం అదిరిపోయింది. తనదైన బీజీఎంతో కొన్ని సన్నీవేశాలకు ప్రాణం పోశాడు. వెట్రీ సినిమాటోగ్రఫి బాగుంది. యాక్షన్ సన్నివేశాలను తెరపై చాలా బాగా చూపించాడు. ఎడిటర్ రెబెన్ తన కత్తెరకు చాలా పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
‘పెద్దన్న’మూవీ ట్విటర్ రివ్యూ
సూపర్‌స్టార్ రజనీకాంత్ తనదైన స్టైల్లో బాక్సాఫీస్ వద్ద దీపావళి సంబరాలను ప్రారంభించాడు. ‘అన్నాత్తే’ సినిమాతో బాక్సాఫీస్ బరిలోకి దిగాడు. ఈ సినిమాను తెలుగులో ‘పెద్దన్న’ పేరుతో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. టాలీవుడ్లో రజనీకాంత్‌కు ఉన్నఛరిష్మా, స్టామినాను చూసుకుంటే ‘పెద్దన్న’ పెద్ద సినిమాగానే పరిగణించాలి. గతంలో దర్బార్, కబాలి, కాలా, 2.0, పెట్టా వంటి సినిమాలతో తెలుగువారిని పలుకరించిన ఈ సూపర్‌స్టార్ తన స్టామినాకు తగ్గ హిట్‌ను అందుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలో యాక్షన్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న శివ దర్శకత్వంలో తొలిసారి రజనీకాంత్ నటిస్తున్న సినిమా కావడం.. ఈ సినిమాలో కీర్తి సురేశ్.. లేడీ సూపర్ స్టార్ నయనతారతో పాటు సీనియర్ బ్యూటీ మీనా కూడా కీలక పాత్రలో నటిస్తుండటంతో ‘పెద్దన్న’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమా ప్రీవ్యూస్ పడడంతో ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు.. అసలు కథేంటీ.. కథనం ఎలా ఉంది.. ఏ మేరకు తెలుగు వారిని ఈ సినిమా ఆకట్టుకుంటోంది.. మొదలగు అంశాలను ట్విటర్లో చర్చిస్తున్నారు.. అవేంటో చూద్దాం. Old school melodrama of brother sister sentiment didn't work initially with lot of filler scenes but movie picks pace exactly after an hour and gets intense and massy by end of first half #Peddanna #Annaththe #AnnaattheDeepavali #AnnaattheThiruvizha #AnnaattheFDFS — HarveySpector (@PoolaShirt) November 4, 2021 ఫస్ట్ హాఫ్ చాలా నీరసంగా వుంది.. అవుట్ డేటడ్ కామెడీ.. ఓవర్ సెంటిమెంట్ సీన్స్ చిరాకు తెప్పిస్తాయి.. రజిని మార్క్ మాస్ సీన్స్ మాత్రమే హైలెట్ అని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. Just finished FDFS in #melbourne. @directorsiva best till date. It’s a sure shot industry hit. Mark my tweet. #Rajinikanth awesome sir. #Annaatthe — Glitz (@Jesse19100220) November 4, 2021 #Annaatthe first half - Superstar Rajinikanth is in fine form and his sister sentiment with @KeerthyOfficial picks up the momentum only towards the intermission with a twist. The interval bang with a powerful action episode packs a punch. @immancomposer songs are a big plus! — Rajasekar (@sekartweets) November 4, 2021 Basic gaa eedi @rajinikanth divasam yeppudoo chesesaaru..aa Sankarudi valla kona voopiri tho kottukunnaadu Robo nunchi Shivaji varaku..tarvatha aa sankarudu koodaa kaapaadaleka poyyaadu..yendhukuraa Rajini ga distributors ante antha kaksha niku💦💦 #Annaatthe #Peddanna — pSPk (@SimplySukiP) November 4, 2021 Okayish 1st half...Thalaivar pure mass from pre-interval to interval block🔥#Annaatte #Peddanna https://t.co/ehuMGyB9Se — 𝖀𝖕𝖕𝖎 (@__UpendraDhfm) November 4, 2021 One word Review: BLOCKBUSTER #Annaatthe: 🌟🌟🌟🌟 (4/5) 1½ Good in parts,2½ Bang for buck. Tantalizing Post-Interval sequence & climax.#Rajinikanth engages more with his lively emotions than action. Keerthi- Commendable Jaggu bhai- vicious villain role👌@directorsiva 🔥🔥 — Arun Kumar (@Prasannaactor) November 4, 2021 #Peddanna okkati ante okka show kuda fast filling lo ledhu Motham green ye ..oreyy bheemji entha pani chesav ra ayya — Nippu NagaRRRaju (@GopiNagaTeja) November 4, 2021 #Annaatthe First Half Report : “TORTURE UNLIMITED” 👉1950’s Outdated Story 👉Forced Emotions 👉Over-action Scenes & Over-action Comedy 👉ONLY POSITIVE - “MASS INTERVAL FIGHT”#peddanna #Rajini #Rajinikanth #Nayanthara #KeerthySuresh #AnnaattheReview #AnnaattheDeepavali — PaniPuri (@THEPANIPURI) November 4, 2021 #Annaatthe 1st half: #SuperstarRajinikanth's one-man show! @immancomposer songs are a highlight. Story revolves around brother - sister relationship; high on emotional melodrama! Interval block shot - massy & sentimental. — MALAYSIA RJ ARIVU (@MalaysiaRJArivu) November 4, 2021 #Annaatthe - A mashup of Dir Siva's earlier blockbusters with #SuperstarRajinikanth as the Annan who'll go to any lengths to protect his Thangam sister. Heavy sentimental action melodrama with Imman's overpowering score. Valiant #Thalaivar's efforts & evergreen screen presence👍 — Kaushik LM (@LMKMovieManiac) November 4, 2021 Hearing Super Duper Reviews For #Annaatthe Movie.. Congrats And Wishing For Massive BB Hit To Superstar @rajinikanth Sir And Our Dear @directorsiva Sir From THALA AJITH Fans ❤❤#Valimai || #Thala || #AjithKumar pic.twitter.com/RFFefOCuQ5 — EMPEROR AJITH FANS™ (@EmperorAjithFC) November 4, 2021 Trailer Routine Unna Banda Siva Gadu Masssss Audience Ki Min Guarantee Movie Ichi Untadani Anukunnane 😣 Asalu Families Chuse Scope Ivvaleda Kamal ? #Annaatthe #Peddanna https://t.co/m0WAFLk7JC — gupta (@guptanagu8) November 4, 2021 Hyderabad It's #HappyDeepavali morning.. People will be busy. But tickets are still getting booked on #bookmyshow early in the morning#Annaatthe #AnnaattheDeepavali #AnnaattheThiruvizha #Peddanna #PeddannaDeepavali #PeddannaFDFS #AnnaattheFDFS #AnnaattheReview — The Cursed Knight™ (@thecursedknight) November 4, 2021 First Half: Annaatthe is going to be one of the most emotional movies of Thalaivar.. Going to work for B and C like anything.. Siva Hit six in the pitch which works for him🔥🔥🔥🔥#AnnaattheDeepavali #AnnaattheFDFS #Annaatthe #AnnaattheReview#Rajinikanth pic.twitter.com/6dMbt6cIfm — midhun (@midhuntweets4u) November 4, 2021 #Thalaivar and @immancomposer hold the entire movie firmly🙌 Movie is almost similar to Viswasam, Vedalam & Thirupachi.. Will workout big time with family audience and ladies ✌️ 3-4 mass theatre moments for fans🔥 Tamilnadu box office will be on fire🥳#Annaatthe — ரௌடி (@Rowdy_3_) November 4, 2021 -
ఈ వారం ఓటీటీ, థియేటర్లో అలరించే చిత్రాలివే..
Diwali 2021 Movie Release List: కరోనా తగ్గుముఖం పట్టిన అనంతరం ప్రతి వారం కొత్త సినిమలు థియేటర్లో సందడి చేస్తున్నాయి. ఇక దసరా, దీపావళి సందర్భంగా భారీ బడ్జెట్ చిత్రాలు థియేటర్లోకి క్యూ కడుతున్నాయి. దసరా సందర్భాంగ ఇప్పటికే ‘పెళ్లి సందD, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్, వరుడు కావలెను వంటి తదితర చిత్రాలు వెండితెరపై మెరిసి ప్రేక్షకులకు బాగా అలరించాయి. ఇక దీపావళి సందర్భంగా అగ్ర హీరోల సినిమా థియేటర్లోకి వచ్చేందు రెడీ అయ్యాయి. అలాగే ఈ పండుగ సంబరాలను మరింత రెట్టింపు చేసేందుకు ఓటీటీలోకి సైతం పలు సినిమాలు రాబోతున్నాయి. మరి ఆ చిత్రాలు ఏంటో తెలుసుకోవాలంటే ఇక్కడోలుక్కేయండి. ‘ఎనిమి’లుగా విశాల్, ఆర్యలు యాక్షన్ హీరో విశాల్, మ్యాన్లీ స్టార్ ఆర్యల క్రేజీ కాంబినేషన్లో యాక్షన్ ఎంటర్టైనర్ రాబోతున్న చిత్రం ‘ఎనిమి. ఇది విశాల్ 30వ చిత్రం కాగా, ఆర్య 32వ సినిమా. ‘గద్దల కొండ గణేష్’ ఫేమ్ మృణాళిని రవి, మమతా మోహన్‌దాస్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్ ఇందులో కీలక పాత్రలో నటించాడు. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో మినీ స్టూడియోస్ పతాకంపై వినోద్ కుమార్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు. దీపావళి సందర్భంగా ఈ సినిమా కూడా నవంబరు 4న తమిళ/తెలుగు భాషల్లో థియేటర్లలో విడుదల కానుంది. దీపావళికి వస్తున్న ‘పెద్దన్న’ సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం ‘అన్నాత్తే’. ఈ మూవీని తెలుగులో సైతం ‘పెద్దన్న’గా దీపావళి సందర్భంగా తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న సంగతి తెలిసిందే. యాక్షన్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్గా అలరించబోతోంది. ఇక కీర్తి సురేశ్ రజనీకి సోదరిగా కనిపించనుండగా.. సీనియర్ నటీమణులు మీనా, ఖుష్బులు కీలక పాత్రలో కనిపించబోతున్నారు. నవంబర్ 4న తమిళ/తెలుగులో భాషల్లో థియేటర్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కరోనా తర్వాత థియేటర్లో విడుదల అవుతున్న తొలి అగ్ర హీరో మూవీగా రజనీది కావడం విశేషం. మెహ్రీన్, సంతోష్ శోభన్ల్లా ‘మంచి రోజులు వచ్చాయి’ సంతోష్ శోభన్, మెహ్రీన్ జంటగా మారుతి తెరకెక్కించిన చిత్రం ‘మంచి రోజులు వచ్చాయి’. యువీ కాన్సెప్ట్స్, మాస్ మూవీ మేకర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. అనూప్ రూబెన్స్ స్వరాలందించారు. దీపావళి పండగను పురస్కరించుకుని ఈనెల 4న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. మారుతి శైలిలో సాగే విభిన్నమైన కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. అక్షయ్ కుమార్ ‘సూర్యవంశీ’ అక్షయ్‌కుమార్, కత్రినాకైఫ్ ప్రధాన పాత్రల్లో నటించిన యాక్షన్ చిత్రం ‘సూర్యవంశీ’. రణ్‌వీర్‌సింగ్, అజయ్‌దేవ్‌గణ్ కీలక పాత్రలు పోషించారు. రోహిత్‌శెట్టి దర్శకత్వం రూపొందిన ఈ చిత్రం గతేడాది విడుదల కావాల్సింది. కానీ కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. ఈ ఏడాది వేసవిలో విడుదల చేయాలని భావించినా సెకండ్‌వేవ్ కారణంగా మరోసారి ఈ మూవీ విడుదల వాయిదా పడింది. చివరకు ఈ దీపావళి కానుకగా థియేటర్లో సందడి చేసేందుకు నవంబరు 5న ప్రేక్షకుల ముందుకు ఈ మూవీ రాబోతోంది. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్, రోహిత్‌శెట్టి పిక్చర్స్, ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. సూపర్ హీరోస్ ‘ఇటర్నల్స్’ సూపర్ హీరోస్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ హాలీవుడ్. మార్వెల్ కామిక్స్ నుంచి ఎందరో సూపర్‌హీరోలు ప్రేక్షకులను అలరించారు. అలా మరోసారి అలరించేందుకు ‘ఇటర్నల్స్’ వస్తున్నారు. థానోస్ తర్వాత భూమిని నాశనం చేసేందుకు వస్తున్న అతీంద్రియ శక్తులైన ఏలియన్స్‌ను కొందరు సూపర్ హీరోలు ఎలా ఎదుర్కొన్నారు? ఈ క్రమంలో వాళ్లకు ఎదురైన సవాళ్లు ఏంటి? ఇంతకాలం వాళ్లు ఎక్కడ ఉన్నారు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. క్లోవీజావ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇటర్నల్స్’ నవంబరు 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఓటీటీలోకి వచ్చే చిత్రాలివే! సూర్య జై భీమ్ మాస్ హీరోగా ఎంతో క్రేజ్ సంపాదించుకున్న హీరో సూర్య అప్పుడప్పుడు వైవిధ్యమైన పాత్రల్లో ప్రేక్షకులను అలరిస్తుంటారు. అలాంటి పాత్రలో ఆయన నటిస్తూ.. స్వీయ నిర్మాణంలో రూపొందించిన తాజా చిత్రం ‘జై భీమ్’. తాసే జ్ఞానవేల్ దర్శకుడు. వాస్తవ సంఘటనల ఆధారంగా కోర్టు నేపథ్యంలో ఈ మూవీ రూపొందించారు. ‘లా అనేది ఓ శక్తిమంతమైన ఆయుధం. ఎవరిని కాపాడటం కోసం మనం దాన్ని ఉపయోగిస్తున్నామన్నదే ముఖ్యం’ అంటూ ట్రైలర్లో సూర్య చెప్పిన డైలాగ్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నవంబరు 2న అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ విడుదల కానుంది. సందీప్ కిషన్ ‘గల్లీ రౌడీ’ సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన వినోదభరిత చిత్రం ‘గల్లీ రౌడీ’. కొవిడ్ సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల్ని అలరించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు రాబోతోంది. ప్రముఖ ఓటీటీ డిస్నీ+ హాట్‌స్టార్‌లో నవంబరు 4 నుంచి స్ట్రీమింగ్ కానుంది. జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కోన ఫిల్మ్ కార్పొరేషన్, ఎంవీవీ సినిమాస్ సంస్థలు నిర్మించాయి. నేహాశెట్టి, బాబీ సింహా, హర్ష, వెన్నెల కిశోర్, పోసాని కృష్ణమురళి తదితరులు కీలక పాత్రలు పోషించారు. సుధీర్ బాబు ‘శ్రీదేవీ సోడా సెంటర్’ కొవిడ్ సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల్ని అలరించిన చిత్రాల్లో ‘శ్రీదేవి సోడా సెంటర్’ ఒకటి. వెండితెరపై అలరించిన ఈ చిత్రం ఇప్పుడు బుల్లితెరపై సందడి చేసేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ‘జీ 5’లో నవంబరు 4 నుంచి స్ట్రీమింగ్ కానుంది. సుధీర్ బాబు, ఆనంది జంటగా నటించిన చిత్రమిది. ‘పలాస 1978’ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వం వహించారు. -
పంచ్ డైలాగ్స్ తో దుమ్మురేపిన సూపర్ స్టార్
-
పెద్దన్న టీజర్ అదిరింది.. రజనీ యాక్షన్ మాలులుగా లేదుగా!
సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం అన్నత్తె. యాక్షన్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో కీర్తి సురేష్.. లేడీ సూపర్ స్టార్ నయనతారతో పాటు సీనియర్ బ్యూటీ మీనా కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో మరో సీనియర్ స్టార్ హీరోయిన్ ఖుష్బు కూడా నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమాను తెలుగులో పెద్దన్న అనే టైటిల్ తో విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ని విక్టరీ వెంకటేశ్ విడుదల చేశాడు. రజనీకాంత్ ఫ్యాన్స్ కోరుకునే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉన్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతంది. రజనీకాంత్ లుక్స్, నటన ఆకట్టుకునేలా ఉన్నాయి. ‘పల్లెటూరోడు కోప్పడితే.. ఉప్పెనరా.. వాడికి అడ్డూ లేదు.. ఒడ్డూ లేదు’ అనే డైలాగ్ ఆకట్టుకునేలా ఉన్నాయి. దీపావళి సందర్భంగా ఈ చిత్రం నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. -
ప్రభోదానంద ఆశ్రమం అసలు కథ!
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ప్రభోదానంద ఆశ్రమం... ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైన పేరు. అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలోని ఈ ఆశ్రమంలో గణేశ్ నిమజ్జనం సందర్భంగా జేసీ వర్గీయులు, ఆశ్రమ నిర్వాహకులకు మధ్య తలెత్తిన ఘర్షణ మూడు రోజుల పాటు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఎట్టకేలకు సోమవారం భక్తులను ఎవరి ఊళ్లకు వాళ్లను పంపడంతో వివాదానికి తెరపడింది. ఈ క్రమంలో అసలు ప్రభోదానంద ఎవరు? బోధనలేంటి? ట్రస్టు కార్యకలాపాలు, జేసీ బ్రదర్స్‌తో వైరం ఎలా మొదలైంది? అనే అంశాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం ఇదీ. వైద్యుడిగా సేవలు, ఆథ్యాత్మిక పుస్తకాల రచన తాడిపత్రి మండలం అమ్మలదిన్నెకొత్తపల్లికి చెందిన గుత్తా పెద్దన్న చౌదరి ఆర్మీలో వైర్లెస్ ఆపరేటర్‌గా పని చేశారు. తర్వాత ఆర్ఎంపీ వైద్యుడిగా కొన్నాళ్లు సేవలందించారు. ప్రాచీన ఆయుర్వేదంపై పుస్తకాలు రాశారు. మొదటి నుంచి ఆధ్యాత్మిక చింతనతో జ్ఞానబోధపై పుస్తకాలు రచించారు. 1978లో తాడిపత్రి సమీపంలోని నందలపాడులో ఆశ్రమం స్థాపించారు. గుత్తా పెద్దన్న చౌదరి పేరును ప్రభోదానంద యోగీశ్వరులుగా మార్చుకున్నారు. భగవద్గీత, బైబిల్, ఖురాన్ సందేశాలను మిళితం చేసి ప్రభోదానంద ‘త్రైతసిద్ధాంతం’ రూపొందించి పుస్తకాలు రాశారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మల్లిక అనే మహిళను వివాహం చేసుకున్నారు. కులాంతర వివాహాలను ప్రోత్సహించారు. జేసీ బ్రదర్స్‌తో వైరానికి బీజం మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య సమయంలో తాడిపత్రిలో పలువురు బీజేపీ సానుభూతిపరుల దుకాణాలు, ఆస్తులు ధ్వంసమయ్యాయి. ‘టైగర్’ ఆలె నరేంద్ర అప్పుడు తాడిపత్రిలో పర్యటించి బీజేపీ కార్యకర్తలను పరామర్శించారు. ప్రభోదానంద బీజేపీ సానుభూతిపరుడు. వేణుగోపాల్‌రెడ్డి అనే బీజేపీ నేత నాడు కాంగ్రెస్‌లో ఉన్న జేసీ బ్రదర్స్‌కు వ్యతిరేకంగా నిలబడ్డారు. అయన్ను తరిమికొట్టాలని జేసీ బ్రదర్స్ ప్రయత్నించగా ప్రభోదానంద అడ్డుకుని ఆశ్రయం కల్పించారు. దీంతో ఆశ్రమంపై దాడికి దిగి ఖాళీ చేయించారు. ప్రభోదానంద అనంతపురంలో ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ ఓ వ్యక్తి ద్వారా ఆశ్రమాన్ని ఖాళీ చేయించే ప్రయత్నం జరిగినా ప్రభోదానంద గట్టిగా ఎదుర్కొన్నారు. ఓ రోజు చికిత్స కోసం అనంతపురం ఆస్పత్రికి వెళ్లిన ఓ మహిళతోపాటు ప్రభోదానంద మూడేళ్ల కుమారుడు యుగంధర్‌ను కొందరు చంపేశారు. ఆశ్రమం బత్తలపల్లికి మార్చినా అక్కడ కూడా అదే పరిస్థితులు ఎదురుకావడంతో రాష్ట్రం వదిలి కర్ణాటకలోని కంప్లి చేరుకున్నారు. పుస్తక వ్యాపారమే ప్రధానం తాడిపత్రి ఆశ్రమంలో అత్యాధునిక టెక్నాలజీ కలిగిన భారీ ప్రింటింగ్ ప్రెస్ ఉంది. ఇక్కడ పుస్తకాలు ముద్రిస్తుంటారు. పలు భాషల్లోకి ప్రభోదానంద బోధనలను తర్జుమా చేసి పుస్తకాలు విక్రయిస్తారు. ఇదే వీరి ప్రధాన వ్యాపారం. ఆయన భక్తుల్లో హిందువులతో పాటు ముస్లింలు, క్రైస్తవులు ఉన్నారు. తాను భగవంతుడిని కృష్ణుడి రూపంలో పూజిస్తానని ఇతర మతాలవారు వారి ఇష్ట ప్రకారం పూజించుకోవచ్చని చెబుతారు. భక్తులు ఆశ్రమానికి భారీగా విరాళాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. నిధులు అవసరమైతే భారీగా విరాళాలు ఇచ్చే భక్తులూ ఆయనకున్నారు. బీజేపీలో చేర్చుకోవద్దని ఒత్తిడి ప్రభోదానంద కుమారుడు యోగానంద చౌదరిని బీజేపీలో చేర్చుకోవద్దని ఉన్నత స్థాయిలో జేసీ ప్రభాకర్‌రెడ్డి తీవ్ర ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. ప్రభోదానంద హిందూ వ్యతిరేకి అని, యోగానందను పార్టీ నుంచి బహిష్కరించాలని ఢిల్లీ స్థాయిలో ఫిర్యాదులు కూడా చేసినట్లు చెబుతున్నారు. అయితే ఆశ్రమాన్ని సందర్శించిన బీజేపీ నేతలు దీన్ని పట్టించుకోలేదని తెలిసింది. 12 ఏళ్ల తర్వాత తిరిగి తాడిపత్రికి ప్రభోదానంద 12 ఏళ్ల క్రితం తాడిపత్రి సమీపంలోని చిన్నపొలమడలో తిరిగి ఆశ్రమం స్థాపించారు. ప్రభోదానంద ఆశ్రమంలో మూడు వైపులా భవనాలున్నాయి. జేసీ ప్రభాకర్‌రెడ్డి అక్కడికి సమీపంలోనే ఇళ్లు కొనుగోలు చేశారు. ఆశ్రమ నిర్మాణానికి కూలీలు రాకుండా అడ్డుకోవడంతో ఇతర ప్రాంతాల నుంచి రప్పించారు. నీటిని నిలిపివేయడంతో సొంతంగా బోర్లు ఏర్పాటు చేసుకున్నారు. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ ప్రభోదానంద స్థిరపడ్డారు. ఆశ్రమంలో పౌర్ణమి, అమావాస్య నాడు జరిగే ప్రత్యేక బోధనల కోసం వేల సంఖ్యలో భక్తులు హాజరవుతుంటారు. అనంతపురం జిల్లాలో ఆయనకు 25 వేల మంది భక్తులు ఉంటారని అంచనా. ఇందులో 15 వేల మంది తాడిపత్రి నియోజకవర్గానికి చెందిన వారే. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశాతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రభోదానందకు భక్తులు ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికా, థాయ్‌లాండ్, జపాన్, ఆస్ట్రేలియాలో బోధనలు సాగుతున్నాయి. రెండేళ్లుగా ప్రభోదానంద ఎక్కడున్నారో తెలియదు. ఆయన ప్రసంగాలను వీడియో తీసి యూట్యూబ్‌లో అప్లోడ్ చేస్తారు. వాటిని ఆశ్రమంలోని తెరలపై ప్రసారం చేస్తున్నారు. జేసీ బ్రదర్స్‌తో వైరం తారస్థాయికి జేసీ బ్రదర్స్‌ను గట్టిగా ఎదుర్కోవాలంటే రాజకీయ అండదండలు అవసరమని భావించిన ప్రభోదానంద కుమారులు జలంధర్ చౌదరి, యోగానంద చౌదరిలు గతేడాది ఏప్రిల్‌లో అప్పుడు మంత్రిగా ఉన్న మాణిక్యాలరావు సమక్షంలో బీజేపీలో చేరారు. ప్రభోదానందకు మణిందర్ చౌదరి అనే తనయుడు కూడా ఉన్నాడు. తాడిపత్రి వద్ద ఆశ్రమం నిర్మాణ సమయంలో ఇసుక సరఫరా కాకుండా అడ్డుకోవడంతో నిర్వాహకులు హెచ్ఆర్సీని ఆశ్రయించడంతో జేసీ ప్రభాకర్‌రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఈ ఘటన తర్వాత తాడిపత్రి సమీపంలోని రావి వెంకటాపురంలో కమ్మ కళ్యాణ మండపాన్ని నిర్మించారు. దీని ప్రారంభోత్సవానికి స్థానిక టీడీపీ నేత కాకర్ల రంగనాథ్ అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిని ఆహ్వానించారు. జలంధర్ చౌదరి కూడా దీనికి హాజరై కళ్యాణ మండపానికి విరాళం ఇచ్చారు. అంతకుముందు పరిటాల శ్రీరాంను కాకర్ల రంగనాథ్ తన నివాసంలో భోజనానికి ఆహ్వానించారు. ఈ ఘటనతో ఒకే సామాజిక వర్గానికి చెందిన వీరంతా ఏకమై జేసీ బ్రదర్స్‌కు వ్యతిరేకంగా పనిచేయాలని నిర్ణయించారు. ఈ పరిణామంతో జేసీ బ్రదర్స్ ఆత్మరక్షణలో పడ్డారు. ఆశ్రమానికి సంబంధించి భక్తులు భారీ సంఖ్యలో ఉండటం, వచ్చే ఎన్నికల్లో తమకు వ్యతిరేకంగా పనిచేస్తారనే ఉద్దేశంతో గణేశ్ నిమజ్జనం ఘటనను అస్త్రంగా వాడుకున్నారు. గణేశ్ నిమజ్జనం సందర్భంగా విగ్రహాన్ని ఓ ఆటోలో తీసుకెళ్లారు. వెనుక రెండు ట్రాక్టర్లలో రాళ్లు తరలించారు. ఆశ్రమం వద్ద జరిగిన గొడవ అంతా అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. ఎవరు ముందు దాడికి దిగారు? ఏం జరిగిందనేది కెమెరాలు పరిశీలిస్తే స్పష్టమవుతుంది. -
అప్పులబాధతో ఆగిన రైతన్న గుండె
కనగానపల్లి: అప్పుల బాధతో ఆందోళనకు గురైన రైతు గుండెపోటుతో మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. మండల కేంద్రం కనగానపల్లిలోని ఎస్సీ కాలనీకి చెందిన రైతు హరిజన పెద్దన్న (38)కు ఐదు ఎకరాల మెట్ట పొలం ఉంది. అప్పులు చేసి అందులోనే నాలుగు బోర్లు వేయించాడు. అరకొరగా వస్తున్న నీటితోనే కూరగాయలు సాగు చేశాడు. అయితే ఆ నీరు చాలకపోవడం, వర్షాలు సకాలంలో కురవకపోవడంతో పంటలు చేతికి రాలేదు. బోర్లు, పంట పెట్టుబడి కోసం చేసిన అప్పులు రూ.4 లక్షలకు చేరుకున్నాయి. ఓ వైపు అప్పులు, మరోవైపు కుటుంబ పోషణ భారం కావడంతో మనోవేదనకు గురయ్యాడు. ఈ క్రమంలోనే బుధవారం ఉదయం గుండెపోటుకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లేలోపు మార్గం మధ్యలో మృతి చెందాడు. రైతుకు భార్య, ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు, తల్లిదండ్రులు ఉన్నారు. -
కుటుంబకలహాలతో వృద్ధుడు ఆత్మహత్య
శింగనమల : మండలంలోని ఆకులేడు గ్రామంలో కుటుంబ కలహాలతో పెద్దన్న (60) ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం జరిగింది. కుమారుడి అప్పుల విషయంలో ఇంట్లో గొడవ పడడంతో మనస్థాపం చెంది, ఇంట్లోనే ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అతనికి భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని అనంతపురం సర్వజనాస్పత్రికి తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. -
బైక్‌ను ఢీకొన్న కారు--ఇద్దరి దుర్మరణం
అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం కొర్రపాడు గ్రామం వద్ద బైక్‌ను కారు ఢీకొన్న సంఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ సంఘటన సోమవారం ఉదయం జరిగింది. కొర్రపాడు గ్రామానికి చెందిన వడ్డి పెద్దన్న(46), రాధాకృష్ణ(40) ఇద్దరూ ద్విచక్రవాహనంపై సమీపంలోని తోటకు వెళుతుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. దాంతో వాహనం అదుపుతప్పి ఇద్దకూ కిందపడి మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. -
దర్యాప్తు మిస్సింగ్
అనంతపురం జిల్లా కేంద్రంలోని నారాయణరెడ్డి కాలనీలో నివాసం ఉంటున్న పెద్దన్నకు ముగ్గురు కూతుళ్లు. వీరిలో ఒకరైన శిల్ప కర్నూలు దేవనగర్లోని నారాయణమ్మ వసతిగృహంలో ఉంటూ పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతోంది. డిసెంబర్ 21, 2012న కాలేజీకి వెళ్లిన ఈ యువతి అదృశ్యమైంది. జనవరి 2, 2013న తల్లిదండ్రులు కర్నూలు మూడో పట్టణ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. అదే కళాశాలలో బీటెక్ నాల్గో సంవత్సరం చదువుతున్న చిట్టిబాబుపై అనుమానం వ్యక్తం చేసినా.. ఇతను కానిస్టేబుల్ కుమారుడు కావడంతో దర్యాప్తును తొక్కిపెట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. శిల్ప తల్లిదండ్రులు నవంబర్ 11, 2013న ప్రజాదర్బార్‌లో జిల్లా కలెక్టర్‌ను కలిసి తమ గోడు వినిపించారు. ఇప్పటికీ ఆ కేసు మిస్టరీ వీడకపోవడం పోలీసుల నిర్లక్ష్యానికి నిదర్శనం. అదృశ్యం కేసుల్లో పోలీసుల అలసత్వానికి ఇదో ఉదాహరణ మాత్రమే. కర్నూలు, న్యూస్‌లైన్: మతిస్థిమితం సరిగా లేకపోవడం..చదువుపై అనాసక్తి.. ప్రేమించిన వారిని విడిచి ఉండలేకపోవడం.. కారణం ఏదైతేనే ఇంట్లో నుంచి వెళ్లిపోయేవారు ఇటీవల ఎక్కువయ్యారు. ఈ మేరకు పోలీస్స్టేషన్లలో అదృశ్యం కేసులు నమోదవుతున్నాయి. అయితే వాటిని ఛేదించడంలో ఆ శాఖ సిబ్బంది ఉత్సాహం చూపడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఎన్నడూ లేనివిధంగా జిల్లాలో గతేడాది 119 మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. గత నాలుగేళ్లలో 388 మంది మహిళలు తప్పిపోగా తిరిగి ఇళ్లకు చేరుకున్న సంఖ్య అంతంత మాత్రమే. కేసు నమోదు చేసుకుని పత్రికా ప్రకటన ఇవ్వడం తప్ప విచారణపై పోలీసులు ఆసక్తి చూపడం లేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఎమ్మిగనూరు, ఆదోని నియోజకవర్గాల్లోని కొన్ని ప్రాంతాల్లో వివాహితలు ఎక్కువగా కనిపించకుండా పోతున్నారు. పట్టణాల్లో ఉపాధి కల్పిస్తామని ఆశ పెట్టి కొందరు దళారులు వ్యభిచార కూపంలోకి మహిళలను నెడుతున్నారు. వివిధ కారణాల రీత్యా ఇంటి నుంచి బయటికి వెళ్లి అష్టకష్టాలు పడి కొద్ది మంది మాత్రమే కుటుంబ సభ్యుల శ్రమతో ఇంటికి చేరుతున్నారు. పోలీసులు విచారణ జరిపి తప్పిపోయిన వారిని తిరిగి కుటుంబ సభ్యులకు అప్పగించిన కేసులు చాలా తక్కువ. ఇటీవలి కాలంలో విద్యార్థినులు ఎక్కువ సంఖ్యలో కళాశాలలు, పాఠశాలలు, హాస్టళ్ల నుంచి పరారీ అవుతున్నారు. గత నాలుగేళ్లలో 364 మంది ఆడపిల్లలు తప్పిపోగా 324 మంది తిరిగి ఇంటికి చేరుకున్నారు. 40 మంది బాలికలకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఆందోళనలతో పోలీస్ స్టేషన్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.