‘పెద్దన్న’ మూవీ డైరెక్టర్‌కు రజనీ సర్‌ప్రైజింగ్‌ గిఫ్ట్‌ | Rajinikanth Visits Director Siruthai Siva House And Gifted Gold Chain | Sakshi
Sakshi News home page

Rajinikanth: ‘పెద్దన్న’ మూవీ డైరెక్టర్‌కు రజనీ సర్‌ప్రైజింగ్‌ గిఫ్ట్‌

Published Sat, Dec 11 2021 5:08 PM | Last Updated on Sat, Dec 11 2021 6:13 PM

Rajinikanth Visits Director Siruthai Siva House And Gifted Gold Chain - Sakshi

Rajinikanth Surprising Gift To Annatha Director Siruthai Siva: సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ద‌ర్శ‌కుడు పెద్దన్న మూవీ డైరెక్టర్‌ శివ‌కు సర్‌ప్రైజింగ్‌ గిఫ్ట్ ఇచ్చి ఆశ్చర్యపరిచాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయం కోలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. డైరెక్టర్‌ శివ ఇంటికి వెళ్లి మరి రజనీ ఆయనకు బహుమతి ఇవ్వడమే కాకుండా ఆయన కుటుంబ సభ్యులతో మూడు గంటల పాటు ముచ్చటించాడట. కాగా రజనీకాంత్‌ ఇటీవల నటించిన అన్నాత్తై(తెలుగులో ‘పెద్దన్న’ గా విడుదల చేశారు)సూపర్‌ హిట్‌ అయిన నేపథ్యంలో రజనీ స్పెషల్‌గా డైరెక్టర్‌ ఇంటికి వెళ్లాడు. అంతేగాక తనతో ఓ బంగారు చెయిన్‌ను తీసుకెళ్లి డైరెక్టర్‌ శివకు గిఫ్ట్‌గా ఇచ్చాడట.

చదవండి: Pushpa Movie: సమంత స్పెషల్‌ సాంగ్‌పై ట్రోల్స్‌

కాగా రజనీ సడెన్‌గా తన ఇంటికి వెళ్లడమే కాకుండా బాహుమతి ఇవ్వడంతో డైరెక్టర్‌ శివ, అతడి కుటుంబ సభ్యులు ఆనందంలో మునిగితేలుతున్నారు. రజనీకాంత్, మాస్‌ డైరెక్టర్‌ శివ కాంబినేషన్‌లో వచ్చిన ‘అన్నాత్తై’ చిత్రం తెలుగులో ‘పెద్దన్న’ గా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రజనీ స‌ర‌స‌న నయనతార హీరోయిన్‌గా నటించగా కీర్తి సురేశ్‌ సోదరి పాత్రలో కనిపించింది. ఖుష్బూ, మీనా, జగపతి బాబు, ప్రకాశ్‌రాజ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

చదవండి: బయటకొచ్చిన కత్రినా-విక్కీల హల్ది ఫంక్షన్‌ ఫొటోలు

దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ తెలుగులో పెద్ద హిట్ కాక‌పోయిన త‌మిళంలో మంచి వ‌సూళ్లు రాబ‌ట్టింది. ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన అన్నాత్తై ఓటీటీలో కూడా ట్రెండ్‌ అవుతోంది. ఈ క్ర‌మంలో హ్యాపీగా ఫీలైన ర‌జ‌నీ.. శివ ఇంటికి వెళ్లి మరి ఆయనను, అతడి కుటుంబ స‌భ్యుల‌ను పలకరించాడు. అంతేగాక మూడు గంట‌ల‌పాటు వారితో ముచ్చ‌టించాక గోల్డ్ చెయిన్‌ను బ‌హుమ‌తిగా అందజేశాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement