రజనీ నుంచి చాలా నేర్చుకున్నా | Sonakshi Sinha wanted to work in 'Lingaa' to share screen with Rajinikanth | Sakshi
Sakshi News home page

రజనీ నుంచి చాలా నేర్చుకున్నా

Published Sun, Oct 26 2014 11:51 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

రజనీ నుంచి చాలా నేర్చుకున్నా - Sakshi

రజనీ నుంచి చాలా నేర్చుకున్నా

రజనీకాంత్ నుంచి చాలా నేర్చుకున్నానంటోంది బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా. ఈ అమ్మడు లింగా చిత్రంలో రజనీకాంత్‌తో జత కడుతున్న విషయం తెలిసిందే. ఇంతకుముందు కోచ్చడయాన్ చిత్ర సమయంలో రజనీకాంత్ సరసన నటించే అవకాశం రావడం నా అదృష్టం అంటూ ఆ చిత్ర హీరోయిన్ దీపికా పదుకునే పేర్కొంది. విశేషం ఏమిటంటే వీరిద్దరూ సూపర్‌స్టార్ చిత్రాల్లోనే కోలీవుడ్‌కు పరిచయమైన భామలు కావడం. లింగా చిత్రంలో సోనాక్షి సిన్హాతో పాటు అందాల భామ అనుష్క కూడా హీరోయిన్‌గా నటిస్తున్నారు.
 
 ఈ చిత్ర షూటింగ్ కర్ణాటకలో జరిగినప్పుడు తన బసకు సరైన సౌకర్యాలు కలిగించలేదంటూ ట్విట్టర్‌లో పేర్కొని కలకలం సృష్టించిన సోనాక్షి సిన్హా,  ఇప్పుడేమో లింగా చిత్రం లో నటించడం మంచి అనుభవం అంటూ పేర్కొంది. ఈ ముంబయి బ్యూటీ మరోసారి ట్విట్టర్‌లో పేర్కొం టూ లింగా చిత్రంలో నటించడం పూర్తి అయ్యిందన్నారు. ఈ చిత్రంలో నటించే అవకాశం కల్పించిన రజనీ కాంత్‌కు చిత్ర యూనిట్ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానన్నారు. లింగా చిత్రంలో పని చేసిన రోజులన్నీ చాలా సంతోషంగా గడిపినట్లు తెలిపారు. అంతేకాకుండా రజనీ కాంత్ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నానని ట్విట్టర్‌లో సోనాక్షి సిన్హా పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement